Ambani property deal: దుబాయిలో ముకేశ్ అంబానీ కొన్నఈ విల్లా ఖరీదెంతో తెలుసా?
దుబాయిలోని బీచ్ సైడ్ పామ్ జుమేరాలో ప్రాపర్టీ సొంతం చేసుకోవడం ప్రపంప కుబేరులకు ఒక స్వప్నం. అక్కడి ఒక లగ్జూరియస్, అండ్ కాస్ట్లీ ప్రాపర్టీ ని ముకేశ్ అంబానీ తన చిన్న కుమారుడి కోసం కొనుగోలు చేశారు.
దుబాయిలోని అత్యంత ఖరీదైన పామ్ జుమేరా(Palm Jumeirah) లో భారతీయ పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తన చిన్న కుమారుడి కోసం ఒక అధునాతన విల్లాను కొనుగోలు చేశారని వెల్లడైంది. ఆ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్‌లో కీలకంగా వ్యవహరించిన ఒక డీలర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆ ప్రాపర్టీని ముకేశ్ అంబానీ తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ కోసం కొన్నారని తెలిపారు.
Dubai's Palm Jumeirah villa ఇరుగు, పొరుగు ఎవరో తెలుసా?
రిలయన్స్ సంస్థ కొనుగోలు చేసిన అతి ఖరీదైన రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ ఇదే. అరచేయి షేప్‌లో ఉండే ఈ కృత్రిమ ద్వీపాల సముదాయమైన Palm Jumeirahలో ముకేశ్ అంబానీ కొనుగోలు చేసిన విల్లాలో 10 బెడ్రూమ్స్ ఉంటాయి. ఒక ప్రైవేట్ స్పా, ఒక ఇండోర్, ఒక ఔట్‌డోర్ స్విమింగ్ పూల్స్ ఉంటాయి. ఈ ప్రాపర్టీకి ఇరుగు పొరుగున బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్, అంతర్జాతీయ ఫుట్ బాల్ స్టార్ డేవిడ్ బెక్‌హామ్, విక్టోరియా బెక్‌హామ్ ఉంటారు. ఈ విల్లా నిర్వహణను ముకేశ్ సన్నిహితుడు, వైఎస్సార్సీపీ తరపున రాజ్యసభకు ఎన్నికైన ఎంపీ పరిమల్ నాత్వానీ చూస్తారు.
Dubai's Palm Jumeirah villa: 80 మిలియన్ డాలర్లు మాత్రమే..
పర్షియన్ గల్ఫ్ నీలి నీటి అలల తీరాన కొలువైన పామ్ జుమేరాలో అత్యంత ఖరీదైన బీచ్ సైడ్ మాన్షన్‌ను రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ 80 మిలియన్ డాలర్లు పెట్టి కొనుగోలు చేశారు. అంటే 8 కోట్ల డాలర్లు. మన భారతీయ కరెన్సీలో రూ. 640 కోట్లు. ఆ మాన్షన్ ను తమకనుకూలంగా మార్చుకోవడానికి, సెక్యూరిటీ అవసరాలకు మరికొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ముకేశ్, నీతా అంబానీ దంపతుల ముగ్గురు పిల్లల్లో చిన్నవాడు అనంత్ అంబానీ. పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ. ఆకాశ్ అంబానీ కోసం ఇప్పటికే యూకేలో 79 మిలియన్ డాలర్లతో ఒక జార్జియన్ కాలం నాటి భారీ మాన్షన్ `స్టోక్ పార్క్` ను ముకేశ్ కొనుగోలు చేశారు. అమెరికాలోని న్యూయార్క్‌లో తనకు అనువైన మాన్షన్ కోసం ముకేశ్ అంబానీ కూతురు ఈశా అంబానీ వెతుకుతున్నారు.
Dubai's Palm Jumeirah villa : దుబాయి వివరాలు..
యూఏఈలో 80 శాతం విదేశీయులే ఉంటారు. వారిలో భారతీయులు కూడా ఎక్కువే. రియల్ ఎస్టేట్ దుబాయి ఆదాయ వనరుల్లో ప్రధానమైనది. ప్రపంచ సంపన్నులంతా ఇప్పుడు ఇక్కడ ఇళ్లను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. 20 లక్షల దిర్హామ్‌ల కన్నా ఎక్కువ ఖర్చు పెట్టి ప్రాపర్టీ కొనుగోలు చేసేవారికి ఇక్కడి ప్రభుత్వం గోల్డెన్ వీసా అందిస్తోంది.
Dubai's Palm Jumeirah villa: ప్రైమరీ రెసిడెన్స్ ముంబైలోనే..
కాగా, అంబానీల ప్రైమరీ, పర్మనెంట్ రెసిడెన్స్ గా ముంబైలోని అంటిల్లానే కొనసాగుతుందని రిలయన్స్ వర్గాలు తెలిపాయి. ఇది 27 అంతస్తుల ఆకాశహార్మ్యం. పైన 3 హెలీపాడ్స్ ఉంటాయి. 168 కార్లను పార్క్ చేయొచ్చు. 50 సీట్ల హోం థీయేటర్, ఒక గ్రాండ్ బాల్‌రూమ్, 9 ఎలివేటర్లు ఇందులో ఉన్నాయి.