Telugu News  /  Telangana  /  Traffic Restrictions And Free Parking Announced For Ganesh Immersion In Hyderabad Check Out Detailed Route Map
ట్యాంక్ బడ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు,
ట్యాంక్ బడ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, (twitter)

Ganesh Immersion Hyd: హుస్సేన్ సాగర్ లో గణేశ్ నిమజ్జనం - వాహనాల పార్కింగ్ ఇక్కడే

08 September 2022, 11:24 ISTHT Telugu Desk
08 September 2022, 11:24 IST

Ganesh Immersion in Hyderabad: గణేశ్ నిమజ్జనానికి వేళైంది. ఇక హుస్సేన్‌ సాగర్‌ ప్రాంతంలో ఎటుచూసిన వినాయక విగ్రహాలే దర్శనమిస్తాయి. భారీ సంఖ్యలో జనాలు తరలిరావటంతో ట్రాఫిక్ష్ ఆంక్షలు విధించారు పోలీసులు. అయితే పార్కింగ్ కు సంబంధించిన వివరాలను కూడా వెల్లడించారు.

Ganesh Immersion at Tank Bund:Hyderabad Ganesh Immersion : హైదరాబాద్ నగరంలో వినాయక చవితి వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. హైదరాబాద్ లో గణేశ్ చతుర్థి అంటే దేశవ్యాప్తంగా ఫేమస్. చాలామంది చూపు ఇటువైపు ఉంటుంది. ఈ మేరకు గణేశ్ ఉత్సవ సమితి కూడా ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు గణేశ్ నిమజ్జనం సందర్భంగా శుక్రవారం నాడు సెలవు ప్రకటించారు. అయితే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఇదిలా ఉంటే హుస్సేన్ సాగర్ కు వచ్చే ప్రజలు... తమ వాహనాలను ఎక్కడ పార్కింగ్ చేసుకోవాలనే దానిపై కూడా పోలీసులు పలు ప్రాంతాలను ఎంపిక చేశారు.

ట్రెండింగ్ వార్తలు

ఇక్కడే పార్కింగ్...

ganesh immersion parking: గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు జనసందోహంగా మారటం ఖాయం. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో పార్కింగ్ ను ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్‌లోని ఎంఎంటీఎస్‌ స్టేషన్‌, ఆనంద్‌నగర్‌ కాలనీ నుంచి రంగారెడ్డి జిల్లా పరిషత్‌ కార్యాలయం వరకు, బుద్ధ భవన్‌ వెనుకవైపు, గోసేవా సదన్‌, లోయర్‌ ట్యాంక్‌బండ్‌, కట్ట మైసమ్మ గుడి, లోయర్‌ ట్యాంక్‌బండ్‌, ఎన్టీఆర్‌ స్టేడియం, నిజాం కళాశాల, పబ్లిక్‌ గార్డెన్స్‌, ఐమాక్స్‌ పక్కన వాహనాలను పార్క్ చేయాల్సి ఉంటుందని నగర పోలీసులు ప్రకటించారు.

భారీ వాహనాలకు నో ఎంట్రీ...

traffic restrictions at tankbund: గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా ప్రధాన శోభాయాత్ర జరిగే మార్గాన్ని పోలీసులు విడుదల చేశారు. ఊరేగింపు మార్గాలు, ఇతర వాహనాలు వెళ్లేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శుక్రవారం ఉ.6 గంటల నుంచి శనివారం ఉ.10 గంటల వరకు ఇతర వాహనాలను అనుమతించబోరు. ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు చెందిన లారీలను శుక్రవారం ఉదయం నుంచి 24 గంటలు నగరంలోకి రానివ్వరు. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చే ఇతర జిల్లాల ప్రాంతాలకు సైతం ప్రభుత్వం సెలవు ప్రకటించింది ప్రభుత్వం. ఆ రోజున ట్రాఫిక్ ఆంక్షలు సైతం ఉన్నాయి. స్కూళ్లు, ఆఫీసులకు వెళ్లాలంటే.. విద్యార్ధులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ కారణంగా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఖైరతాబాద్ గణేశుడిని చూసేందుకు వేల సంఖ్యలో భక్తులు వస్తారు.

ప్రత్యేక ఏర్పాట్లు..

నిమజ్జనం విషయంలో ఓ క్లారిటీ రావటంతో... అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. ఎన్టీఆర్‌ ఘాట్‌ నుంచి నెక్లెస్‌ రోడ్డు మార్గంలో సాగర్‌ ఒడ్డున 9కి పరిమితం చేసిన క్రేన్లను ట్యాంక్‌బండ్‌పైన పది, నెక్లెస్‌ రోడ్డులో మూడు క్రేన్లను కలిపి బుధవారం సాయంత్రం నాటికి 22కు పెంచారు. అత్యవసరంగా ఉపయోగించుకోవడానికి మరో 24 క్రేన్లను కూడా సాగర్‌ చుట్టుపక్కల సిద్ధంగా ఉంచారు. ఖైరతాబాద్‌ మహా గణపతిని చూసేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఇక మహాగణపతి శోభాయాత్రకు కూడా పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.