Spiced Buttermilk : మజ్జిగను ఇలా వెరైటీగా తయారు చేసుకోండి.. సూపర్ టేస్ట్‌తో పాటు మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు-spiced buttermilk try this buttermilk recipe in this summer for taste and health benefits ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Spiced Buttermilk Try This Buttermilk Recipe In This Summer For Taste And Health Benefits

Spiced Buttermilk : మజ్జిగను ఇలా వెరైటీగా తయారు చేసుకోండి.. సూపర్ టేస్ట్‌తో పాటు మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు

Chatakonda Krishna Prakash HT Telugu
May 16, 2023 11:55 AM IST

Spiced Buttermilk: మజ్జిగను స్పైసీగా, టెస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి. ఈ మజ్జిగ మంచి రుచి ఉండడమే కాదు, ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.

Spiced Buttermilk : మజ్జిగను ఇలా వెరైటీగా తయారు చేసుకోండి.. (Photo: Unsplash)
Spiced Buttermilk : మజ్జిగను ఇలా వెరైటీగా తయారు చేసుకోండి.. (Photo: Unsplash)

Spiced Buttermilk : వేసవి కాలంలో మజ్జిగ (Buttermilk) తాగడం చాలా ముఖ్యం. వేడి నుంచి ఉపశమనం లభించాలంటే మజ్జిగ ఉపయోగపడుతుంది. అందుకే ఎక్కువ మంది బటర్‌మిల్క్ తాగేందుకు మొగ్గుచూపుతారు. అయితే, కొందరికి సాదా మజ్జిగ తాగి కాస్త బోర్ కొట్టి ఉంటుంది. ఏదైనా డిఫరెంట్‍గా ట్రై చేయాలనుకుంటుంటారు. అలాంటి వారికోసమే ఈ రెసిపీ (Recipe). ఇది మీ శరీరాన్ని చల్లబరచడమే కాదు.. రుచి విషయంలోనూ అదిరిపోతుంది. సుగంధ ద్రవ్యాలు, మూలికలతో ఉండే ఈ స్పైస్డ్ మజ్జిగ (Spiced Buttermilk).. టేస్టీగా ఉండడమే కాదు.. మీ శరీరానికి, మెదడుకు టానిక్‍లా పని చేస్తుంది. దీన్ని మసాలా చాస్ (Masala Chaas) అని కూడా ఉంటారు. స్పైసీగా మజ్జిగ తాగాలనుకుంటే మీకు ఈ స్పైస్డ్ బటర్‌మిల్క్ బాగా సూటవుతుంది. మరి ఇంట్లోనే ఈ స్పైస్డ్ బటర్‌మిల్క్ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

Spiced Buttermilk: స్పైస్డ్ బటర్‌మిల్క్ తయారీకి కావాల్సిన పదార్థాలు

  • 2 కప్పుల మజ్జిగ
  • అర (1/2) టీస్పూన్ జీలకర్ర పొడి
  • అర టీస్పూన్ ధనియాల పొడి
  • పావు (1/4) టీస్పూన్ నల్ల మిరియాల పొడి
  • పావు టీస్పూన్ ఎర్ర కారం పొడి
  • పావు టీస్పూన్ ఉప్పు
  • ఒక టేబుల్ స్పూన్ తరిగిన తాజా పుదీన ఆకులు
  • ఒక టేబుల్ స్పూన్ తాజా కొత్తిమీర ఆకులు

తయారు చేసే విధానం

  • Spiced Buttermilk : ముందుగా పదార్థాలన్నీ ఒకచోటికి తెచ్చుకోండి. మజ్జిగ.. సాధారణ ఉష్ణోగ్రతతో ఉండేలా చూసుకోవాలి.
  • ముందుగా ఓ చిన్న గిన్నెలో.. జీలకర్ర పొడి, ధనియాల పొడి, నల్ల మిరియాల పొడి, ఉప్పు కలుపుకోండి.
  • ఆ తర్వాత ఓ పెద్ద పాత్రలో, మజ్జిగను బాగా చిలకండి.
  • ఆ తర్వాత చిన్న పాత్రలో కలుపుకున్న ఆ మిశ్రమాన్ని మజ్జిగలో వేయండి. అప్పుడు మళ్లీ అన్నీ కలిసేలా చిలకాలి.
  • అప్పుడు తరుగుకున్న పుదీన, కొత్తిమీర ఆకులు ఆ మజ్జిగలో వేయాలి. ఓ గంటెతో బాగా కలపాలి.
  • ఆ తర్వాత స్పైస్‍లన్నీ కలిపిన మజ్జిగను టేస్ట్ చేయాలి. మీకు నచ్చిన విధంగా పదార్థాలను అడ్జస్ట్ చేసుకోవాలి. అవసరమైతే ఉప్పు, మిరియాల పొడి, కారం లాంటివి యాడ్ చేసుకోవచ్చు.
  • ఆ తర్వాత రిఫ్రిజిరేటర్‌లో కనీసం ఒక గంటపాటైనా ఈ స్పైస్డ్ మజ్జిగ (Spiced Buttermilk)ను చల్లబడే వరకు ఉంచాలి. ఆ తర్వాత మాత్రమే సర్వ్ చేసుకోవాలి.
  • రిఫ్రిజిరేటర్‌లో గంట ఉంచిన తర్వాత స్పైస్డ్ బటర్‌మిల్క్ సర్వ్ చేసేందుకు సిద్ధంగా ఉంటుంది. బయటికి తీశాక మజ్జిగను మరోసారి బాగా కలపండి. ఆ తర్వాత గ్లాసుల్లో పోయండి. కావాలంటే పుదీనా, కొత్తమీర ఆకులతో గార్నిష్ చేయవచ్చు. ఆ తర్వాత ఈ రుచికరంగా ఉండే ఈ స్పైస్డ్ బటర్‌మిల్క్ తాగేయవచ్చు.

Spiced Buttermilk : ఈ స్పైస్డ్ మజ్జిగ ద్వారా కొన్ని అదనపు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. స్పైసెస్ మిశ్రమం వల్ల కాల్షియమ్, ప్రొటీన్, విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. జీర్ణక్రియ కూడా మెరుగవుతుంది. అలాగే, ఇది లో-క్యాలరీ డ్రింక్‍గా ఉంటుంది. బరువు తగ్గాలని డైట్ చేస్తున్న వారికి కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. పుదీనా, కొత్తిమీర వాడటంతో యాంటీయాక్సిడెంట్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. మొత్తంగా ఆరోగ్యానికి ఈ డ్రింక్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్