Marriages : దేశంలో పెళ్లి సందడి.. 40 రోజుల్లో 32 లక్షల పెళ్లిళ్లు-32 lakhs marriages in november and december in india ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Marriages : దేశంలో పెళ్లి సందడి.. 40 రోజుల్లో 32 లక్షల పెళ్లిళ్లు

Marriages : దేశంలో పెళ్లి సందడి.. 40 రోజుల్లో 32 లక్షల పెళ్లిళ్లు

HT Telugu Desk HT Telugu
Nov 14, 2022 02:43 PM IST

Marriages In Telangana : కొవిడ్ 19 సమయంలో పెళ్లి అంటే.. వేళ్ల మీద లెక్కపెట్టే సంఖ్యలో చుట్టాలు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. తెలుగు రాష్ట్రాల్లో చాలా పెళ్లిళ్ల ముహూర్తాలు ఫిక్స్ అయిపోయాయి. నవంబర్, డిసెంబర్ నెలల్లో అయితే వేల సంఖ్యలో పెళ్లిళ్లు ఉన్నాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (unsplash)

తెలంగాణ(Telangana) వివాహాలతో బిజీబిజీగా అయిపోయింది. నవంబర్(November), డిసెంబర్(December) నెలల్లో పెళ్లిళ్లు ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాద్(Hyderabad) నగరం వివాహాల బిజీ సీజన్ నడుమ ఉంది. కొవిడ్ -19(Covid 19) మహమ్మారి అనేక వ్యాపారాలు, ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేసింది. ఇక పెళ్లిళ్ల గురించి అయితే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదేమో.. ఆ సమయంలో ఆన్ లైన్ లోనూ పెళ్లిళ్లు జరిగిన ఘటనలు చూశాం.

రెండు సంవత్సరాల కొవిడ్-19 లాక్‌డౌన్(Covid Lock Down) నిబంధనల్లో పెళ్లిళ్లో దగ్గరి చుట్టాలు.. అదికూడా పరిమిత సంఖ్యలోనే హాజరయ్యారు. ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత.. కాస్త పెళ్లిళ్లకు(Marriages) జనాలు రావడం మెుదలుపెట్టారు. అయితే ఈ ఏడాది భారీగా వివాహాలు ఉన్నాయి. నవంబర్, డిసెంబర్ మధ్య దేశవ్యాప్తంగా 32 లక్షల వివాహాలు జరుగుతాయని ఒక నివేదిక పేర్కొంది. ఈ కాలంలో ఒక్క హైదరాబాద్‌(Hyderabad)లోనే వేల సంఖ్యలో వివాహాలు జరుగుతాయని వెడ్డింగ్ ప్లానర్స్ చెబుతున్నారు.

వాతావరణం అనుకూలంగా ఉండటం, సెలవులు(Holidays), ముహూర్తాలతో ఇలా అనేక కారణాల వల్ల ఈ కాలంలో వెడ్డింగ్‌(Weddings)లు పెరుగుతాయి. కొవిడ్ కేసులు(Covid Cases) చాలా నెలలుగా తక్కువగా ఉన్నాయి. వివాహ వేడుకలను ఇకపై రద్దు చేయవలసిన అవసరం లేదని వెడ్డింగ్ ప్లానర్లు అంటున్న మాట. ఈ రెండు నెలల్లో ఎప్పుడూ వివాహాలు ఎక్కువగా జరుగుతాయి. వర్షాలతో ఇబ్బందులు ఉండవు. చాలా మంది ఎన్నారైలు కూడా ఈ సమయంలో ఎక్కువ సెలవులు తీసుకుంటారట.

ఇదే సమయంలో పెళ్లిళ్ల ఖర్చులు కూడా పెరిగాయి. దేశంలో జరిగే 32 లక్షల పెళ్లిళ్లతో కొన్ని కోట్లలో వ్యాపారం(Business) జరుగుతోంది. సుమారు 3.75 లక్షళ కోట్ల లావాదేవీలు జరుగుతాయని అంచనా. ముహుర్తాలు బాగుండటంతో పెళ్లిల బాజా మోగనుంది. ఇదే సమయంలో ఫొటోగ్రఫీ, మేకప్ కోసం ఎక్కువగా ఖర్చు చేస్తున్నారని వెడ్డింగ్ ప్లానర్స్ అంటున్నారు.

దేశ రాజధాని దిల్లీ(Delhi)లో ఈసారి పెళ్లిళ్ల సీజన్లో 3.5 లక్షల పెళ్లిళ్లు జరుగుతాయని అంచనా. సుమారు 75 వేల కోట్ల వ్యాపారం జరుగుతుందట. ఇప్పుడు డిసెంబర్లో ముగిసిన తర్వాత.. మళ్లీ జనవరి చివరిలో షురూ అవుతాయి. జూన్ వరకు నాన్ స్టాప్ గా జరుగుతాయి. ఇక వచ్చేదంతా పెళ్లిళ్ల సీజన్ అన్నమాట.

కరోనా(Corona) వ్యాప్తి తగ్గడంతో పట్టణాలు, పల్లెల్లో ఎక్కడ చూసినా.. ఫంక్షన్లు కనిపిస్తున్నాయి. వరుస పెళ్లిళ్ళతో తెలంగాణ(Telangana)లో వందల కోట్ల బిజినెస్ జరగనుంది. గత ఏప్రిల్ నుంచి జూన్ మధ్య భారీ స్థాయిలో రాష్ట్రంలో వివాహాలు జరిగాయి. ఇప్పుడు మళ్లీ ఫంక్షన్ హాల్స్, బ్యాండ్ మేళం, డెకరేషన్, పూలు పండ్లు, ఫుడ్, ఈవెంట్ ఆర్గనైజర్స్, ఫొటోగ్రఫర్స్, పూజారులు, ట్రావెల్స్, టెంట్ హౌజ్స్, గోల్డ్, బట్టల షాపులు.. ఇలా చాలా వ్యాపారులు కళకళలాడుతున్నాయి.

Whats_app_banner