Special Trains : నాందేడ్ టూ బరంపూర్ ప్రత్యేక రైళ్లు.. తెలంగాణలో ఆగేది ఇక్కడే-special trains between nanded and berhampur trains will stop in these telangana stations ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Special Trains Between Nanded And Berhampur Trains Will Stop In These Telangana Stations

Special Trains : నాందేడ్ టూ బరంపూర్ ప్రత్యేక రైళ్లు.. తెలంగాణలో ఆగేది ఇక్కడే

HT Telugu Desk HT Telugu
Nov 02, 2022 05:54 PM IST

Special Trains Update : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నాందేడ్-బరంపూర్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఈ మేరకు పలు రైళ్లను ప్రకటించింది.

ప్రత్యేక రైళ్లు
ప్రత్యేక రైళ్లు (PTI)

రైలు నెంబర్ 07431 నవంబర్ 5, 12, 19, 26 తేదీల్లో నాందేడ్‌లో మధ్యాహ్నం 3.25 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.25 గంటలకు దువ్వాడ(Duvvada) చేరుకుంటుంది. దువ్వాడలో ఉదయం 9.27 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2.30 గంటలకు బరంపూర్ చేరుకుంటుంది.

ట్రెండింగ్ వార్తలు

తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 07432 నవంబర్ 6, 13, 20, 27 తేదీల్లో ఉన్నాయి. బరంపూర్(berhampur) నుండి సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరి రాత్రి 9.35 గంటలకు దువ్వాడ చేరుకుంటాయి. దువ్వాడలో రాత్రి 9.37 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 3.45 గంటలకు నాందేడ్ చేరుకుంటాయి.

రైలు అన్ని ముద్‌ఖేడ్, ధర్మాబాద్, బాసర్, నిజామాబాద్(Nizamabad), కామారెడ్డి, మేడ్చల్, సికింద్రాబాద్, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు(Eluru), రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళం రోడ్డులో ఆగుతుంది.

మరోవైపు దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల రద్దీ కారణంగా స్పెషల్ ట్రైన్స్(Special Trains)ను పొడిగించింది. ఈ జాబితాలో మచిలీపట్నం-కర్నూలు సిటీ, కర్నూల్ సిటీ-మచిలీపట్నం, మచిలీపట్నం-తిరుపతి, తిరుపతి - మచిలీపట్నం రూట్లు ఉన్నాయి. దాదాపు నెల రోజులకుపైగా ఈ ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది దక్షిణ మధ్య రైల్వే(South Central Railway).

మచిలీపట్నం-కర్నూలు సిటీ మధ్య ప్రత్యేక రైళ్లను నవంబర్ 1 నుంచి నవంబర్ 29 వరకు నడపాలని నిర్ణయించారు అధికారులు. శని, మంగళవారం, గురువారం రోజుల్లో ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఇక కర్నూలు సిటీ - మచిలీపట్నం(Kurnool To Machilipatnam) మధ్య కూడా ప్రత్యేక రైళ్ల సేవలను పొడిగించారు. ఈ రైళ్లు నవంబర్ 2 నుంచి నవంబర్ 30వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. ఆదివారం, బుధ, శుక్రవారం రోజుల్లో నడుస్తాయి.

మచిలీపట్ననం - తిరుపతి(Machilipatnam To Tirupati) మధ్య ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లను పొడిగించారు. నవంబర్ 2వ తేదీ నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు నడపనున్నారు. ఆదివారం, సోమ, బుధ, శుక్రవారం రోజుల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. ఇక తిరుపతి - మచిలీపట్నం రూట్ లో చూస్తే... ఈనెల 3 నుంచి డిసెంబర్ 15వ తేదీ వరకు ప్రత్యేక రైళ్లను నడపనున్నారు, సోమ, మంగళ, గురు, శనివారం రోజుల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.

IPL_Entry_Point