Best Winter Fruits । చలికాలంలో ఈ పండ్లు తింటే మంచి ఆరోగ్యం.. పిల్లలకు తప్పకుండా తినిపించండి!
Best Winter Fruits: ఈ చలికాలంలో కొన్ని రకాల పండ్లు తింటే అవి మీ రోగనిరోధక శక్తిని పెంచుతాయి, మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ముఖ్యంగా వీటిని పిల్లలకు తినిపిస్తే మంచి పోషణతో పాటు సీజనల్ వ్యాధుల ప్రమాదం నుంచి బయటపడతారు.
ఏ సీజన్‌లో లభించే పండ్లను ఆ సీజన్‌లో తినాలి, ఈ అలవాటు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ చలికాలంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. చిన్నపిల్లలూ తరచూ దగ్గు, జలుబు, జ్వరాలతో బాధపడుతుంటారు. వారికి ఈ సమయంలో బలవర్థకమైన పోషకాహారం అవసరం. ఈ చలికాలంలో లభించే కొన్ని పండ్ల రకాలను తినడం వలన వారికి మంచి పోషణ అందుతుంది, వ్యాధులు బారినపడే ప్రమాదం తగ్గుతుంది.

జ్యూస్‌లు చేసి ఇచ్చే బదులు, ఈ పండ్లనే నేరుగా తినిపించాలి. వివిధ రకాల పండ్లను ముక్కలుగా కోసి అల్పాహారంగా ఇవ్వవచ్చు. వారి టిఫిన్ బాక్సులోనూ పెట్టిస్తే ఖాళీ సమయంలో తింటారు. మరి రండి, మీరు పిల్లలకు ఏ పండ్లు తినిపించాలో ఇక్కడ తెలుసుకోండి.
ఉసిరి
ఉసిరికాయ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వెంట్రుకలు పెరుగుదల, చర్మం, కళ్ల ఆరోగ్యానికి ఉసిరి చాలా మంచి ప్రయోజనాలను కలిగి ఉంది. ఇది ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా జీర్ణవ్యవస్థ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది.
నారింజ
నారింజలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో విటమిన్ సి కాకుండా, పొటాషియం, ఫోలేట్ కూడా పుష్కలంగా ఉంటాయి. పిల్లలు కూడా నారింజలను తినడానికి చాలా ఇష్టపడతారు.
నల్ల ద్రాక్ష
చలికాలంలో నల్ల ద్రాక్ష దొరుకుతుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులోనూ విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. ద్రాక్షలోని పోషకాలు పిల్లల గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.
దానిమ్మ
చలికాలంలో పిల్లలకు అందించాల్సిన పండ్లలో దానిమ్మ కూడా ఒకటి. ఇందులో విటమిన్ సి, ఇ , కె, యాంటీఆక్సిడెంట్లు, ఫోలేట్, పొటాషియం ఇంకా ఐరన్ ఉన్నాయి. ఈ పోషకాలన్నీ పిల్లలకు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అంతేకాకుండా ఇవి బ్యాక్టీరియాను నశింపజేస్తాయి. వైరస్ ఫ్లూల బారినుండి పోరాడటానికి సహాయపడతాయి.
క్యారెట్
పండ్లతో పాటు క్యారెట్ కూడా పిల్లలకు తినిపించాలి. క్యారెట్‌లో చాలా తక్కువ కేలరీలు ఉంటాయి. ఇందులో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి తింటే పిల్లల కంటి చూపు సరిగ్గా ఉంటుంది, కాబట్టి వారికి క్యారెట్‌లను ఏదో ఒక రూపంలో తినిపించండి.
ఇంకా జామ, అరటి, కివీ పండ్లను తినిపించవచ్చు. 'యూజ్ లెస్ ఫెలో.. ఎందుకు పనికి రావు' అంటూ మీ పిల్లలపై అరవకండి
సంబంధిత కథనం