తెలుగు న్యూస్ / ఫోటో /
Brazil Riots : నాడు యూఎస్ 'క్యాపిటల్'- నేడు బ్రెజిల్ 'కాంగ్రెస్'.. ప్రజాస్వామ్యంపై దాడి!
- Brazil Riots today : ప్రజాస్వామ్యంలో మరో చీకటి రోజు! బ్రెజిల్లో.. మాజీ అధ్యక్షుడు బొల్సొనారో మద్దతుదారులు విధ్వంసం సృష్టించారు. నేషనల్ కాంగ్రెస్‌లోకి చొచ్చుకెళ్లి.. హింసకు పాల్పడ్డారు. ఈ పరిణామాలు.. యూఎస్ 'క్యాపిటల్' హింసాకాండను గుర్తుచేస్తున్నాయి. 2021 జనవరి 6న.. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు.. క్యాపిటల్ భవనంలోకి దూసుకెళ్లి విధ్వంసం సృష్టించారు.

(1 / 8)
అధ్యక్షుడి భవనం ప్లనాల్టో ప్యాలెస్‌లోకి ఆందోళనకారులు చొచ్చుకెళ్లారు. వారిపై పోలీసులు భాష్పవాయువు గోళాలను ప్రయోగించారు.(REUTERS)
(2 / 8)
ప్లనాల్టో భవనంలో జరిగిన ఆస్తి నష్టాన్ని పరిశీలిస్తున్న ప్రస్తుత అధ్యక్షుడు లూలా. మాజీ అధ్యక్షుడు బొల్సొనారో మద్దతుదారులు ఇక్కడ విధ్వంసం సృష్టించారు.(AP)
(3 / 8)
అధ్యక్షుడి భవనం వద్ద బ్రెజిల్ జెండా పట్టుకుని నిరసన తెలుపుతున్న ఓ బొల్సొనారో మద్దతుదారుడు.(REUTERS)
(4 / 8)
పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను ధ్వంసం చేసి.. కాంగ్రెస్‌లోకి చొచ్చుకెళ్లారు ఆందోళనకారులు. కాంగ్రెస్‌లోని అద్దాలు పగలగొట్టారు. కుర్చీలను ధ్వంసం చేశారు.(AFP)
(5 / 8)
నేషనల్ కాంగ్రెస్ ప్రాంగణంలో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు పోలీసులు. హెలికాఫ్టర్ ద్వారా టియర్ గ్యాస్‌ను వదిలారు. మరోవైపు నేల మీద నుంచి కాల్పులు జరిపారు.(REUTERS)
(6 / 8)
నేషనల్ కాంగ్రెస్ వద్ద గుమిగూడిన బొల్సొనారో మద్దతుదారులు.. బ్రెజిల్ జెండాలను ఎగురవేశారు. (REUTERS)
(7 / 8)
బ్రెసీలియాలోని నేషనల్ కాంగ్రెస్ వద్ద నిరసనకారులను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు.(REUTERS)
ఇతర గ్యాలరీలు