BJP - TDP : చంద్రబాబు ఢిల్లీ టూర్... పొత్తుపై బండి సంజయ్ రియాక్షన్ ఇదే-bandi sanjay given clarity on tdp bjp alliance ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bjp - Tdp : చంద్రబాబు ఢిల్లీ టూర్... పొత్తుపై బండి సంజయ్ రియాక్షన్ ఇదే

BJP - TDP : చంద్రబాబు ఢిల్లీ టూర్... పొత్తుపై బండి సంజయ్ రియాక్షన్ ఇదే

Maheshwaram Mahendra Chary HT Telugu
Jun 04, 2023 05:08 PM IST

Bandi Sanjay Latest News: తెలుగుదేశం పార్టీతో పొత్తుపై క్లారిటీ ఇచ్చారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. టీడీపీతో బీజేపీ పొత్తు ఊహాగానాలే అంటూ కొట్టిపారేశారు. చంద్రబాబు ఢిల్లీ టూర్ పై కూడా సంజయ్ స్పందించారు.

బండి సంజయ్
బండి సంజయ్

BJP Telangana Latest News: టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ టూర్ హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, నడ్డాతో చర్చలు జరిపిన నేపథ్యంలో... ప్రధానంగా పొత్తుల అంశం తెరపైకి వస్తోంది. ఏపీలో బీజేపీ - టీడీపీ - జనసేన పొత్తు ఖరారు కావటం ఖాయమేనన్న వార్తలు వినిపిస్తుండగా.... తెలంగాణలోనూ ఆ తరహా వాదనలు వినిపిస్తున్నాయి. ఇక్కడ కూడా తెలుగుదేశం - బీజేపీ కలిసి పని చేసేలా అడుగులు పడుతున్నాయన్న చర్చ వినిపిస్తోంది. నిజానికి గతంలోనూ ఈ వార్తలు వచ్చినప్పటికీ... తాజాగా చంద్రబాబు ఢిల్లీ టూర్ వెళ్లటంతో ఈ వాదన మరోసారి గట్టిగా వినిపిస్తోంది. పొత్తు ఉంటుందేమో అన్న చర్చ గట్టిగా వినిపిస్తోంది. అయితే వీటిపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు.

తెలంగాణలో టీడీపీతో బీజేపీ పొత్తు ఊహాగానాలేనని బండి సంజయ్‌ కొట్టిపారేశారు. అమిత్‌షా , నడ్డాలను టీడీపీ అధినేత చంద్రబాబు కలవడంలో తప్పేంటి? అని ప్రశ్నించారు. గతంలో బెంగాల్ సీఎం మమత, తమిళనాడు సీఎం స్టాలిన్, బిహార్ సీఎం నీతీశ్ కుమార్ వంటి ప్రతిపక్ష నేతలు కూడా వారిని కలిశారు కదా అని కామెంట్స్ చేశారు. ప్రతిపక్ష నేతలు, ప్రజలను కలవకుండా ఉండే పార్టీ తమది కాదని చెప్పుకొచ్చారు. సీఎం కేసీఆర్ మాదిరిగా.. రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టే పార్టీ బీజేపీ కాదని వ్యాఖ్యానించారు.

గతంలో ఇదే మాదిరిగా వార్తలు రాగా.. బండి సంజయ్ ఖండించిన విషయం తెలిసిందే. ఎట్టిపరిస్థితుల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీతో తమకు పొత్తు ఉండదని చెప్పారు. నిజానికి ఇదే విషయంపై కేడర్ లో కన్ఫ్యూజన్ కూడా ఉంది. గతేడాది నుంచి పొత్తుల అంశం తెరపైకి వస్తుండగా…. కేడర్ తో పాటు ద్వితీయ శ్రేణి నేతలు కూడా డైలామాలో పడిపోతున్నారు. ఓ దశలో మాజీ ఎంపీ విజయశాంతి కూడా…. తెలుగుదేశం పార్టీతో పొత్తు అంశాన్ని ప్రస్తావించిన సంగతి తెలిసిందే. స్వయంగా ఓ సమావేశంలో మాట్లాడిన విజయశాంతి… బండి సంజయ్ ని నేరుగా అడిగారు. ఈ ప్రశ్నకు స్పందించిన సంజయ్… టీడీపీతో పొత్తు ప్రసక్తే ఉండదన్నారు. ఈ విషయాన్ని పార్టీ శ్రేణులకే కాకుండా ముఖ్యంగా ప్రజలకు వివరించాలని నేతలకు సూచించారు.

శనివారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో చంద్రబాబు భేటీ అయ్యారు. సుమారు 50 నిమిషాల పాటు పలు అంశాలపై చర్చించారు. 2018లో ఎన్డీయే కూటమి నుంచి బయటికొచ్చిన తర్వాత అమిత్‌షాతో చంద్రబాబు భేటీ అవ్వడం ఇదే తొలిసారి. త్వరలో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్న సందర్భంలో చంద్రబాబు... బీజేపీ నేతలతో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. టీడీపీ ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్‌, కేశినేని నాని, రామ్మోహన్‌ నాయుడు, మాజీ ఎంపీ కంభంపాటి రామమోహనరావులతో కలిసి శనివారం సాయంత్రం దిల్లీకి వచ్చిన చంద్రబాబుకు ఎయిర్ పోర్టులో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు స్వాగతం పలికారు. అనంతరం వీరంతా ఎంపీ గల్లా జయదేవ్‌ నివాసానికి చేరుకున్నారు. రాత్రి 8.55 గంటలకు చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నివాసానికి వచ్చారు. కొద్దిసేపటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అక్కడికి వచ్చారు. వీరు ముగ్గురు రాత్రి 9.49 గంటల వరకు వివిధ అంశాలపై చర్చించారు. ఏపీలో పొత్తులపై ఈ సమావేశంలో చర్చించారా? భవిష్యత్తులో కలిసి పనిచేయడంపై సమాలోచనలు చేశారా? అనే విషయం తెలియాల్సి ఉంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం