Tuesday motivation : ఏమి చేసినా అందంగా కనిపించట్లేదా? అయితే ఇది ట్రై చేయండి..-tuesday motivation on happy humans are the prettiest ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Tuesday Motivation On Happy Humans Are The Prettiest.

Tuesday motivation : ఏమి చేసినా అందంగా కనిపించట్లేదా? అయితే ఇది ట్రై చేయండి..

Geddam Vijaya Madhuri HT Telugu
Sep 20, 2022 06:40 AM IST

Tuesday motivation : అందమనేది ఖరీదైన బట్టల్లోనో.. వేసుకునే మేకప్​లోనే ఉండదు. మనుషులు హ్యాపీగా ఉంటే చాలు. వాళ్లకి తెలియకుండానే మొహంలో ఓ గ్లో వచ్చేస్తుంది. అదే వారిని అందంగా చూపిస్తుంది. అందుకే బ్యూటీ మీద పెట్టే శ్రద్ధలో కాస్తైన మానసిక ప్రశాంతత మీద పెట్టండి. అదే మిమ్మల్ని ప్రకాశవంతంగా చేస్తుంది.

కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

Tuesday motivation : అవును నిజమే. అందమైన బట్టలు వేసుకుంటే.. లేక అద్భుతంగా మేకప్ వేసుకుంటే ఎట్రాక్ట్​గా కనిపిస్తాము. కాదనలేము. కానీ హ్యాపీగా ఉంటేనే మీరు ఎంతటి విలువైన మేకప్ వేసుకున్నా.. ఎంత అందంగా రెడీ అయినా ఓ అర్థం. మీరు బాగా రెడీ అయ్యి.. మొహంలో సంతోషం లేకపోతే.. ఇంక రెడీ అయ్యి లాభం ఏమిటి చెప్పండి. మీకున్న దానిలోనే హ్యాపీగా ఉన్నప్పుడు మీ మొహంలో వచ్చే గ్లో.. చాలా అందంగా ఉంటుంది. అది ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిన రాదని గుర్తించుకోండి.

అందం అనేది శారీరకమైనది కాదు.. మానసికమైనది. ముందు మనల్ని మనం ప్రేమించుకోండి. అప్పుడు మిమ్మల్ని.. మీ లుక్స్​ని పట్టించుకునేవాళ్ల గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉండదు. మీరు మానసికంగా ప్రశాంతంగా ఉండడమే మీరు చేయాల్సిన పని. రోజూ ఎలా గడిచినా.. ఎండ్ ఆఫ్ ద డే మీరు హ్యాపీగా ఉన్నారా? లేదా? అనేది పరిశీలించుకోండి.

మీరు హ్యాపీగా ఎప్పుడుంటారంటే.. మీకున్న దానితో సంతృప్తి చెందినప్పుడు. కావాల్సిన దాని గురించి.. మీరు పూర్తి సామర్థ్యం ఉపయోగించి ప్రయత్నించినప్పుడు. అది దక్కినా.. దక్కకపోయినా.. మీ ఎఫెర్ట్స్ మీరు గుర్తిస్తే చాలు. అది మీకు ఆత్మ సంతృప్తిని ఇస్తుంది. మీరు కొందరిని అబ్జెర్వ్ చేస్తే ఈ విషయం తెలిసిపోతుంది. కొందరి దగ్గర ఏమి లేకపోయినా.. వారిని చూస్తే ఓ పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. వారేమి అందంగా రెడీ అవ్వకపోయినా.. ఖరీదైన బట్టలు వేసుకోకపోయినా.. వారి మొహంలో ఉండే నవ్వు వారిని అందంగా చూపిస్తుంది. మరికొందరు ఎంత మంచిగా రెడీ అయినా.. మనకు ఆ ఫీల్ రాదు.

అందంపై శ్రద్ధ తీసుకోవడం తప్పు కాదు. కానీ అంతే ఎఫర్ట్స్ మానసిక అందంపై కూడా పెట్టాలి. అది మీకు మంచిది. అది మీకు పార్లర్​కి వెళ్లిన దొరకనివంటి ఓ గ్లోని ఇస్తుంది. అదే మిమ్మల్ని నలుగురిలో ప్రత్యేకంగా ఉండేలా చేస్తుంది. మానసిక ఆరోగ్యం అనేది.. మీ హెల్త్​ని కూడా మెరుగుపరుస్తుంది. నవ్వుతూ.. హ్యాపీగా ఉండడమే ఎవరికైనా కావాలి. అలా హ్యాపీగా ఉండకపోతే ఇంకెందుకు చెప్పండి. జరిగేవి జరగక మానవు.. వాటిని మనం ఆపలేము కూడా. అలాంటి వాటి గురించి ఆలోచిస్తూ.. మీ సంతోషాన్ని కోల్పోకండి. మంచి జరిగినా.. చెడు జరిగినా.. వాటిని అంగీకరిస్తూ ముందుకు సాగినప్పుడే మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. అదే మీకు, మీ వారికి మంచిది. మీ చుట్టూ ఉన్నవారిని మీరు హ్యాపీగా చూడనవసరం లేదు. కానీ మీరు హ్యాపీగా ఉంటే చూడాలనుకునేవారు కూడా మీ చుట్టూ ఉంటారు. అది వారికి కూడా సంతోషాన్ని ఇస్తుంది. ప్రయత్నించి చూడండి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్