Korean glass skincare: కొరియన్ గ్లాస్ స్కిన్ కావాలంటే.. ఇవి వాడండి..-tips to get glass skin with different types of toners ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Tips To Get Glass Skin With Different Types Of Toners

Korean glass skincare: కొరియన్ గ్లాస్ స్కిన్ కావాలంటే.. ఇవి వాడండి..

HT Telugu Desk HT Telugu
May 25, 2023 02:05 PM IST

Korean glass skincare: కొరియన్ స్కిన్ కేర్ గురించి చాలా ఆసక్తిగా వెతుకుతుంటాం. అలాంటి అందమైన చర్మం ఉండాలంటే ఎలాంటి టోనర్లు వాడాలో చూడండి.

కొరియన్ గ్లాస్ స్కిన్‌కేర్
కొరియన్ గ్లాస్ స్కిన్‌కేర్ ( Unsplash)

కొరియన్ గ్లాస్ స్కిన్ కేర్ అంటే కొరియాలో ప్రాముఖ్యం అయిన స్కిన్ కేర్ రొటీన్. ఎలంటి మచ్చలు లేని, మృదువైన చర్మాన్ని గ్లాస్ స్కిన్ అనొచ్చు. కానీ అంత అందమైన చర్మం మన సొంతం కావాలంటే..డబుల్ క్లెన్సింగ్, స్క్రబ్బింగ్, హైడ్రేషన్, టోనింగ్ ముఖ్యం. ముఖ్యంగా హైలురోనిక్ యాసిడ్, గ్లిసరిన్ లాంటి వాటిని చర్మ రక్షణ కోసం వాడాలి. మాయిశ్చరైజర్, షీట్ మాస్కులు, సన్ స్క్రీన్ ముఖ్యమే. కొన్ని రకాల మేకప్ టెక్నిక్స్ కూడా గ్లాసీ స్కిన్ లాగా కనిపించడానికి వాడతారు.

అయితే ఏం చేసినా ఒకట్రెండు సార్లు చేసి వదిలేస్తే ఫలితం ఉండదు. క్రమం తప్పకుండా ఒక స్కిన్ కేర్ రొటీన్ ఉండాలి. మీ చర్మానికి తగ్గ ఉత్పత్తులు ఎంచుకోవాలి. ఏమైనా చర్మ సమస్యలుంటే ముందుగా డెర్మటాలజిస్ట్ ను సంప్రదించి ఒక స్కిన్ కేర్ రొటీన్ తయారు చేసుకోండి.

క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజర్ ఈ మూడు స్కిన్ కేర్ లో తప్పకుండా ఉండాలి. చాలా మంది టోనర్ అంటే జిడ్డు తొలగించడం కోసమే అనుకుంటారు. కానీ నిజానికి ఇది చర్మం పీహెచ్ స్థాయుల్ని బ్యాలెన్స్ చేస్తుంది. మీ చర్మానికి తగ్గ టోనర్ వాడటం చాలా ముఖ్యం. ఇదే కొరియన్ స్కిన్ కేర్ లో చాలా ముఖ్యమైంది.

టోనర్ అంటే ఏమిటి?

టోనర్ల రకాలు తెలుసుకునే ముందు టోనర్ అంటే ఏంటో చూద్దాం. ఇది నీటి ఆధారిత లిక్విడ్. ఇది చర్మం కోల్పోయిన తేమను తిరిగిస్తుంది. మంచి నాణ్యత గల టోనర్ ను టానిక్ అనికూడా అంటారు. కాలుష్యం బారిన పడకుండా చర్మం పీహెచ్ స్థాయుల్ని ఇది నియంత్రిస్తుంది.

టోనర్స్ రకాలు:

ముఖ్యంగా మూడు రకాలుంటాయి. సాధారణ చర్మం, జిడ్డు చర్మం, కాంబినేషన్ చర్మానికి తగ్గట్లు టోనర్లుంటాయి. మీకు నప్పే టోనర్ ఎంచుకునే ముందు వాటి గురించి తెలుసుకోవాలి.

  • తేమను పెంచే టోనర్లు: హైడ్రెటింగ్ టోనర్లు దాదాపు అన్ని రకాల చర్మాలకు నప్పుతాయి. అయితే పొడి చర్మం ఉన్నవాళ్లకి మాత్రం మాయిశ్చరైజింగ్ టోనర్లే మేలు. వీటిలో గ్లిసరిన్, హైలురోనిక్ యాసిడ్ ఉంటుంది. దీనివల్ల చర్మం పీహెచ్ పెరుగుతుంది. దీనికి మంచి ఉదాహరణ రోజ్ టోనర్.
  • ఎక్స్‌ఫోలియేటింగ్ టోనర్స్: వీటిలో పండ్ల ఎంజైమ్స్, హైడ్రాక్సీ యాసిడ్ ఉంటుంది. వీటినే పోర్ క్లారిఫైయింగ్ టోనర్ అంటారు. అంటే చర్మ రంధ్రాలు శుభ్రపరిచే టోనర్. ఇది చర్మం మీద ఉన్న మృతకణాల్ని తొలగిస్తుంది. ఇది జిడ్డు కూడా రాకుండా కాపాడుతుంది. ఆయిల్ స్కిన్ ఉన్నవాళ్లకి ఇవి మంచి ఎంపిక.
  • ట్రీట్ మెంట్ టోనర్లు: చర్మ సమస్యలేమైనా ఉంటే వీటిని వాడాలి. యాంటీ ఆక్సిడెంట్లు, చేమంతి టోనర్లు చర్మం ముడతలు, సన్నని గీతలు, యాక్నె, మచ్చలు వంటి సమస్యల్ని తగ్గిస్తాయీ టోనర్లు.

దీని ప్రకారం మీకు నప్పే టోనర్ ఎంచుకోండి. దీనివల్ల తాజా, అందమైన, గ్లాసీ చర్మం మీ సొంతమవుతుంది.

WhatsApp channel