Breakfast Dairies : ఫ్రెంచ్ టోస్ట్ విత్ మస్క్ మిలాన్ సలాడ్.. ట్రై చేయండి..-today breakfast recipe is french toast with musk melon salad making process is here ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Today Breakfast Recipe Is French Toast With Musk Melon Salad Making Process Is Here

Breakfast Dairies : ఫ్రెంచ్ టోస్ట్ విత్ మస్క్ మిలాన్ సలాడ్.. ట్రై చేయండి..

Geddam Vijaya Madhuri HT Telugu
Jul 01, 2022 07:52 AM IST

సింపుల్ బ్రేక్ ఫాస్ట్, మంచి టేస్ట్, మంచి లుక్, డిఫరెంట్ అండ్ హెల్తీగా ఉండే అల్పాహారం చేయాలనుకుంటే ఫ్రెంచ్ టోస్ట్ విత్ మస్క్ మిలాన్ సలాడ్ తినాల్సిందే. దీనిని చేసుకోవడం చాలా తేలిక. పైగా దీనితో పాటు ఫ్రూట్ సలాడ్ తీసుకుంటాం కాబట్టి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.

ఫ్రెంచ్ టోస్ట్
ఫ్రెంచ్ టోస్ట్

French Toast with Musk Melon Salad : ఉదయాన్నే మంచి హెల్తీ టిఫెన్ చేయాలనుకునేవారికి ఫ్రెంచ్ టోస్ట్ విత్ మస్క్ మెలోన్ సలాడ్ మంచి ఎంపిక. దీనిని తయారు చేసుకోవడం ఎంత సులభమో చెప్పనవసరంలేదు. చదివితే మీకే అర్థమవుతుంది. పైగా ఉదయాన్నే సలాడ్స్ తీసుకుంటే మీరు రోజంతా యాక్టివ్ గా ఉండొచ్చు. కాబట్టి మీరు కూడా ఈ బెస్ట్ రెసిపీని ట్రై చేయండి. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు తయారు విధానం ఇప్పుడు తెలుసుకుందాం.

ఫ్రెంచ్ టోస్ట్​కు కావాల్సిన పదార్థాలు

* గుడ్లు - 2

* వెనెలా ఎసెన్స్ - 2 స్పూన్స్

* చక్కెర - 2 స్పూన్స్

* పాలు - కప్పు

* బ్రెడ్ - 4

* వెన్న - 50 గ్రాములు

* తేనె - తగినంత

టోస్ట్ గార్నిష్ కోసం

బ్లూబెర్రీలు - కొన్ని

సలాడ్ కోసం

* ఖర్బూజ - 1

* నల్ల ద్రాక్షాలు - 25 గ్రాములు

* పచ్చని ద్రాక్షాలు - 25 గ్రాములు

* వాల్ నట్స్ - 50 గ్రాములు

* గుమ్మడి గింజలు - స్పూన్

* తేనె - 1 స్పూన్

* ఆలివ్ ఆయిల్ - 1 స్పూన్

ఫ్రెంచ్ టోస్ట్ తయారీ..

ఓ గిన్నె తీసుకుని దానిలో గుడ్లు పగలగొట్టి బాగా కలపాలి. అనంతరం చక్కెర, వెనెలా ఎసెన్స్, పాలు వేసి బాగా కలపాలి. ఇప్పుడు పాన్ తీసుకుని స్టవ్ వెలిగించి దానిపై ఉంచాలి. దానిలో కాస్త వెన్న వేయాలి. బ్రెడ్ ముక్కలను ఎగ్ మిశ్రమంలో ముంచి పాన్‌లో వేయాలి. పైన కొంత గుడ్డు మిశ్రమాన్ని వేయాలి. ఈ బ్రెడ్ ముక్కలు బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి. ప్లేటింగ్ కోసం కొన్ని బెర్రీలు, తేనెను వేయండి.

సలాడ్ తయారీ

మస్క్ మెలోన్‌ను కట్ చేసి.. దానిలోని గింజలను తీసివేయాలి. తర్వాత గుజ్జును ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఎరుపు, ఆకుపచ్చ ద్రాక్షలను సగం కట్ చేసి పెట్టుకోవాలి. కుదిరితే స్ట్రాబెర్రీలను కూడా వేసుకోవచ్చు. కొన్ని పుదీనా ఆకులను కూడా వేసుకోవాలి. వాల్నట్, గుమ్మడికాయ గింజలు వేసి కలపాలి. వీటన్నింటిని ఓ గిన్నెలో వేసి కలపాలి. దానిలో తేనె, ఆలివ్ ఆయిల్ వేసి కలపండి. అంతే మస్క్ మిలాన్ సలాడ్ రెడీ అయినట్లే. దీనిని ఫ్రెంచ్​ టోస్ట్​తో తీసుకుంటే అబ్బో.. సూపర్ అనాల్సిందే.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్