Saturday Thoughts : సక్సెస్​కు నో షార్ట్ కట్స్.. జీవితంతో పోరాడాల్సిందే-saturday thoughts there is no shortcut for success ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Saturday Thoughts : సక్సెస్​కు నో షార్ట్ కట్స్.. జీవితంతో పోరాడాల్సిందే

Saturday Thoughts : సక్సెస్​కు నో షార్ట్ కట్స్.. జీవితంతో పోరాడాల్సిందే

HT Telugu Desk HT Telugu
Feb 18, 2023 04:22 AM IST

Saturday Motivation : జీవితంలో ఎదగాలని చాలామంది అనుకుంటారు. కానీ చిన్న చిన్న కారణాలతో పక్క దారిలో వెళ్తారు. జీవిత లక్ష్యాన్ని నిర్దేశించుకుని.. సరైన మార్గంలో వెళితే.. సక్సెస్ చూడొచ్చు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (unsplash)

లక్ష్యం లేని జీవితం.. గమ్యం లేని పడవలాంటిది. ఎటు వెళ్తుందో అర్థం కాదు.. నడుస్తుందంటే.. నడుస్తుందంతే. జీవితంలో లక్ష్యం నిర్దేశించుకుని.. దానికి తగ్గట్టుగా ముందుకు సాగాలి. లక్ష్యం ఉంటే.. కచ్చితంగా ముందుగు సాగుతారు. ఇతర వైపులకు ప్రయాణించకుండా ముందుకు వెళ్తారు. జీవితంలో చేపట్టే.. పనుల్లో విజయం సాధించాలని చాలా మంది కలలు కంటారు.

జీవితానికి లక్ష్యాన్ని పెట్టుకుని.. ప్రతి ఒక్కరూ కష్టపడతారు. అయితే కొన్ని సమయల్లో అనుకోకుండా పక్కకు తప్పుకొంటారు. మరికొంతమందేమో ఎంత కష్టపడినా.. తగిన ఫలితం రాదు. దీంతో ఫిర్యాదులు ఎక్కువ అవుతాయి. తమ జీవితం మీద.. తామే.. కంప్లైంట్ చేసుకుంటారు. కానీ ఫిర్యాదులు చేస్తే.. వచ్చేది ఏమీ ఉండదు. లక్ష్యాన్ని పక్కన పెడతారు. మరికొంతమంది లక్ష్యం లేకుండానే బతికేస్తారు. చిన్న చిన్న ఆశలు మాత్రమే ఉంటాయి. పైకి ఎదగాలని భావిస్తే.. మాత్రం మెుదటగా లక్ష్యాన్ని పెట్టుకోవాలి. లక్ష్యమే జీవితానికి దారి చూపిస్తుంది. ఒక దిశలో పయనించేలా చేస్తుంది. గమ్యాన్ని చేరుకోవాలంటే.. ముందు ఎక్కడకు వెళ్లాలో క్లారిటీ ఉండాలి.

ఒక వ్యక్తి తన జీవితంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే ధైర్యాన్ని కలిగి ఉండాలి. ధైర్యం కంటే.. లక్ష్యం గొప్పది కాదు.. ధైర్యంగా ఉంటే ఎలాంటి లక్ష్యాన్నైనా చేరొచ్చు. జీవితంలో పోరాడేందుకు ధైర్యం ఉండాలి.

జీవితంలో లక్ష్యం ఎంత పెద్దదైతే.. విజయం కూడా అంతే పెద్దగా ఉంటుంది. విజయాన్ని పొందడానికి పట్టే సమయం ఎక్కువే. కానీ.. గెలిచాక.. వచ్చే ఆనందం.. ఎంత చెప్పినా తక్కువే.

లక్ష్యం లేని వ్యక్తి జీవితం చిరునామా రాయని ఉత్తరం లాంటిది. ఎక్కడికీ చేరదు. లక్ష్యం లేని జీవిత ప్రయాణం కూడా అంతే అనుకోవాలి. ఎక్కడకు వెళ్లాలని తెలియదు. ఈరోజు గడిస్తే.. చాలు అనేలా ఉంటుంది.

మీరు విజయాన్ని సాధించలేకపోతే.. మీరు లక్ష్యాన్ని మార్చుకోవడానికి బదులు.., ఆ లక్ష్యాన్ని సాధించే విధంగా మీ ఆలోచనకు కొత్త దిశ చూపించాలి.

నిన్నటి తప్పులను సరిదిద్దుకొంటూ.., రేపటి లక్ష్యం కోసం పోరాడుతూ.. చేరే గమ్యానికి ఈరోజు బాటలు పరుచు..!

WhatsApp channel

సంబంధిత కథనం