Debt Funds: డెట్‌ ఫండ్స్‌ అంటే ఏంటి? వాటి ప్రయోజనాలేంటి?-what is a debt fund types and benefits of debt funds ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  What Is A Debt Fund? Types And Benefits Of Debt Funds

Debt Funds: డెట్‌ ఫండ్స్‌ అంటే ఏంటి? వాటి ప్రయోజనాలేంటి?

Praveen Kumar Lenkala HT Telugu
Feb 28, 2022 05:42 PM IST

డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ప్రభుత్వ బాండ్లు, కార్పొరేట్‌ బాండ్లు, మనీ మార్కెట్‌ సెక్యూరిటీలలో ఇన్వెస్ట్‌ చేస్తాయి. పవర్‌ ఫైనాన్స్ కంపెనీలు, బ్యాంకులు, హోమ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు, ప్రభుత్వాలు బాండ్లు జారీచేస్తాయి. ఈ బాండ్లను కొనుగోలు చేసిన వారికి సమయానుసారం వడ్డీ చెల్లించడానికి హామీ ఇస్తాయి.

ప్రతీకాత్మక చిత్రం: తక్కువ రిస్క్ సామర్థ్యానికి డెట్ ఫండ్స్ మేలు
ప్రతీకాత్మక చిత్రం: తక్కువ రిస్క్ సామర్థ్యానికి డెట్ ఫండ్స్ మేలు (unsplash)

Debt Funds.. బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసినప్పుడు బ్యాంకు నిర్ధిష్టమైన వడ్డీ చెల్లించడానికి హామీ ఇచ్చినట్టే ఈ బాండ్లు కూడా ఇస్తాయి. డెట్‌ ఫండ్స్‌ ఈ బాండ్లకు ఇన్వెస్టర్లుగా ఉంటాయి.

ఒక ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ నుంచి మనం వడ్డీ ఆర్జించినట్టుగా, డెట్‌ ఫండ్స్‌ వాటి బాండ్ల నుంచి సమయానుసారం వడ్డీ సంపాదిస్తాయి. బాండ్లను అమ్మినప్పుడు అసలు మొత్తాన్ని తిరిగి పొందుతాయి.

ఒక స్థిర ఆదాయ మ్యూచువల్‌ ఫండ్లో మీరు ఇన్వెస్ట్‌ చేసినప్పుడు మీకు దాదాపుగా ఎలాంటి రిస్క్‌ ఉండదు.

డెట్‌ ఫండ్స్‌లో ఏయే రకాలు ఉంటాయి?

ప్రభుత్వాలు, కార్పొరేట్లు, బ్యాంకులు జారీ చేసే బాండ్లు, పెద్ద పెద్ద కార్పొరేట్‌ సంస్థలు జారీచేసే డిబెంచర్స్, మనీ మార్కెట్‌ ఇన్‌స్ట్రుమెంట్లయిన కమర్షియల్‌ పేపర్స్, బ్యాంకులు జారీచేసే సర్టిఫికెట్‌ ఆఫ్‌ డిపాజిట్లు వంటివన్నీ డెట్‌ ఫండ్స్‌లోకి వస్తాయి.

వీటిలో ఓవర్‌ నైట్‌ ఫండ్స్, లిక్విడ్‌ ఫండ్స్, అల్ట్రా షార్ట్‌ డ్యురేషన్‌ ఫండ్స్, లో డ్యురేషన్‌ ఫండ్, మనీ మార్కెట్‌ ఫండ్, షార్ట్‌ డ్యురేషన్‌ ఫండ్, మీడియం డ్యురేషన్‌ ఫండ్, మీడియం టు లాంగ్‌ డ్యురేషన్‌ ఫండ్, కార్పొరేట్‌ బాండ్‌ ఫండ్స్, బ్యాంకింగ్‌ అండ్‌ పీఎస్‌యూ ఫండ్స్, గిఫ్ట్‌ ఫండ్స్, డైనమిక్‌ ఫండ్స్‌.. ఇలా అనేక రకాల డెట్‌ ఫండ్స్‌ ఉంటాయి.

డెట్‌ ఫండ్స్‌ ప్రయోజనాలు ఏంటి?

ఇవి స్థిరమైన ఆదాయ వనరుల్లో ఇన్వెస్ట్‌ చేస్తున్నందున రిస్క్‌ ఉండదు. ఈక్విటీ ఫండ్స్‌తో పోలిస్తే మరింత స్థిరంగా ఉంటాయి. భిన్నమైన ఆర్థిక సాధనాల్లో పెట్టుబడులు మేలు చేస్తున్నందున ఇవి కూడా వాటిలో ఒక భాగంగా ఉండడం మంచిది. రిస్క్‌ తీసుకోకుండా, ఒక నిర్ధిష్ట కాలానికి అవసరాలు తీర్చుకునేందుకు ఈ డెట్‌ ఫండ్స్‌ మేలు చేస్తాయి.

 

WhatsApp channel

సంబంధిత కథనం