Breakfast Recipe : స్పైస్డ్ చియా పుడ్డింగ్ గురించి విన్నారా? ఇలా చేసుకుని తినేయండి మరి-today breakfast recipe is spiced chia seed pudding here is the ingredients ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Today Breakfast Recipe Is Spiced Chia Seed Pudding Here Is The Ingredients

Breakfast Recipe : స్పైస్డ్ చియా పుడ్డింగ్ గురించి విన్నారా? ఇలా చేసుకుని తినేయండి మరి

Geddam Vijaya Madhuri HT Telugu
Aug 19, 2022 09:11 AM IST

రోటీన్ బ్రేక్​ఫాస్ట్​లకు బ్రేక్ ఇచ్చి కొత్తగా ఏదైనా ట్రై చేయాలనుకునే వారికి.. స్పైస్డ్ చియా పుడ్డింగ్ బెస్ట్ ఆప్షన్. పేరుకు తగ్గట్లే.. స్పైసీనెస్​తో జిహ్వానికి ఆనందాన్ని ఇస్తుంది. అంతేకాకుండా ఆరోగ్యానికి కూడా మంచిది.

స్పైస్డ్ చియా పుడ్డింగ్
స్పైస్డ్ చియా పుడ్డింగ్

Spiced Chia Seed Pudding : హెల్తీ బ్రేక్ ఫాస్ట్.. విత్ స్పైసీగా కావాలనుకుంటే.. స్పైస్డ్ చియా పుడ్డింగ్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే దీనిలో హెల్త్​కి మంచి చేసే మసాలాలతో పాటు.. ఆరోగ్యానికి అవసరమైన అన్ని పోషకాలు కూడా ఉంటాయి. పైగా దీనిని తయారు చేసుకోవడం చాలా సింపుల్​ కూడా. దీనిని ఎలా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

* పాలు - 2 కప్పులు

* కుంకుమ పువ్వు - చిటికెడు

* యాలకుల పొడి - పావు టీస్పూన్

* దాల్చిన చెక్క పొడి - పావు టీస్పూన్

* వెనిలా ఎక్స్​ట్రాక్ట్ - పావు టీస్పూన్

* చియా సీడ్స్ - 6 టేబుల్ స్పూన్స్

* సర్వీంగ్ కోసం - బెర్రీలు లేదా మీ నచ్చిన ఫ్రూట్స్ వాడుకోవచ్చు

* స్వీట్నర్స్ - మీకు నచ్చినది..

తయారీ విధానం

ముందుగా స్టౌవ్ వెలిగించి.. పాలను మీడియం మంట మీద వేడి చేయాలి. దానిలో కుంకుమపువ్వు వేసి మరిగించాలి. కుంకుమపువ్వు పాల మిశ్రమాన్ని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. దానిలో ఏలకుల పొడి, దాల్చినచెక్క పొడి, వెనిలా ఎక్స్​ట్రాక్ట్ వేసి బాగా కలపాలి. దానిలో చియాసీడ్స్ వేసి.. బాగా కలపాలి.

కనీసం 2 గంటలు ముందైనా లేదా రాత్రి అయినా ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్​లో పెట్టాలి. ఇది చల్లగా అయిన తర్వాత.. మీకు ఇష్టమైన ఫ్రూట్స్​తో గార్నీష్ చేసి.. స్వీట్​నర్​తో కలిపి తీసుకోవచ్చు. దీనిలో డ్రై ఫ్రూట్స్​ కూడా వేసుకుని బ్రేక్​ఫాస్ట్​గా కుమ్మేయొచ్చు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్