Munugode Exit Polls : మునుగోడులో గెలిచేది ఆ పార్టీనే అంట
Munugode Exit Polls : మునుగోడు ఉపపోరు ఉత్కంఠగా సాగింది. తాజాగా ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. అయితే ఎక్కువగా శాతం టీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందని చెబుతున్నాయి.
మునుగోడు ఉపఎన్నిక(Munugode By Election) హోరాహోరిగా సాగింది. ఓటర్లు సైతం ఉత్సహంగా పోలింగ్ లో పాల్గొన్నారు. పోలింగ్ సమయం ముగియడంతో ఎగ్జిట్ పోల్స్(Exit Polls) అంచనాలు వచ్చాయి. థర్డ్ విజన్ రీసెర్చ్-నాగన్న ఎగ్జిట్ పోల్ సర్వే అంచనా ప్రకారం టీఆర్ఎస్(TRS)కు 48 నుంచి 51 శాతం ఓట్లు వచ్చినట్టుగా తెలిపింది. బీజేపీ(BJP)కి 31 నుంచి 35 శాతం ఓట్లు వచ్చాయట. కాంగ్రెస్‌కు 13 నుంచి 15 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నాయి సర్వేలు.
ట్రెండింగ్ వార్తలు
పల్స్ టుడే ఎగ్జిట్ పోల్ ప్రకారం టీఆర్ఎస్‌కు 42 నుంచి 43 శాతం ఓట్లు వస్తాయట. బీజేపీకి 38.5 శాతం ఓట్లు, కాంగ్రెస్(Congress)కు 14 నుంచి 16 శాతం ఓట్లు, బీఎస్పీకి 3 శాతం రానున్నాయట. ఇతరులకు 1 శాతం వచ్చే అవకాశం ఉంది. SAS గ్రూప్ సర్వే ప్రకారం టీఆర్ఎస్(TRS)కు 41 నుంచి 42 శాతం ఓట్లు, బీజేపీకి 35 నుంచి 36 శాతం ఓట్లు, కాంగ్రెస్‌కు 16.5-17.5 శాతం ఓట్లు రావొచ్చని చెబుతోంది.
ఓటింగ్ చూస్తే…
మధ్యాహ్నం ఒంటి గంట వరకు 41.3 శాతం పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 59.92 శాతంగా పోలింగ్ నమోదైంది. 1,44,878 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ శాతం 77.55గా ఉంది. సాయంత్రం 5 గంటల వరకు 1,87,527 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక రాత్రి తొమ్మిది గంటల వరకు సుమారు 92.5 శాతంగా పోలింగ్ నమోదైంది.
2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇక్కడ 91.30 శాతం పోలింగ్ నమోదయింది. ఉపఎన్నిక బరిలో 47 మంది అభ్యర్థులు నిలిచారు. నోటా కలిపి ఒక్కో ఈవీఎంలో మూడు బ్యాలెట్ యూనిట్లు అవసరం. ఇందుకోసం 1,192 బ్యాలెట్ యూనిట్లను సిద్ధం చేశారు. కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్లను 596 చొప్పున అందుబాటులో ఉంచారు. ఎన్నికల సంఘం ప్రకటించిన జాబితా ప్రకారం నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2 లక్షల 41 వేల 855 మంది ఉన్నారు. ఇందులో పురుషులు లక్షా 21 వేల 662 మంది, మహిళలు లక్షా 20 వేల 126 మంది ఉన్నారు.
సంబంధిత కథనం