Dhoni as Impact Player: ఐపీఎల్ తొలి ఇంపాక్ట్ ప్లేయర్ ధోనీ అవుతాడా.. చెన్నై స్ట్రేటజీ ఇదే-dhoni as impact player as csk thinking of fielding him even he is 80 percent fit ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Dhoni As Impact Player As Csk Thinking Of Fielding Him Even He Is 80 Percent Fit

Dhoni as Impact Player: ఐపీఎల్ తొలి ఇంపాక్ట్ ప్లేయర్ ధోనీ అవుతాడా.. చెన్నై స్ట్రేటజీ ఇదే

Hari Prasad S HT Telugu
Mar 31, 2023 12:59 PM IST

Dhoni as Impact Player: ఐపీఎల్ తొలి ఇంపాక్ట్ ప్లేయర్ ధోనీ అవుతాడా.. చెన్నై స్ట్రేటజీ అలాగే కనిపిస్తోంది. ఐపీఎల్ 2023లో గుజరాత్ టైటన్స్, చెన్నై సూపర్ కింగ్స్ శుక్రవారం (మార్చి 31) జరగబోయే తొలి మ్యాచ్ లో తలపడనున్నాయి.

చెన్నై తొలి ఇంపాక్ట్ ప్లేయర్ ధోనీ అవుతాడా
చెన్నై తొలి ఇంపాక్ట్ ప్లేయర్ ధోనీ అవుతాడా (PTI)

Dhoni as Impact Player: ఐపీఎల్లో తొలిసారి ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన తీసుకొస్తున్న విషయం తెలుసు కదా. అయితే ఆ తొలి ఇంపాక్ట్ ప్లేయర్ ఎమ్మెస్ ధోనీయే కానున్నాడని తెలుస్తోంది. గాయంతో బాధపడుతున్న ధోనీ తొలి మ్యాచ్ ఆడబోవడం లేదని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడతన్ని ఇంపాక్ట్ ప్లేయర్ గా వాడుకోవాలని చెన్నై టీమ్ భావిస్తోంది.

అదే జరిగితే ఆ టీమ్ తొలి ఇంపాక్ట్ ప్లేయర్ కెప్టెన్ ధోనీయే అవుతాడు. సీఎస్కే తొలి సీజన్ నుంచి విజయవంతంగా దూసుకెళ్లడంలో ధోనీదే కీరోల్. అలాంటి వ్యక్తి సీజన్ తొలి మ్యాచ్ లో కచ్చితంగా ఆడితేనే ఆ జట్టు ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. అందుకే గాయంతో బాధపడుతున్నా కూడా మ్యాచ్ మొత్తానికి దూరం కాకుండా ఈ కొత్త ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను ఉపయోగించుకోవాలని చెన్నై చూస్తోంది.

ధోనీ ఈ మ్యాచ్ ఆడటానికి కనీసం 80 శాతం ఫిట్ గా ఉన్నా సరే.. అతడే ఇంపాక్ట్ ప్లేయర్ అయ్యే అవకాశం ఉందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్ట్ చెబుతోంది. ఇక తొలిసారి జట్టులోకి వచ్చిన బెన్ స్టోక్స్ ను ఓ స్పెషలిస్ట్ బ్యాటర్ గా మూడో స్థానంలో పంపాలనీ చెన్నై భావిస్తోంది. ఇన్నాళ్లూ ఈ స్థానంలో మొయిన్ అలీ వచ్చేవాడు. ఇక అటు గుజరాత్ టైటన్స్ లో కేన్ విలియమ్సన్, శుభ్‌మన్ గిల్ ఓపెనర్లుగా వచ్చే అవకాశం ఉంది.

ఒకవేళ చెన్నై రెండో బ్యాటింగ్ చేయాల్సి వచ్చి, టార్గెట్ చేజింగ్ లో అవసరమైతే ధోనీని ఇంపాక్ట్ ప్లేయర్ గా పంపిస్తే ఎలా ఉంటుందని సీఎస్కే ఆలోచిస్తోంది. మోకాలి గాయంతో బాధపడుతున్న ధోనీ.. వికెట్ కీపింగ్ చేయడం కష్టమే అయినా బ్యాటింగ్ మాత్రం బాగానే చేస్తున్నాడు. దీంతో అతని సేవలను అలా ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నాయి.

చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు (అంచనా)

రుతురాజ్ గైక్వాడ్, డెవోన్ కాన్వే, బెన్ స్టోక్స్, మొయిన్ అలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, శివమ్ దూబె, ధోనీ, మిచెల్ సాంట్నర్, దీపక్ చహర్, సిమర్‌జీత్ సింగ్

గుజరాత్ టైటన్స్ తుది జట్టు (అంచనా)

శుభ్‌మన్ గిల్, కేన్ విలియమ్సన్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా, మాథ్యూ వేడ్, రాహుల్ తెవాతియా, అభినవ్ మనోహర్, రషీద్ ఖాన్, జయంత్ యాదవ్, అల్జారీ జోసెఫ్, మహ్మద్ షమి

WhatsApp channel

సంబంధిత కథనం