IPL 2023 : ఈ ఐపీఎల్‌లో విఫలమైన స్టార్ బ్యాట్స్‌మెన్స్ వీరే-ipl 2023 star batters failed in indian premier league dinesh karthik to russel ben stokes and mayank ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Ipl 2023 Star Batters Failed In Indian Premier League Dinesh Karthik To Russel Ben Stokes And Mayank

IPL 2023 : ఈ ఐపీఎల్‌లో విఫలమైన స్టార్ బ్యాట్స్‌మెన్స్ వీరే

Anand Sai HT Telugu
May 02, 2023 11:12 AM IST

IPL 2023 : ఐపీఎల్ ప్రారంభానికి ముందు స్టార్ బ్యాటర్స్.. ఈసారి ఇరగదీస్తారని అంతా అనుకున్నారు. కానీ దారుణంగా ఫెయిల్ అవుతున్నారు. ఆ జాబితాలో ఉన్న ఆటగాళ్లు ఎవరో తెలుసుకోండి..

దినేష్ కార్తీక్
దినేష్ కార్తీక్ (twitter)

ఐపీఎల్ 2023(IPL 2023) జోరుగా సాగుతోంది. అయితే బాగా ఆడుతారనే అనుకునే ఆటగాళ్లు మాత్రం.. ఫెయిల్ అవుతూ ఉన్నారు. ఆ జాబితాలో దిగ్గజ ఆటగాళ్లు సైతం ఉన్నారు. దీంతో కీలక సమయాల్లో ఆయా జట్లు తడబడుతున్నాయి. మ్యాచులు గెలవలేక ఓడిపోతున్నాయి. ఆ ఆటగాళ్లు ఎవరో చూడండి..

RCB ఆటగాడు దినేష్ కార్తీక్(Dinesh Karthik) ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. గతేడాది ఆర్‌సీబీ(RCB) విజయాల్లో కీలక పాత్ర పోషించి మ్యాచ్‌ ఫినిషర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ ఏడాది ఎనిమిది మ్యాచ్‌ల్లో ఐదుసార్లు సింగిల్ డిజిట్‌కే ఔటయ్యాడు. రెండు డకౌట్‌లు ఉన్నాయి.

ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) అంచనాలను పృథ్వీ షా తారుమారు చేశాడు. తొలి ఆరు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 47 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో అతను రెండుసార్లు డకౌట్ అయ్యాడు. ఈ పేలవ ఫామ్ తో టీమ్ ఇండియాలోకి పునరాగమనం చేయాలని భావిస్తున్న పృథ్వీకి కష్టాలు తెచ్చిపెట్టింది.

ఆండ్రీ రస్సెల్(andre russell) కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ లైనప్‌ను చాలా సంవత్సరాలుగా నడిపించాడు. కష్టాల్లో జట్టుకు అండగా నిలిచాడు. అయితే ఈ ఏడాది అతడు సరైన మూడ్‌లో లేడు. రస్సెల్‌కు భారీ మెుత్తంలో చెల్లిస్తుంది కేకేఆర్(KKR). ఈసారి మ్యాచ్‌లలో విజయం సాధించలేకపోతున్నాడు. ఈ సీజన్‌లో అతని అత్యధిక స్కోరు 38. అంతకుముందు 35, 21 పరుగులు చేశాడు. అయితే ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ కేకేఆర్ ఓడిపోయింది.

వేలంలో ఇంగ్లండ్ దిగ్గజం బెన్ స్టోక్స్‌(ben stokes)ను రూ.16.25 కోట్లకు కొనుగోలు చేసిన చెన్నై సూపర్ కింగ్స్ అతనిపై భారీ ఆశలు పెట్టుకుంది. ఈ సీజన్‌లో గాయంతో అతను దూరమయ్యాడు. ఆరంభంలో కొన్ని మ్యాచ్‌లు ఆడినప్పటికీ ఎలాంటి ప్రభావం చూపలేకపోయాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్(Sun Risers Hyderabad).. మయాంక్ అగర్వాల్‌ను రూ. 8.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ సీజన్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడిన మయాంక్ 164 పరుగులు మాత్రమే చేశాడు. రెండు మ్యాచ్‌ల్లో 48, 49 పరుగులు చేశాడు. అయితే రెండు సార్లు కూడా ఆ జట్టు గెలవలేకపోయింది.

ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) ఆటగాడు మిచెల్ మార్ష్ కూడా అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాడు. తొలి ఐదు మ్యాచ్‌ల్లో కేవలం 31 పరుగులే చేశాడు. ఇందులో డకౌట్‌లు కూడా ఉన్నాయి. బౌలింగ్‌లో 3 వికెట్లు మాత్రమే తీశాడు. ఆసీస్ దిగ్గజంపై ఢిల్లీ జట్టు భారీ అంచనాలు పెట్టుకుంది. కానీ అతని ప్రదర్శన నిరాశపరుస్తోంది.

WhatsApp channel

సంబంధిత కథనం