Saturday Motivation : చిల్ బ్రో.. నువ్వు ఎంత కష్టపడినా.. నీ చుట్టూ ఉన్న వారిని సంతృప్తి పరచలేవు..-saturday motivation on you will never be good enough for everybody but you will for someone who really appreciates you
Telugu News  /  Lifestyle  /  Saturday Motivation On You Will Never Be Good Enough For Everybody, But You Will For Someone Who Really Appreciates You
కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

Saturday Motivation : చిల్ బ్రో.. నువ్వు ఎంత కష్టపడినా.. నీ చుట్టూ ఉన్న వారిని సంతృప్తి పరచలేవు..

14 January 2023, 4:01 ISTGeddam Vijaya Madhuri
14 January 2023, 4:01 IST

Saturday Motivation : మీరు అందరితో మంచిగా ఉండాల్సిన అవసరం లేదు. అలా అని చెడుగా ఉండాలని కాదు. కానీ మిమ్మల్ని అర్థం చేసుకుని.. మీరు ఏదైనా సాధించగలరని నమ్మేవారితో మాత్రం.. ఎలాంటి పరస్థితుల్లోనైనా మంచిగా ఉండడం నేర్చుకోండి.

Saturday Motivation : నిజమే మీరు జీవితంలో ఎంత కష్టపడినా.. ఎన్ని బాధలు అనుభవించినా.. మీ చుట్టూ ఉన్నవారిని ఎప్పటికీ సంతృప్తి పరచలేరు. మీరు వాళ్లకి మీ ప్రాణమే ఇచ్చినా.. ఎవరో ఒకరు.. మీ విషయంలో ఏదొక అసంతృప్తితోనే ఉంటారు. కాబట్టి వాళ్లని మీరు హ్యాపీగా చూసుకోవాల్సిన అవసరం లేదు. కానీ మీరు ఎవరిని హ్యాపీగా చూసుకోవాలో తెలుసా? మిమ్మల్ని అర్థం చేసుకునేవారిని, మీ దగ్గర ఏమున్నా లేకున్నా మీతో సంతోషంగా ఉండేవారిని, మీ కష్టాల్లో తోడుండే వారిని ఎప్పుడూ బాధపెట్టకండి. వారిని హ్యాపీగా చూసుకోవడంలోనే మీ సక్సెస్ దాగి ఉంది.

గంగిగోవు పాలు గరిటడైనా చాలు.. కడివెడైననేమి ఖరము పాలు అన్నట్లుగా.. మనకి అవసరం లేని వారి గురించి ఎప్పుడూ ఆలోచించకండి. మనతో ఎవరు ఉంటే హ్యాపీగా ఉంటామో వారి గురించి.. కష్టాల్లో కూడా మనతో ఎవరూ ఉంటారో వారి గురించి మాత్రమే ఆలోచించండి. అందరినీ సంతృప్తి పరచడం ఆ దేవునికే సాధ్యం కాదు. మనం జస్ట్ మనుషులం. మనతోని ఎలా సాధ్యమవుతుంది. మీరు ఎంత మంచివారైనా.. ఎందరినీ ఏ రకంగా చూసుకుంటున్నా.. ఎవరో ఒకరికి మీ పట్ల అసంతృప్తి భావన ఉంటుంది. మీరు బంగారం ఇచ్చినా.. వజ్రాలు ఇవ్వట్లేదే అని ఆలోచించే జనాల మధ్యనే మనం ఉంటున్నాము.

మన నుంచి ఏది ఆశించని వ్యక్తులు చాలా రేర్​గా దొరుకుతారు. వారు మీరు ఇచ్చే విలువైన వస్తువుల కోసం ఎదురు చూడరు. కేవలం మీ సమయం, మీ ప్రేమను కోరుకునే వ్యక్తులు కూడా మీ జీవితంలో ఉండే ఉంటారు. అలాంటి వారిని సంతోషంగా చూసుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది. వారి కోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. కొన్ని విషయాల్లో అడ్జెస్ట్ అయితే చాలు. వారు హ్యాపీగా ఉంటారు. మీరు హ్యాపీగా, ప్రశాంతంగా ఉంటారు.

అలాగే మీపై అందరూ నమ్మకముంచలేరు. కొందరు అవసరాలకు, పరిస్థితులకు అనుగుణంగా మిమ్మల్ని నమ్మడానికి ప్రయత్నిస్తారు. కొందరు మీరు సాధించలేరు అని లోపల అనుకుంటూ.. బయటకు మాత్రం నువ్వు సాధిస్తావు అంటారు. మరికొందరు నువ్వు సాధించలేవు అని ఫిక్స్ అయిపోతారు. మీరు ఒక్కసారి ఓడిపోతే చాలు.. వీళ్ల అసలు రంగులు బయటపడిపోతాయి. కానీ కొందరు మాత్రం నువ్వు ట్రై చేయి కచ్చితంగా అనుకున్నది సాధిస్తావు అంటారు. ఏది ఏమైనా నీకు తోడుగా నేను ఉన్నాను అంటూ ఎంక్రేజ్ చేస్తారు. ఓడిపోయినా మరోసారి ప్రయత్నిద్దాం అంటూ మీ వెన్ను తడతారు. అలాంటివారి ముఖాల్లో మీరు చిరునవ్వు రప్పించడం కోసం మీరు ఏదైనా చేయవచ్చు. వారికోసం కష్టపడడంలో ఓ అర్థముంది.

కొందరు మీరు ఎంత చేసినా.. ఏమి చేయలేదనే వారే ఎక్కువగా ఉంటారు. ఎక్కడివరకో ఎందుకు.. మీ ఇంట్లో వారు కూడా మీరు ఎంత చేసినా.. ఇంకేదొ చేయట్లేదనే ముఖం మాడ్చుకుంటారు. దాని అర్థం మీరు ఏదో తప్పు చేశారని కాదు. మీరు చేసే ప్రతి పనిలోనూ వారు తప్పులను వెతికే మనస్తత్వం వారిది. అయితే కొందరు మాత్రం మీరు ఏమి చేసినా.. చేయకపోయినా.. మీతో హ్యాపీగా ఉంటారు. మీకు పాజిటివ్ వైబ్స్ ఇచ్చే వారిని మాత్రం లైఫ్​లో ఎప్పుడూ వదులుకోకండి. వారిని సుఖ పెట్టకపోయినా పర్లేదు కానీ.. కష్టపెట్టకండి.

సంబంధిత కథనం