KCR Comments : పది రోజుల్లో రైతుబంధు.., కొండగట్టుకు 100 కోట్లు-kcr comments on rythu bandhu in jagtial ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Kcr Comments On Rythu Bandhu In Jagtial

KCR Comments : పది రోజుల్లో రైతుబంధు.., కొండగట్టుకు 100 కోట్లు

HT Telugu Desk HT Telugu
Dec 07, 2022 07:41 PM IST

CM KCR Jagtial Tour : పది రోజుల్లో రైతు బంధు నిధులు జమ చేస్తామని జగిత్యాల సభలో కేసీఆర్ ప్రకటించారు. ఈ విషయంపై రెండు రోజుల్లో జరిగే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామన్నారు.

సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ (twitter)

జగిత్యాలలో సీఎం కేసీఆర్(CM KCR Jagtial Tour) పర్యటించారు. కలెక్టరేట్ భవనంతోపాటుగా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. మెడికల్ కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. గోదావరి నది(Godavari River) తెలంగాణలో మెుదట ప్రవేశిస్తుందని కేసీఆర్(KCR) అన్నారు. తెలంగాణలో గోదావరి పుష్కరాలు జరిపేవారు కాదని.. అన్నారు. తెలంగాణ సాధించి.. గోదావరి పుష్కరాలు జరుపుతామని ధర్మపురిలో మెుక్కుకున్నానన్నారు. తెలంగాణ సాధించుకున్నాక గోదావరి పుష్కరాలు(Godavari Pushkaralu) ఘనంగా జరుపుకొన్నామన్నారు. కొండగట్టు అంజన్న(Kondagattu Anjanna) ఆలయానికి 384 ఎకరాలు ఇచ్చామని కేసీఆర్ అన్నారు. ఈ సమావేశంలో కొండగట్టు అంజన్న ఆలయం అభివృద్ధికి రూ.100 కోట్లు ప్రకటించారు.

ట్రెండింగ్ వార్తలు

కేంద్రం సహకరించి.. ఉంటో మరో మూడు లక్షల కోట్లు పెరిగి ఉండేదని కేసీఆర్ అన్నారు. జీఎస్ డీపీ రూ.5 లక్షల కోట్ల నుంచి రూ.11.5 లక్షల కోట్లకు పెరిగిందన్నారు. పాలకులు, అధికారుల అంకితభావంతో విజయాలు సాధించామని కేసీఆర్(KCR) అన్నారు. కరెంట్ అవసరం లేకుండా.. గ్రావిటీ ద్వారా మిషన్ భగీరథ జలాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయన్నారు. తెలంగాణ(Telangana)లో 40 వేల ఓవర్ హెడ్ ట్యాంకులు ఉన్నాయన్నారు. మిషన్ భగీరథ(Mission Bhageeratha) పైపులు రెండు లక్షల కిలో మీటర్ల మేర ఉన్నాయన్నారు.

రైతుబంధు(Rythu Bandhu)పై సీఎం కేసీఆర్ మాట్లాడారు. రైతు బంధుకు పరిమితి లేకపోవటాన్ని తప్పుపడుతున్నారని కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో 93.5 శాతం మంది రైతులు ఐదెకరాలలోపు భూమి ఉన్నవారేనని చెప్పారు. 5 నుంచి 10 ఎకరాలలో పు ఉన్నవారు 5 శాతం మంది ఉన్నారన్నారు. 10 ఎకరాలకు పైగా ఉన్న రైతులకు ఒక శాతం మాత్రమేనని కేసీఆర్ చెప్పారు. 20 ఎకరాలకు పైగా ఉన్న రైతులు .28 శాతం మంది మాత్రమేనన్నారు.

'వేములవాడ నియోజకవర్గంలో కథలాపూర్, బీమారం సూరమ్మ చెరువు నింపి మూడు మండలాలకు నీరిస్తామన్నారు కేసీఆర్. 'కేసీఆర్ కంటే ముందు, టీఆర్ఎస్ ముందు ఎన్నో ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు చూశారు. ఈ ప్రాంతం నుంచి మంత్రులను చూశారు. కోరుట్ల, మెట్ పల్లి, సిరిసిల్ల, బాల్కొండలో లక్షల సంఖ్యలో బీడీ కార్మికులున్నారు. పదహారు రాష్ట్రాల్లో బీడీ కార్మికులున్నా.. తెలంగాణలో రూ.2016 పెన్షన్ ఇస్తున్నాం. రేషన్ కార్డులతో బియ్యం, పిల్లలకు ఉద్యోగం, ఆరోగ్య శ్రీ కింద కల్యాణ లక్ష్మి కింద వివాహాలకు ఆర్థిక సాయం అందిస్తున్నాం. తెలంగాణ రైతులు బాగుపడాలి.' అని కేసీఆర్ అన్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం