Zumba or Aerobics : జుంబా బెటరా? ఎరోబిక్స్ మంచిదా? వీటి మధ్య తేడా ఏంటి?-zumba or aerobics which exercise is better here is the differences and benefits ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Zumba Or Aerobics : జుంబా బెటరా? ఎరోబిక్స్ మంచిదా? వీటి మధ్య తేడా ఏంటి?

Zumba or Aerobics : జుంబా బెటరా? ఎరోబిక్స్ మంచిదా? వీటి మధ్య తేడా ఏంటి?

Geddam Vijaya Madhuri HT Telugu
Jul 23, 2022 10:36 AM IST

Zumba or Aerobics : చాలా మందికి జుంబా, ఎరోబిక్స్​కి తేడా తెలియదు. మీరు కూడా కొత్తగా వ్యాయామం స్టార్ట్ చేయాలనుకుంటే.. వీటి గురించి తెలుసుకోవాల్సిందే. అయితే మీకు జుంబా మంచిదో.. ఎరోబిక్స్ మంచిదో తెలుసుకుని.. ఉత్తమమైన దానిని ఎంచుకుని ఫిట్​గా అయిపోండి.

జుంబా బెటరా? ఎరోబిక్స్ మంచిదా?
జుంబా బెటరా? ఎరోబిక్స్ మంచిదా?

Zumba or Aerobics : ఎంచుకోవడానికి అనేక రకాల ఫిట్‌నెస్ వర్కౌట్​లు ఉన్నాయి. వీటిలో ఏది ఉత్తమంగా పని చేస్తుందో గుర్తించడం కష్టం. అయినప్పటికీ.. వినోదం, వ్యాయామం ఆహ్లాదకరమైన కలయిక. ఇది మిమ్మల్ని బోర్​ కొట్టించకుండా ఫిట్​గా ఉండేందుకు అనుమతిస్తుంది. అయితే మీరు కూడా ఇలా ఫిట్​గా అవ్వాలి అనుకుంటే.. మీకు జుంబా నచ్చుతుందో, ఎరోబిక్స్ నచ్చుతుందో తేల్చుకోండి.

జుంబా అంటే ఏమిటి?

జుంబా అనేది వివిధ రకాల లాటిన్ నృత్యాలతో ఫిట్‌నెస్‌ని మిళితం చేస్తుంది. ఈ సెషన్‌లు సంగీతంతో పాటు జరుగుతాయి. అంతేకాకుండా ట్రైనర్ ఇచ్చే ఇన్​స్ట్రక్షన్స్​కి అనుగుణంగా డ్యాన్స్ చేయడాన్నే జుంబా అంటాము. ఈ అభ్యాసం పూర్తి శరీర వ్యాయామాన్ని నిర్ధారిస్తుంది. అంతేకాకుండా తెలియన ఓ ఆనందాన్ని ఇస్తూ.. మీ కేలరీలను బర్న్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

జుంబా సెషన్‌లు మీ స్టామినాను పెంచడానికి, మీ కండరాలను టోన్ చేయడానికి కూడా సహాయపడతాయి. హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా జుంబా సహాయపడుతుంది.

ఏరోబిక్స్ అంటే ఏమిటి?

నడక, స్విమ్మింగ్, సైక్లింగ్ మొదలైనవాటిని ఏరోబిక్ వ్యాయామాలు అంటాము. ఈ వ్యాయామాలు "కార్డియో" అని లేబుల్​తో ఉంటాయి. ఎందుకంటే అవి హృదయ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. వెయిట్ లిఫ్టింగ్, స్ప్రింటింగ్, జంపింగ్ వంటి శక్తిని పెంచే వ్యాయామాలు ఏరోబిక్స్ కాదనే విషయాన్ని గుర్తించుకోవాలి.

ఏరోబిక్ వ్యాయామాలు శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి. చక్కెర స్థాయిలను తగ్గించడంలో ప్రముఖపాత్ర పోషిస్తాయి. పైగా బరువు తగ్గాలనుకునేవారికి ఇది మంచి ఎంపిక.

జుంబా vs ఏరోబిక్స్

జుంబా, ఏరోబిక్ వ్యాయామాలు రెండూ బరువు తగ్గించడానికి, శక్తిని మెరుగుపరచడానికి గొప్పవి. అయితే ఇతర ఆరోగ్య లక్ష్యాల పరంగా కొన్ని తేడాలు ఉన్నాయి.

మీ లక్ష్యం కండరాలను బలపరచుకోవడం అయితే.. మీకు ఏరోబిక్ వ్యాయామం మంచిది. మరోవైపు మీరు డ్యాన్స్ చేయడం ఇష్టమై.. మీ వ్యాయామ సెషన్‌లో వినోదం పొందాలనుకుంటే.. జుంబాను చేయవచ్చు.

మీరే ఏ వ్యాయామం చేయవచ్చు?

ఏరోబిక్ వ్యాయామాలు స్వయంగా చేయడం సులభం. ఎందుకంటే వాటిలో ఎక్కువ భాగం సహజమైనవి. ఎటువంటి సహాయం అవసరం లేదు. మీరు సులభంగా, సొంతంగా వీటిని చేయవచ్చు. అయినప్పటికీ.. స్విమ్ చేయడం.. లేదా సైకిల్ తొక్కడానికి మీకు కొన్నిసార్లు ట్రైనర్​ అవసరం అవుతారు.

ఏరోబిక్స్‌కి అలా కుదరదు. మీరు స్వయంగా ప్రాక్టీస్ చేయడానికి ముందు మీరు ఫిజికల్ క్లాసుల ద్వారా ట్రైనర్​ నుంచి జుంబా పాఠాలను నేర్చుకోవాలి.

అదనపు ప్రయోజనాలు

జుంబా, ఏరోబిక్ వ్యాయామాలు రెండూ మీ మానసిక ఆరోగ్యానికి గొప్పవి. ఈ రకమైన వ్యాయామాలు ఆందోళనను తగ్గించి.. పని లేదా ఒత్తిడి నుంచి విశ్రాంతి తీసుకోవడానికి గొప్ప మార్గాలు.

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షించే.. బలమైన రోగనిరోధక వ్యవస్థను అభివృద్ధి చేయడంలో సహాయపడతాయి. ఫిజికల్ ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టడం వల్ల మీ రూపాన్ని కూడా మెరుగుపరచుకోవచ్చు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.

సంబంధిత కథనం

టాపిక్