Rajasthan rape case : విషం తాగి బిల్డింగ్‌పై నుంచి దూకిన అత్యాచార బాధితురాలు!
Rajasthan rape case: రాజస్థాన్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. రెండేళ్ల క్రితం అత్యాచారానికి గురైన ఓ మహిళ.. నిందితుడి వేధింపులను తట్టుకోలేక, విషం తాగి, బిల్డింగ్‌పై నుంచి దూకేసింది!
Rajasthan rape case : ఓ 22ఏళ్ల మహిళ.. విషం తాగి, బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన రాజస్థాన్‌లో వెలుగులోకి వచ్చింది. మహిళపై అత్యాచారం చేసిన వ్యక్తి, ఆమెను వెధిస్తుండటమే ఇందుకు కారణం!
ఇదీ జరిగింది..
రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధిత మహిళకు పొరుగింట్లో ఉండే సునీల్ అనే వ్యక్తితో పరిచయం ఉంది. కాగా రెండేళ్ల క్రితం ఆమెను హోటల్‌కు తీసుకెళ్లి అతను రేప్ చేశాడు! ఆ దృశ్యాలను చిత్రీకరించాడు. ఎవరికైనా చెబితే, వాటిని ఆన్లైన్లో లీక్ చేస్తానని బెదిరించాడు. అప్పటి నుంచి ఆమెను లైంగికంగా వేధిస్తూనే ఉన్నాడు!
మరోవైపు మహిళకు, తన కుటుంబసభ్యులు ఇటీవలే మరో వ్యక్తితో పెళ్లి నిశ్చయించారు. ఇది తెలుసుకున్న నిందితుడు సునీల్.. వారి ఫొటోలను మార్ఫ్ చేశాడు. వారికి పెళ్లి జరిగినట్టుగా చిత్రీకరించి ఆన్లైన్లో పోస్ట్ చేశాడు.
ఇదీ చూడండి:- Indian girl buried alive: భారతీయ యువతి దారుణ హత్య; ప్రాణాలతో ఉండగానే పూడ్చిపెట్టిన దుర్మార్గుడు
Rajasthan crime news : ఈ పరిణామాలతో మానసిక ఒత్తిడికి గురైన మహిళ.. తన ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకుంది. గురువారం నాడు.. విషం తాగి, ఓ భవనంలోని మూడో అంతస్తు నుంచి దూకేసింది. స్థానికులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆమె ప్రాణాలకు ముప్పు లేదని, కానీ కాళ్లకు ఫ్రాక్చర్ అయ్యిందని వైద్యులు వెల్లడించారు.
మరోవైపు ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. బాధితురాలి స్టేట్మెంట్ తీసుకున్నారు. నిందితుడిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్టు అధికారులు వెల్లడించారు.
సంబంధిత కథనం