Munugodu Bypoll : ప్రధాన పార్టీలకు బీఎస్పీ, డీఎస్పీ టెన్షన్ ! అసలు కథ ఇదే-bsp and dsp impact in munugode bypoll 2022 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Bsp And Dsp Impact In Munugode Bypoll 2022

Munugodu Bypoll : ప్రధాన పార్టీలకు బీఎస్పీ, డీఎస్పీ టెన్షన్ ! అసలు కథ ఇదే

HT Telugu Desk HT Telugu
Oct 20, 2022 03:34 PM IST

Munugodu Bypoll 2022: తెలంగాణ రాజకీయాల్లో మునుగోడు బైపోల్ ఉపఎన్నిక కీలకంగా మారింది. వచ్చే ఎన్నికలకు సెమీఫైనల్ గా భావిస్తున్న ఈ పోరులో ప్రధాన పార్టీలు ఎవరికి వారు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు.

మునుగోడు బరిలో బీఎస్పీ, డీఎస్పీ
మునుగోడు బరిలో బీఎస్పీ, డీఎస్పీ (ht)

munugodu byelection 2022: మునుగోడు... ఇప్పుడు తెలంగాణలో ఏటుచూసినా ఇదే చర్చ..! ఎవరు గెలుస్తారు..? సెకండ్ ప్లేస్ లో ఎవరుంటారు..? ఇక్కడ ఓడితే ఆ పార్టీ సంగతి అంతేనట కదా...! గెలిస్తే... ఇంకో పార్టీకి తిరుగులేదంట కదా అనే ముచ్చటే నడుస్తోంది..! ఇక నియోజకవర్గంలో చూస్తే మాత్రం... ప్రతి పల్లె ప్రచారంతో మార్మోగిపోతుంది. ప్రధాన పార్టీలుగా ఉన్న టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మాత్రం... ఏ చిన్న ఛాన్స్ వదులుకోవడానికి సిద్ధంగా లేవు. విక్టరీనే లక్ష్యంగా... చకచకా పావులు కదిపేస్తున్నాయి. ఇదిలా ఉంటే... ప్రధాన పార్టీలకు బీఎస్పీ, డీఎస్పీ టెన్షన్ పట్టుకుందనే చర్చ కూడా నడుస్తోంది. వీరి ప్రభావం ఎంత..? ఎవరి ఓట్లకు గండిపడబోతుందనే డిస్కషన్ మొదలైంది.

బీఎస్పీ..ఆర్ఎస్పీ

bsp in munugodu: బీఎస్పీ(బహుజన్ సమాజ్ పార్టీ)... గత కొద్దిరోజులుగా తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ గా మారిందనే చెప్పొచ్చు. ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి బీఎస్పీ పగ్గాలు చేపట్టారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆయన బాధ్యతలు తీసుకున్నప్పట్నుంచి... పార్టీలో జోష్ పెరిగింది. ఆ పార్టీ కార్యక్రమాలు కూడా పెరిగాయి. ప్రధాన పార్టీలకు సవాల్ విసురుతూ... ఇరుకునపెట్టే ప్రయత్నం కూడా చేస్తోంది. ఇక ఆర్ఎస్పీ తన ప్రసంగాలతో.... చాలా వర్గాలకు ఆలోచనలో పడేస్తున్నారు. బహుజన రాజ్యాధికారమే బీఎస్పీ లక్ష్యమని చెబుతున్నారు. ఇదే క్రమంలో మునుగోడు బరిలోకి దిగారు. బీసీ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థిని(శంకరాచారి) ప్రకటించి... ప్రదాన పార్టీలకు సవాల్ విసిరారు. అత్యధికంగా బీసీ సామాజికవర్గం ఉన్న మునుగోడులో... ప్రధాన పార్టీల అగ్రవర్ణాలకు టికెట్ ఇచ్చాయని ప్రజల్లోకి వెళ్తున్నారు. బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ మోసం చేస్తూ వచ్చాయని ఆరోపిస్తున్నారు. ఈ ఎన్నికల్లో బీఎస్పీ సత్తా చాటాలని ఊరురా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు సామాజికవర్గాల ఓట్లు బీఎస్పీ వైపు మళ్లే ఛాన్స్ ఉందనే చర్చ నడుస్తోంది. మరోవైపు ఆ పార్టీ కేడర్ కూడా... ప్రతి గ్రామానికి చుట్టుముట్టడమే కాదు... ఇంఛార్జ్ లను నియమించి ముందుకెళ్తోంది. వారి ఎఫెక్ట్ గట్టిగానే ఉండే ఛాన్స్ ఉంది.

డీఎస్పీ(దళిత శక్తి పోగ్రాం)....

dsp in munugodu: ఇదే ఉపఎన్నికలో దళిత శక్తి ప్రోగ్రాం (డీఎస్పీ) కూడా పోటీ చేస్తోంది. బహుజన రాజ్య స్థాపనే లక్ష్యంగా డాక్టర్ విశారధన్ మహారాజ్ చేపట్టిన 10000 వేల కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్రలో భాగంగా అభ్యర్థిని ప్రకటించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు మునుగోడు బరిలో నిలుస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో 95శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు మరోమారు బలిపశువులు కాబోతున్నారని, దీన్ని అడ్డుకునేందుకే ఉప ఎన్నికలో పోటీ చేస్తామని ప్రకటించారు. పూలే, అంబేడ్కర్, కాన్షీరామ్ ల తరఫున ఇక్కడ పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు డాక్టర్ విశారదన్ మహారాజ్ చెప్పారు. ఈ మేరకు ఏర్పుల గాలయ్యను అభ్యర్థిగా ప్రకటించారు. వీరు కూడా ప్రతి పల్లెను చుట్టేస్తున్నారు. బహుజన వర్గాలను ఆక్టట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఓటర్లను ఆలోచనలో పడేసేలా ప్రసంగాలు చేస్తున్నారు. లెక్కలు చెబుతూ ప్రధాన పార్టీల తీరును విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. వీరికి కూడా పలు సామాజికవర్గాల నుంచి ఓట్లు మళ్లే ఛాన్స్ ఉంది.

మొత్తంగా ఈ నేపథ్యంలో... ఎస్సీ వర్గాలతో పాటు బీసీ సామాజికవర్గాల చెందిన ఓట్లు కూడా భారీగా చీలే అవకాశం ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇది బీఎస్పీ, డీఎస్పీ రూపంలో ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సరిగ్గా ఈ పరిణామమే... ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లకు టెన్షన్ పుట్టిస్తున్నట్లు గుసగసలు వినిపిస్తున్నాయి. అయితే బీఎస్పీ మాత్రం... మునుగోడులో గెలిచేది తమ పార్టీ అభ్యర్థి అని బలంగా చెబుతోంది.

సామాజికవర్గాల వారీగా...

గౌడ్ - 35,150 మంది 15.94%

ముదిరాజ్- 33, 900 (15.37శాతం)

ఎస్సీ మాదిగ - 25 ,650 మంది (11.6 3 శాతం)

యాదవ - 21, 360 (ఓటు షేర్ 9.69)

పద్మశాలీలు - 11, 680 (ఓటు శాతం 5.30 శాతం)

ఎస్టీ లంబాడి/ ఎరుకల - 10,520 మంది (4.7 శాతం)

ఎస్సీ (మాల)- 10,350 మంది

వడ్డెర - 8,350 మంది

కుమ్మరి -7,850 మంది ఓటర్లు,

విశ్వబ్రాహ్మణ/ విశ్వకర్మ- 7,820

రెడ్డి- 7,690 మంది

ముస్లింలు - 7,650

కమ్మ - 5,680 మంది

ఆర్య వైశ్య - 3,760 మంది

వెలమ - 2,360 మంది,

మున్నూరు కాపు - 2,350 మంది,

ఇతరులు 18,400 మంది

IPL_Entry_Point