Reduce Backpain : వెన్నునొప్పి తగ్గాలంటే బెడ్​రెస్టే కాదు.. వ్యాయామం కూడా మంచిదే-reduce backpain with multiple exercises here is the details ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Reduce Backpain With Multiple Exercises Here Is The Details

Reduce Backpain : వెన్నునొప్పి తగ్గాలంటే బెడ్​రెస్టే కాదు.. వ్యాయామం కూడా మంచిదే

Geddam Vijaya Madhuri HT Telugu
Aug 06, 2022 10:34 AM IST

Back Pain Treatment : ప్రస్తుతం చాలామంది కుర్చొని చేసే ఉద్యోగాలు చేస్తున్నారు. అలాంటివారికి వెన్నునొప్పి అనేది చాలా సాధారణమైన నొప్పి అయిపోయింది. కానీ దీనిని ఎంత నిర్లక్ష్యం చేస్తే.. అంతకుమించి అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఈ సమస్యను ముందుగానే గుర్తించి.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు.

వెన్నునొప్పి తగ్గించుకోవడానికి చిట్కాలు
వెన్నునొప్పి తగ్గించుకోవడానికి చిట్కాలు

Back Pain Treatment : వెన్నునొప్పి అనేది కండరాల నొప్పి. అత్యంత సవాలుగా ఉండే రకాల్లో ఒకటి. ఇంటి నుంచి పని చేసేటప్పుడు లేదా ఆఫీసు షెడ్యూల్​లో పని చేస్తున్నప్పుడు ఎక్కువ గంటలు ల్యాప్‌టాప్‌పై పనిచేయడం వల్ల తరచుగా మన భంగిమకు భంగం కలుగుతుంది. ఇది నడుము నొప్పికి దారితీస్తుంది. ఏ విధమైన నొప్పినైనా పరిష్కరించడానికి మొదటి మార్గం బెడ్‌రెస్ట్‌. అయితే వెన్నునొప్పిని వ్యాయామాల ద్వారా తగ్గించుకోవచ్చు అంటున్నారు వైద్యులు.

వెన్నునొప్పితో బాధపడేవారు రికవరీ ప్రక్రియను వేగవంతం చేయడానికి వ్యాయామం ప్రారంభించమని వైద్యులు సలహా ఇస్తారు. మీరు నొప్పిని తగ్గించుకుని, తిరిగి ఆరోగ్యాన్ని పునరుద్ధరించడానికి మార్గాల కోసం చూస్తున్నట్లయితే.. ఈ అంశాలను గుర్తుంచుకోండి.

వెన్నునొప్పి తగ్గాలంటే..

* మానవ శరీరం కదిలేలా రూపొందించబడింది. కాబట్టి ఎక్కువసేపు నిశ్చల స్థానాల్లో.. లేదా ఒకే పొజీషన్​లో ఉండటం వల్ల మీ కండరాలు బలహీనపడతాయి. అంతేకాకుండా కనెక్టిష్ టిష్యూను గట్టిపడేలా చేస్తాయి. జాయింట్ లూబ్రికేషన్‌కు భంగం కలిగించడమే కాకుండా.. ఎక్కువసేపు ఒకే స్థితిలో ఉండటం వల్ల అనేక ఇతర సమస్యలు కూడా వస్తాయి.

* ఇలాంటి పరిస్థితుల్లోనే మీకు వెన్నునొప్పి రావచ్చు. అందుకే మీ కండరాలలో ఒత్తిడిని తగ్గించుకోవడానికి మీరు వీలైనంత ఎక్కువగా కదిలేలా చూసుకోండి.

* మీరు మీ శరీరంలో ఏదైనా రకమైన నొప్పిని ఎదుర్కొంటున్నట్లయితే, దానికి ప్రతిస్పందించడం చాలా ముఖ్యం. వెన్నునొప్పిని ఎదుర్కొనే చాలా మంది వ్యక్తులు వారి దినచర్యకు అంతరాయం కలిగించే వరకు సమస్యను విస్మరిస్తారు. కాబట్టి వారు ఎక్కువ ఇబ్బందిని ఎదుర్కొంటారు.

* మీ వెన్నుముక నొప్పిని విస్మరించడం అంటే.. దానిని మరింత సీరియస్​గా చేసుకోవడమే. ప్రారంభంలో ఉన్నప్పుడే దానికి సరైన చికిత్స లేదా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే దానిని భరించడం చాలా కష్టం. నొప్పికి సరైన కారణాన్ని తెలుసుకుని మీరు మందులు తీసుకోవాలి.

* మీ మనస్సు, శరీరం మధ్య బంధాన్ని బలోపేతం చేయడానికి మీరు ధ్యానం వంటి శ్వాస వ్యాయామాలను ప్రయత్నించవచ్చు.

* డాక్టర్ సలహాతో కొన్ని వ్యాయామాలను ప్రాక్టీస్ చేయండి. ఈ వ్యాయామాలు చేయడం ద్వారా మీరు వెన్నునొప్పిని తగ్గించుకోవచ్చు.

* లేదంటే మీరు YouTube లేదా Googleలో వెన్నునొప్పిని తగ్గించడానికి ఉండే వ్యాయామాలను ట్రై చేయవచ్చు. వాటిని చేయడం ద్వారా మీ నొప్పి పెరగకపోతే మాత్రమే వ్యాయామాలు చేయాలి. ఒకవేళ ఎక్కువైంది అనిపిస్తే వాటిని వెంటనే మానేయాలి.

* ఎందుకంటే ప్రతి వ్యాయామం వేర్వేరు వ్యక్తులకు వేర్వేరు ఫలితాలను ఇస్తుంది. అందువల్ల మీరు ఏదైనా వ్యాయామ కార్యక్రమాన్ని అనుసరించడం ప్రారంభించే ముందు మీరు మీ వైద్యుడిని కచ్చితంగా సంప్రదించాలి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్