Breakfast Recipes : ఉదయాన్నే స్ప్రౌట్స్ కార్న్ చాట్ తింటే.. మంచి టేస్ట్, ఆరోగ్యం మీ సొంతం-today breakfast recipe is sprouts corn chat here is the ingredients
Telugu News  /  Lifestyle  /  Today Breakfast Recipe Is Sprouts Corn Chat Here Is The Ingredients
Sprouts Corn Chat
Sprouts Corn Chat

Breakfast Recipes : ఉదయాన్నే స్ప్రౌట్స్ కార్న్ చాట్ తింటే.. మంచి టేస్ట్, ఆరోగ్యం మీ సొంతం

12 August 2022, 7:53 ISTGeddam Vijaya Madhuri
12 August 2022, 7:53 IST

Sprouts Corn Chat : ఎవరైనా హెల్తీగానే ఉండాలి అనుకుంటారు. కానీ టేస్టీగా కూడా తినాలి అనుకుంటారు. అలాంటివారు ఈ మిక్స్డ్ స్ప్రౌట్స్ కార్న్ చాట్ తినొచ్చు. దీనిలో ప్రొటీన్లు, విటమిన్స్, ఫైబర్​ వంటి ఇతర ముఖ్యమైన పోషకాలతో నిండి ఉంటాయి కాబట్టి. పైగా దీనిని తయారుచేసుకోవడం మరింత సులభం.

Sprouts Corn Chat : ఉదయాన్నే ఆరోగ్యం కోసం చాలామంది స్ప్రౌట్స్ తింటారు. మీరు కూడా అలాంటి వారు అయితే.. లేదా మీకు ఏమైనా కొత్తగా టేస్టీగా తినాలనిపిస్తే.. మిక్స్డ్ స్ప్రౌట్స్ కార్న్ చాట్ ట్రై చేయండి. ఇది మీ ఆరోగ్యానికి మంచిది. అంతేకాకుండా టేస్ట్​ కూడా చాలా మంచిగా ఉంటుంది. పోషకాలకు పవర్​హౌస్​ లాంటిది ఈ చాట్. ఇది మీరు రోజంతా ఎనర్జీగా ఉండేలా చేస్తుంది. బ్రేక్​ఫాస్ట్​లాగా దీనిని తీసుకోవచ్చు. లేదా స్నాక్స్ లాగా తీసుకోవచ్చు. ఇది మీ కడుపు ఎక్కువసేపు నిండుగా ఉండేలా చేస్తుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సింపుల్. మరి ఇంకెందుకు ఆలస్యం. దీనిని ఎలా వండాలో, కావాల్సిన పదార్థాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

* మిక్స్డ్ స్ప్రౌట్స్ - 15 గ్రాములు

* మొక్కజొన్న గింజలు - 15 గ్రాములు (ఉడికించినవి)

* టొమాటో - 1 (సన్నగా తరగాలి)

* ఉల్లిపాయ - 1 (సన్నగా తరగాలి)

* కొత్తిమీర - 1 స్పూన్ (తరిగినది)

* జీలకర్ర పొడి - అర టీస్పూన్

* కారం లేదా పెప్పర్ పొడి - అర టీస్పూన్

* సాల్ట్ - రుచికి తగినంత

తయారీవిధానం

స్ప్రౌట్స్ కోసం.. అవసరమైన వాటిని రాత్రంతా నానబెట్టి.. మరుసటి రోజు ఉదయం 10 నుంచి 15 నిముషాలు ప్రెషర్​లో ఉడికించాలి. వాటిని నుంచి నీటిని తీసివేసి.. ఓ గిన్నెలో స్ప్రౌట్స్ వేయాలి. దానిలో మొక్కజొన్న, టొమాటో, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, జీలకర్, కారం, సాల్ట్ వేసి బాగా కలపాలి. దీనిలో ఇష్టం ఉంటే నిమ్మకాయ పిండి కూడా ఆస్వాదించవచ్చు. లేదంటే డైరక్ట్​గానే తినేయొచ్చు.

సంబంధిత కథనం

టాపిక్