Breakfast Recipe : పూజకు ఉపయోగించిన కొబ్బరితో.. సింపుల్​గా బర్ఫీ చేసేయండి-today breakfast recipe is coconut burfi here is the ingredients and process ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Today Breakfast Recipe Is Coconut Burfi Here Is The Ingredients And Process

Breakfast Recipe : పూజకు ఉపయోగించిన కొబ్బరితో.. సింపుల్​గా బర్ఫీ చేసేయండి

Geddam Vijaya Madhuri HT Telugu
Aug 06, 2022 08:00 AM IST

Breakfast Recipe : నిన్ననే వరలక్ష్మీ వ్రతం అయిపోయింది. సాధారణంగా పూజలో ఉపయోగించిన కొబ్బరితో ఇంట్లో ఏదొఒకటి చేస్తూ ఉంటారు. అయితే ఈసారి ఆ కొబ్బరితో.. లేదా కొత్తగా కొబ్బరితో ఏమైనా చేయాలనుకుంటే కొబ్బరి బర్ఫీని ట్రై చేయండి.

కొబ్బరి బర్ఫీ
కొబ్బరి బర్ఫీ

Breakfast Recipe : పూజలో ఉపయోగించిన కొబ్బరితో అమ్మలు, అమ్మమ్మలు చట్నీలు, స్వీట్స్ చేస్తూ ఉంటారు. అయితే ఈసారి వాటికి బదులుగా కొబ్బరి బర్ఫీని చేసుకోండి. ఇది మీకు రుచికి రుచిని ఇస్తుంది. మీరు కొబ్బరితో చేసే రోటీన్ వంటలకు బ్రేక్ ఇస్తుంది. మరి ఈ కొబ్బరి బర్ఫీని ఎలా తయారు చేసుకోవాలో.. ఏమి పదార్థాలు కావాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కొబ్బరి బర్ఫీ తయారీకి కావాల్సిన పదార్థాలు

* పంచదార - 1 కప్పు

* నీరు - 1 కప్పు

* తాజాగా తురిమిన కొబ్బరి - 11/2 కప్పు

* యాలకులు పొడి - 1 స్పూన్

* బాదం - 4,5 (తరిగి పెట్టుకోవాలి)

* పిస్తా - 6,7

* నెయ్యి - 1 స్పూన్

* పాలకోవా - 1 స్పూన్

కొబ్బరి బర్ఫీ తయారీ విధానం

స్టౌవ్ వెలిగించి గిన్నె పెట్టి.. నీటిని పోసి.. దానిలో చక్కెర వేయాలి. అది పూర్తిగా నీటిలో కరిగించి షుగర్ సిరప్ తయారు చేయాలి. ఇది కొద్దిగా చిక్కగా అయ్యేలా చూడండి. ఇప్పుడు ఈ షుగర్ సిరప్​లో కొబ్బరి తురుము వేసి బాగా కలపాలి. స్టవ్ సిమ్​లో ఉంచాలి. దీనిలో పాలకోవా, ఏలకుల పొడి వేసి బాగా కలపి దించేయాలి.

ఇప్పుడు ట్రేలో కొద్దిగా నెయ్యి రాసి.. ఈ కొబ్బరి మిశ్రమాన్ని దానిలో వేసి.. సమానంగా పరచాలి. దాని మీదు తరిగిన డ్రై ఫ్రూట్స్ చల్లుకోండి. ఈ మిశ్రమాన్ని 15 నిమిషాలు ఫ్రిజ్లో ఉంచండి. అనంతం దానిని బయటకు తీసి.. మీకు నచ్చిన షేప్​లలో కట్​చేసుకుని లాగించేయండి. చూశారా కొబ్బరి బర్ఫీ చేయడం ఎంత సులువో.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్