రెడ్ లైట్ థెరపీ అనేది యాంటీ ఏజింగ్ ట్రీట్‌మెంట్(anti aging treatment). ఇది ఫైన్ లైన్స్, ముడతలు, డార్క్ స్పాట్స్, స్కార్స్ వంటి చర్మ సంబంధిత సమస్యలకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది. వయసు పెరిగే కొద్దీ చర్మ సంబంధిత సమస్యలను(Skin Problems) ఎదుర్కొంటాం. ముడతలు, సన్నని గీతలు, వదులుగా ఉండే చర్మం, చర్మంపై నల్లటి మచ్చలు కనిపిస్తుంటాయ్. ఇవన్నీ వృద్ధాప్యానికి సంకేతాలు. కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గినప్పుడు ఈ మార్పులు ఎక్కువగా సంభవిస్తాయి. చర్మం యవ్వనంగా కనిపించడానికి కొల్లాజెన్ ది ముఖ్యపాత్ర.,ఇలాంటి వాటికి రెడ్ లైట్ థెరపీ(Red Light Therapy) పనిచేస్తుంది. ఇది చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీని కారణంగా కొత్త కణాలు కూడా ఏర్పడతాయి. చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. ఈ రోజుల్లో రెడ్ లైట్ స్కిన్ థెరపీ బాగా ప్రాచుర్యం పొందింది.,'రెడ్ లైట్ థెరపీ కారణంగా చర్మంలో ఫైబ్రోబ్లాస్ట్ కణాల పెరుగుదల, పునరుత్పత్తి పెరుగుతుంది. కొల్లాజెన్, ఎలాస్టిన్ ఫైబ్రోబ్లాస్ట్‌ల నుండి ఉత్పత్తి అవుతాయి. ఇది చర్మం మృదువుగా, యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.' అని డెర్మటాలజిస్ట్ డాక్టర్ ఇప్షితా జోహ్రీ అన్నారు. రెడ్ లైట్ థెరపీ అనేది ముడతలు, ఇతర వృద్ధాప్య లక్షణాలను తగ్గించి, చర్మ ఆకృతిని దృఢంగా కనిపించేలా చేసే యాంటీ ఏజింగ్ ప్రక్రియ అని ఆమె తెలిపారు. మచ్చలను తగ్గించడానికి, వాపును తగ్గించడానికి, కణజాల పునరుత్పత్తిని ప్రోత్సహించడానికి కూడా ఉపయోగిస్తారు.,రెడ్ లైట్ థెరపీ అంటే ఏమిటి?పైన పేర్కొన్న విధంగా.. రెడ్ లైట్ థెరపీ అనేది యాంటీ ఏజింగ్ ప్రక్రియ. దీనిలో చర్మంపై ఉండే ఫైన్ లైన్స్, ముడతలు, డార్క్ స్పాట్స్ రెడ్ లైట్ రేడియేషన్ ద్వారా తొలగిస్తారు. వృద్ధాప్యంతో వచ్చే చర్మ సంబంధిత సమస్యలన్నింటినీ ఈ థెరపీ సరిచేస్తుంది. ఈ థెరపీతో కొత్త చర్మ కణాలను పునరుత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. ఇందుకోసం సాఫ్ట్ లేజర్ థెరపీ లేదా కోల్డ్ లేజర్ థెరపీ పద్ధతిని ఉపయోగిస్తారు. తక్కువ తరంగదైర్ఘ్యం కలిగిన రెడ్ లైట్ చర్మంపై కేంద్రీకృతమై ఉంటుంది. ఫోటోడైనమిక్ థెరపీ ప్రక్రియ రెడ్ లైట్ థెరపీలో కూడా ఉపయోగిస్తారు. ఈ థెరపీ చర్మంలో రసాయన చర్యను కలిగిస్తుంది. దెబ్బతిన్న కణాలను చంపుతుంది. ఈ పద్ధతి మొటిమలు, చర్మ క్యాన్సర్(Cancer)కు చికిత్సలాంటి వాటికి ఉపయోగిస్తారు.,రెడ్ లైట్ థెరపీ ప్రయోజనాలుచర్మంపై ఉన్న అన్ని రకాల గాయాలు, మచ్చలను నయం చేస్తుంది.,మార్క్స్ కనిపించడాన్ని తగ్గిస్తుంది.,వయస్సు కారణంగా వచ్చే మచ్చలు, ముడతలు, ఫైన్ లైన్లను తొలగించడంలో సహాయపడుతుంది.,చర్మం ఆకృతిని మృదువుగా చేస్తుంది.,తామర, రోసేసియా, సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులకు కూడా చికిత్స చేస్తారు.,మచ్చల రూపాన్ని తగ్గిస్తుంది. మొటిమలకు చికిత్స చేస్తుంది.,ఎండ వల్ల దెబ్బతిన్న చర్మాన్ని నయం చేస్తుంది.,