PM Modi : ప్రధాని మోదీని ఆటోగ్రాఫ్​ అడిగిన అమెరికా అధ్యక్షుడు.!-i should take your autograph us president joe biden to pm modi at quad meeting ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Pm Modi : ప్రధాని మోదీని ఆటోగ్రాఫ్​ అడిగిన అమెరికా అధ్యక్షుడు.!

PM Modi : ప్రధాని మోదీని ఆటోగ్రాఫ్​ అడిగిన అమెరికా అధ్యక్షుడు.!

Sharath Chitturi HT Telugu
May 21, 2023 10:23 AM IST

Joe Biden asks Modi's autograph : ప్రధాని మోదీని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ ఆటోగ్రాఫ్​ అడిగినట్టు తెలుస్తోంది. జీ7 సదస్సులో భాగంగా ఈ ఘటన జరిగినట్టు సమాచారం.

PM Modi : ప్రధాని మోదీని ఆటోగ్రాఫ్​ అడిగిన అమెరికా అధ్యక్షుడు.!
PM Modi : ప్రధాని మోదీని ఆటోగ్రాఫ్​ అడిగిన అమెరికా అధ్యక్షుడు.! (REUTERS)

PM Modi latest news : జపాన్​లో జరుగుతున్న జీ7 సదస్సులో భాగంగా ఓ ఆసక్తికర సంఘటన వెలుగులోకి వచ్చింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​.. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆటోగ్రాఫ్​ ఇవ్వమని అడిగారు!

ఇదీ జరిగింది..!

జీ7 సదస్సులో భాగంగా.. జో బైడెన్​ మోదీ వద్దకు వెళ్లారు. నరేంద్ర మోదీ పాల్గొనే కార్యక్రమాలకు వెళ్లాలని తనకు వందలాది అభ్యర్థనలు వస్తున్నాయని అన్నారు. అక్కడే ఉన్న ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్​.. ఈ మాటలు విన్నారు. కొన్నేళ్ల క్రితం ప్రధాని మోదీకి.. గుజరాత్​లోని నరేంద్ర మోదీ స్టేడియంలో లభించిన ఘన స్వాగతాన్ని గుర్తు చేశారు.

Joe Biden asks Modi's autograph : "ఎన్నికల్లో గెలిచిన తర్వాత.. నరేంద్ర మోదీ స్టేడియానికి వెళ్లారు మోదీ. అక్కడ ఆయనకు 90వేలమందికిపైగా ప్రజలు ఘన స్వాగతం పలికారు," అని అన్నారు. భారీ సంఖ్యలో ప్రజలను మోదీ ఎలా మేనేజ్​ చేయగలుగుతున్నారని వారిద్దరు ఆశ్చర్యపోయారు.

ఇదీ చూడండి:- G7 Summit 2023 : జపాన్​లో బిజీబిజీగా మోదీ.. జీ7 దేశాధినేతలతో సమావేశం..

ఈ నేపథ్యంలోనే.. "అయితే నేను మీ ఆటోగ్రాఫ్​ తీసుకోవాలి," అని జో బైడెన్​ అన్నట్టు తెలుస్తోంది. అనంతరం ముగ్గురు ఆగ్రనేతలు నవ్వుతూ కనిపించినట్టు సమాచారం.

జపాన్​లో మోదీ..

PM Modi Japan tour latest updates : మూడు రోజుల పర్యటన కోసం ప్రధాని మోదీ జపాన్​కు వెళ్లారు. జపాన్​ ప్రధాని ఫుమియో కిషిదా ఆహ్వానం మేరకు జీ7 సదస్సులో పాల్గొన్నారు. కాగా.. శనివారం సాయంత్రం ఉక్రెయిన్​ అధ్యక్షుడు జెలెన్​స్కీతో సమావేశమయ్యారు. రష్యాతో జరుగుతున్న యుద్ధంపై చర్చలు జరిపారు. శాంతి కోసం కృషి చేస్తామని మరోమారు హామీనిచ్చారు మోదీ. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

IPL_Entry_Point

సంబంధిత కథనం