Toxic Parenting : మీ పిల్లలతో ఈ మాటలు చెప్పడం మానేయండి-parenting tips stop saying these things to your child ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Toxic Parenting : మీ పిల్లలతో ఈ మాటలు చెప్పడం మానేయండి

Toxic Parenting : మీ పిల్లలతో ఈ మాటలు చెప్పడం మానేయండి

HT Telugu Desk HT Telugu
Feb 12, 2023 02:13 PM IST

Parenting Tips : పిల్లల పెంపకం నిజంగా కష్టతరమైనది. కొన్నిసార్లు వారి మీద విపరీతమైన కోపం రావొచ్చు. అయితే ఏదిపడితే అది అనడం మాత్రం చేయోద్దు. వారి చిన్ని మనసును బాధ పెట్టొద్దు. మీ చిన్నారికి బాధ కలిగించే విషయాలు కూడా చెప్పొద్దు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

పిల్లను పెంచడం అనేది కూడా ఓ కళే. వారి చిన్నతనమే.. మంచి భవిష్యత్ కు పునాది. సో.. వారిని ఎంత చక్కగా చూసుకుంటూ.. కావాల్సిన విషయాలను నేర్పిస్తే..మంచిది. వారిని శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేస్తే చాలా ప్రమాదం. మాట వినట్లేదు కదా.. అని మీ బిడ్డను భయం, బెదిరింపులకు గురిచేయోద్దు. పిల్లలు సెన్సిటివ్‌గా ఉంటారు. వారి పట్ల మన ప్రవర్తన, భావోద్వేగాలను వారు అర్థం చేసుకుంటారు. మరీ రఫ్ గా వ్యవహరిస్తే.. వారి మనసుకు కలిగే గాయం దీర్ఘకాలం ఉంటుంది. కాబట్టి వారితో బాధ కలిగించే విషయాలు చెప్పడం మానేయండి.

పిల్లలను తల్లిదండ్రులు సరిగా చూసుకోవాలి. బాడీ షేమ్ చేయడంలాంటివి చేయోద్దు. వారి రూపాన్ని విమర్శించడం, వారి బట్టలు, జుట్టు లేదా సాధారణంగా వారు కనిపించే తీరుపై వ్యాఖ్యానించడం చాలా అవమానకరమని డాక్టర్స్ చెబుతున్నారు.

పిల్లలు కూడా సంక్లిష్టమైన భావోద్వేగాలను కలిగి ఉంటారు. వారిని కించపరిచే వ్యాఖ్యలు, మూర్ఖులు అనడం, నిరాశపరిచేవి, పనికిరావు అని చెప్పడం మానేయండి. వారి మనసుల్లో ఇలాంటి విషయాలు బలంగా నాటుకుపోతాయి.

చాలా సార్లు తల్లిదండ్రులు తమ బిడ్డను మరొకరితో పోల్చడం అలవాటు చేసుకుంటారు. తమ బిడ్డను బంధువుల పిల్లలు, పాఠశాలలోని పిల్లలతో పోల్చడానికి మొగ్గు చూపుతారు. ఇలాంటివి కూడా చేయోద్దు. మీకు తమ మీద ప్రేమ లేదని పిల్లలు అనుకునే ఛాన్స్ ఎక్కువగా ఉంది.

కోపం లేదా నిరాశతో పిల్లలను నిందించడం మానేయండి. నేను నీ కోసం చాలా త్యాగం చేశాను.., నువ్వు నా జీవితాన్ని కష్టతరం చేశావు.. లాంటి వ్యాఖ్యలు పిల్లలతో అనకండి. వారిని అపరాధ భావంలోకి నెట్టేస్తాయి. దేని మీద శ్రద్ధ పెట్టరు.

పిల్లల జీవితాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే విషయంలో తల్లిదండ్రులదే పైచేయి. అయితే ఆ నిర్ణయాలు సరిగా ఉండాలి. మీ బిడ్డ చేస్తాడు అనే నమ్మకాన్ని వాళ్లకు కలిగించాలి. దీన్ని చేయగలవా? ఇది చేయలేవు లాంటి కామెంట్స్ వారితో అనకూడదు. అది విద్య, ఆట, ఉద్యోగం కోసం కావచ్చు. ఏదైనా వారి కెరీర్ గ్రోత్ కు సంబంధించి.. కంట్రోల్ చేయోద్దు.

అనవసరమైన కామెంట్‌లు చిన్నపిల్లల జీవితాన్ని నాశనం చేస్తుంది. బాడీ షేమింగ్‌తో తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెప్పారు. అవి ఇతర వాటి మీద కూడా ప్రభావితం చూపిస్తాయి. సెల్ఫ్ రెస్పాక్ట్ లేనట్టుగా పిల్లలు ఫీలవడం, తినే రుగ్మతలు, ఆందోళన, డిప్రెషన్ లాంటి ఫేస్ చేస్తారు.

దీర్ఘకాలంలో వాటితో ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపకుండా, మంచి సంబంధాలను నిర్మించకుండా నిరోధించగలవని డాక్టర్స్ అంటున్నారు. తల్లిదండ్రులు ఉండే తీరుతో పిల్లలలో ఆత్మన్యూనత, స్వీయ-విమర్శలకు చేసుకోవడం ఎక్కువ అవ్వొచ్చు. ఇది జీవితకాలం కొనసాగుతుంది.

WhatsApp channel

సంబంధిత కథనం