Bathukamma Sarees : 250 డిజైన్లలో బతుకమ్మ చీరలు… పంపిణీ ప్రారంభం-distribution of free bathukamma sarees started in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Distribution Of Free Bathukamma Sarees Started In Telangana

Bathukamma Sarees : 250 డిజైన్లలో బతుకమ్మ చీరలు… పంపిణీ ప్రారంభం

Maheshwaram Mahendra Chary HT Telugu
Oct 04, 2023 02:16 PM IST

Bathukamma Sarees in Telangana: తెలంగాణలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం మొదలైంది. 25 రకాల డిజైన్‌లతో కోటి 20 లక్షల చీరలను సిద్ధం చేసింది సర్కార్. అక్టోబర్ 10వ తేదీలోపు చీరల పంపిణీని పూర్తి చేసేలా కార్యాచరణను సిద్ధం చేశారు.

 బతుకమ్మ చీరల పంపిణీ
బతుకమ్మ చీరల పంపిణీ (Twitter)

Bathukamma Sarees in Telangana: రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం బుధవారం మొదలైంది. ప్రతి ఏడాది ఆడపడుచులకు బతుకమ్మ, దసరా పండగల సందర్భంగా… సర్కార్ ఉచితంగా చీరలను పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈ ఏడాది కూడా చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. మొత్తం 25 రకాల డిజైన్‌లతో కోటి 20 లక్షల చీరలను సిద్ధం చేసింది. అక్టోబర్ 10వ తేదీలోపు బతుకమ్మ చీరల పంపిణీని పూర్తి చేసేలా కార్యాచరణను సిద్ధం చేశారు అధికారులు.

ఇందులో భాగంగా… అన్ని నియోజకవర్గాల్లో చీరలను పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మహిళలకు బతుకమ్మ చీరలను అందజేశారు. ఇక ఈ చీరలను సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, వరంగల్ మరమగ్గాల సంఘాల ఆధ్వర్యంలో తయారు చేయించారు.

ఈ ఏడాది రూ.354 కోట్ల వ్యయంతో 1.02 కోట్ల చీరలను సిద్ధం చేసింది తెలంగాణ ప్రభుత్వం. జరీతోపాటు వివిధ రంగుల కాంబినేషన్లలో 250 డిజైన్లలో ఆకర్షణీయంగా చీరెలను రూపొందించింది. 6 మీటర్ల సాధారణ చీరెలకు తోడుగా 9 మీటర్ల చీరలను అందుబాటులో ఉంచారు. ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం… 2017లో ప్రారంభించింది. 2017 నుంచి గత ఏడాది వరకు 5.81 కోట్ల చీరలను పంపిణీ చేసింది. నేత కార్మికులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ సర్కార్. తీరొక్క పూలతో కొలిచే బతుకమ్మ పండగకు.. తీరొక్క రంగులతో బతుకమ్మ చీరలను సిద్ధం చేసి అందజేస్తోంది ప్రభుత్వం.

IPL_Entry_Point