Nikon Z 30 । నికాన్ నుంచి బేబీ కెమెరా.. తేలికైనది, మన్నికైనది, ధరకూడా తక్కువే!-nikon z 30 lightest camera launched at affordable price check features ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Nikon Z 30 Lightest Camera Launched At Affordable Price, Check Features

Nikon Z 30 । నికాన్ నుంచి బేబీ కెమెరా.. తేలికైనది, మన్నికైనది, ధరకూడా తక్కువే!

HT Telugu Desk HT Telugu
Jun 29, 2022 06:41 PM IST

నికాన్ నుంచి Nikon Z 30 అనే కెమెరా విడుదలైంది. ఇది అతి చిన్నది, తేలికైనది అలాగే మిర్రర్‌లెస్ కెమెరా. వ్లాగర్లకు, రీల్స్ చేయడానికి అనువుగా ఉంటుంది. దీని ధర కూడా తక్కువే.

Nikon Z 30
Nikon Z 30

Camera Day | ప్రముఖ కెమెరా మేకర్ నికాన్ తమ Z సిరీస్‌లో సరికొత్త కెమెరాను మార్కెట్లో విడుదల చేసింది. Nikon Z 30 పేరుతో విడుదలైన కెమెరా కంపెనీ నుంచి విడుదలైన అతిచిన్న, తేలికైన మిర్రర్‌లెస్ కెమెరా. దీని బరువు కేవలం 350 గ్రాములు మాత్రమే. ఇది Sony ZV-1 లాంటి కెమెరాతో పోటీ పడుతుంది.

నికాన్ కంపెనీ ఈ కెమెరాను ప్రత్యేకంగా వ్లాగర్‌లు, కంటెంట్ క్రియేటర్స్, స్మార్ట్‌ఫోన్ కెమెరాలో అప్‌గ్రేడర్‌లను ఆశించేవారికోసం రూపొందించింది. ఇటీవల చాలామంది యువత యూట్యూబ్ వ్లాగ్స్, ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్ అంటూ వీడియోలను రూపొందిస్తున్నారు. వారికి ఈ ఈ Nikon Z 30 కెమెరా ఉపయుక్తంగా ఉంటుంది. అయితే ఇది మిర్రర్‌లెస్ Nikon D3500 బిగినర్స్ కెమెరాకు రీప్లేస్‌మెంట్ మాత్రం కాదు.

Z 30 కెమెరాలో EN-EL25 రీయూజేబుల్ బ్యాటరీని ప్యాక్ ఇస్తున్నారు. ఒక్క ఫుల్ ఛార్జ్ మీద వినియోగదారులకు 125 నిమిషాల వరకు షూటింగ్ సమయం పొందవచ్చు. అలాగే స్లో-మోషన్ వీడియోల కోసం సెకనుకు 120 ఫ్రేమ్‌ల వరకు పూర్తి HD వీడియోలను కూడా షూట్ చేయవచ్చు. ఇది 35 నిమిషాల వరకు 4K UHD వీడియో రికార్డింగ్‌ను కూడా అందిస్తుంది. ఈ కెమెరాకు వ్యూఫైండర్ లేదు కానీ వ్యారీ-యాంగిల్ కలిగిన 3-అంగుళాల టచ్-సెన్సిటివ్ LCD ఉంది.

వ్లాగర్స్ కోసం ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయి?

Vlogging కోసం నికాన్ Z 30లో అంతర్నిర్మిత స్టీరియో మైక్రోఫోన్‌ను కలిగి ఉంది. కావాలనుకుంటే అదనపు మైక్రోఫోన్‌ను కూడా వినియోగదారులు అమర్చుకోవచ్చు. దృశ్యం కోసం పారామీటర్స్ అడ్జస్ట్ చేయటానికి వివిధ రకాల పిక్చర్ కంట్రోల్ ఫంక్షన్‌లను కలిగి ఉంది. మొత్తంగా ఈ కెమెరాలో 20 క్రియేటివ్ పిక్చర్ కంట్రోల్స్ ఉన్నాయి. ఇవి స్టాక్ ఫిల్టర్‌లుగా పని చేస్తాయి. కాబట్టి వీడియోను పోస్ట్-ప్రాసెస్ చేయవలసిన అవసరం ఉండదు. పింక్, మార్నింగ్, మెలాంచోలిక్, సండే మొదలైనవి ఇందులోని పాపులర్ పిక్చర్ కంట్రోల్ ఫిల్టర్స్.

ఈ కెమెరాలో 20MP APS-C సెన్సార్‌తో కూడిన ఐ-డిటెక్షన్ ఆటో ఫోకస్, ఫుల్-టైమ్ ఆటో ఫోకస్ (AF-F) వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఇవి మాత్రమే కాకుండా మాన్యువల్ ఫోకస్, సింగిల్ ఆటోఫోకస్, కంటిన్యూ ఆటోఫోకస్ ఫీచర్లను ఎంచుకోవచ్చు. ఈ ఫోకస్ మోడ్‌లకు అదనంగా Nikon యానిమల్-డిటెక్షన్ AF సపోర్ట్ కూడా ఉంది. తద్వారా జంతువుల ఫోటోలు లేదా వీడియోలను రికార్డ్ చేస్తున్నప్పుడు ఫోకస్ ఫ్రేమింగ్ కోసం వాటి కళ్ళను గుర్తిస్తుంది.

Nikon Z 30 కెమెరా జూలై 14 నుండి కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుంది. దీని ధర సుమారు రూ. 55 వేల నుంచి ప్రారంభమవుతుంది. మార్కెట్లోని ఇలాంటి ఇతర కెమెరాలో పోలిస్తే ఈ ధర చాలా తక్కువ అని చెప్పవచ్చు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్