Tirupati Special Trains: కాచిగూడ, సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లు-south central railway run special trains between tirupati kachiguda secunderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  South Central Railway Run Special Trains Between Tirupati Kachiguda Secunderabad

Tirupati Special Trains: కాచిగూడ, సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లు

HT Telugu Desk HT Telugu
Nov 03, 2022 12:18 PM IST

south central railway special trains: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. పలు రూట్లలో ప్రత్యేక రైళ్ల సేవలను ప్రకటించింది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది.

దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు
దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు (HT)

South Central Railway Special Trains Latest: దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. తెలుగు రాష్ట్రాల్లోని ఇప్పటికే పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టగా... తిరుపతి వెళ్లే ప్రయాణికుల కోసం మరికొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది. వాటిని చూస్తే...

tirupati kachiguda trains: తిరుపతి నుంచి కాచిగూడ(నెంబర్ 02763 )కు ప్రత్యేక రైలును ప్రకటించారు అధికారులు. ఇది నవంబర్ 3వ తేదీన అందుబాటులో ఉంటుంది. ఈ రైలు గురువారం సాయంత్రం 5 గంటలకు తిరుపతిలో బయల్దేరి శుక్రవారం తెల్లవారుజామున 5.20 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.

ఈ రైలు రేణిగుంట జంక్షన్, శ్రీకాళహస్తి, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి జంక్షన్, విజయవాడ జంక్షన్, మధిర, ఖమ్మం, డోర్నకల్, మహబూబాబాద్, వరంగల్, కాజిపేట్ జంక్షన్, జనగాం, మౌలాలి గేట్, మల్కాజ్‌గిరి స్టేషన్లలో ఆగుతుందని అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

కాచిగూడ నుంచి తిరుపతికి(రైలు నెంబర్ 07483 ) రైలు ప్రకటించింది. నవంబర్ 4న ఈ రైలు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు శుక్రవారం రాత్రి 7.25 గంటలకు కాచిగూడలో బయల్దేరి శనివారం ఉదయం 8.20 గంటలకు తిరుపతి చేరుతుంది.

ఈ ప్రత్యేక రైలు మల్కాజ్‌గిరి, మౌలాలి గేట్, పగిడిపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు జంక్షన్, తెనాలి జంక్షన్, బాపట్ల, చీరాల, ఒంగోలు, గూడూరు జంక్షన్, రేణిగుంట జంక్షన్‌లో ఆగుతుందని అధికారులు చెప్పారు.

tirupati secunderabad special trains: తిరుపతి - సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించారు అధికారులు. ఇది నవంబర్ 3వ తేదీన సికింద్రాబాద్ నుంచి రాత్రి 08.25 గంటలకు బయల్దేరి.. మరునాడు ఉదయం 08.20 నిమిషాలకు తిరుపతి చేరుతుంది.

ఇక తిరుపతి నుంచి నవంబర్ 4 తేదీన సికింద్రాబాద్ ప్రత్యేక రైలు బయల్దేరుతుంది. రాత్రి 08.15 నిమిషాలకు బయల్దేరి... మరునాడు ఉదయం 08.30 నిమిషాలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుతుంది.

తిరుపతి నుంచి కాచిగూడకు ప్రత్యేక రైలు ప్రకటించారు. నవంబర్ 5న అందుబాటులో ఉంటుంది. ఈ రైలు శనివారం సాయంత్రం 4 గంటలకు తిరుపతిలో బయల్దేరి ఆదివారం తెల్లవారుజామున 4.45 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.

ఈ స్పెషల్ ట్రైన్ రేణిగుంట జంక్షన్, గూడూరు జంక్షన్, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి జంక్షన్, గుంటూరు జంక్షన్, సత్తెనపల్లి, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, పగిడిపల్లి, మౌలాలి గేట్, మల్కాజ్‌గిరి స్టేషన్లలో ఆగుతుంది.

IPL_Entry_Point