IPL 2023 Points Table: ఐపీఎల్ పాయింట్స్ టేబుల్లో భారీ మార్పులు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ లీడర్లు వీళ్లే-ipl 2023 points table updated after kkr and rcb match over ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ipl 2023 Points Table: ఐపీఎల్ పాయింట్స్ టేబుల్లో భారీ మార్పులు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ లీడర్లు వీళ్లే

IPL 2023 Points Table: ఐపీఎల్ పాయింట్స్ టేబుల్లో భారీ మార్పులు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ లీడర్లు వీళ్లే

Hari Prasad S HT Telugu
Apr 07, 2023 10:55 AM IST

IPL 2023 Points Table: ఐపీఎల్ పాయింట్స్ టేబుల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక ఆరెంజ్, పర్పుల్ క్యాప్ లిస్టులలో మాత్రం టాప్ ప్లేయర్స్ గా రుతురాజ్, మార్క్ వుడ్ కొనసాగుతున్నాయి.

పాయింట్ల టేబుల్లో మూడోస్థానానికి దూసుకెళ్లిన కోల్‌కతా నైట్ రైడర్స్
పాయింట్ల టేబుల్లో మూడోస్థానానికి దూసుకెళ్లిన కోల్‌కతా నైట్ రైడర్స్ (AP)

IPL 2023 Points Table: ఐపీఎల్ 2023లో కోల్‌కతా నైట్ రైడర్స్(KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) మ్యాచ్ తర్వాత పాయింట్ల టేబుల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మ్యాచ్ లో కేకేఆర్ 81 పరుగులతో ఆర్సీబీని చిత్తు చేసిన విషయం తెలిసిందే. 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 123 పరుగులకే చేతులెత్తేసింది. కేకేఆర్ స్పిన్నర్లు చెలరేగడంతో ఆర్సీబీ బ్యాటర్లు క్రీజులో నిలవలేకపోయారు.

ఈ మ్యాచ్ తర్వాత పాయింట్ల టేబుల్లో కేకేఆర్ ఏకంగా మూడోస్థానానికి వెళ్లగా.. ఆర్సీబీ ఏడో స్థానానికి పడిపోయింది. తొలి రెండు స్థానాల్లో గుజరాత్ టైటన్స్, పంజాబ్ కింగ్స్ ఉన్నాయి. ఈ రెండు టీమ్స్ తాము ఆడిన తొలి రెండు మ్యాచ్ లలోనూ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక రాజస్థాన్ రాయల్స్ 4, లక్నో సూపర్ జెయింట్స్ 5, చెన్నై సూపర్ కింగ్స్ 6, ఢిల్లీ క్యాపిటల్స్ 8, ముంబై ఇండియన్స్ 9, సన్ రైజర్స్ హైదరాబాద్ 10వ స్థానాల్లో ఉన్నాయి.

ఆరెంజ్ క్యాప్ లీడర్లు వీళ్లే

ఇక ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన వారికి ఇచ్చే ఆరెంజ్ క్యాప్ లిస్టులో చెన్నై బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ టాప్ లో కొనసాగుతున్నాడు. అతడు రెండు మ్యాచ్ లలో 149 రన్స్ చేశాడు. అతని తర్వాత లక్నో బ్యాటర్ కైల్ మేయర్స్ (126), శిఖర్ ధావన్ (126), విరాట్ కోహ్లి (103) ఉన్నారు. రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ సంజూ శాంసన్ 97 రన్స్ తో టాప్ 5లో చోటు దక్కించుకున్నాడు.

పర్పుల్ క్యాప్ లీడర్లు వీళ్లే

పర్పుల్ క్యాప్ లిస్టులో లక్నో బౌలర్ మార్క్ వుడ్ 8 వికెట్లతో తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక గురువారం (ఏప్రిల్ 6) ఆర్సీబీతో మ్యాచ్ లో నాలుగు వికెట్లు తీసిన వరుణ్ చక్రవర్తి మొత్తంగా ఐదు వికెట్లతో రెండో స్థానానికి దూసుకెళ్లాడు. రషీద్ ఖాన్ (5), రవి బిష్ణోయ్ (5), నేథన్ ఎలిస్ (5) మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు.

ఐపీఎల్ 2023 పాయింట్ల టేబుల్
ఐపీఎల్ 2023 పాయింట్ల టేబుల్
ఐపీఎల్ 2023 ఆరెంజ్ క్యాప్ లిస్ట్
ఐపీఎల్ 2023 ఆరెంజ్ క్యాప్ లిస్ట్
ఐపీఎల్ 2023 పర్పుల్ క్యాప్ లిస్టు
ఐపీఎల్ 2023 పర్పుల్ క్యాప్ లిస్టు
WhatsApp channel

సంబంధిత కథనం