Mutual funds | మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలంటే ఎలా?-how to start investing in mutual funds ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  How To Start Investing In Mutual Funds

Mutual funds | మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలంటే ఎలా?

Praveen Kumar Lenkala HT Telugu
Dec 28, 2021 04:38 PM IST

మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం చాలా సులువైన పని. కేవలం ఆన్‌లైన్‌లో ఈకేవైసీ పూర్తి చేయడం ద్వారా మీకు నచ్చిన ఫండ్‌లో పెట్టుబడి పెట్టొచ్చు. మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టేందుకు డాక్యుమెంట్లు కూడా పెద్దగా అవసరం లేదు. ఒకసారి కేవైసీ పూర్తిచేస్తే ఎన్ని ఫండ్స్‌లోనైనా మీరు పెట్టుబడి పెట్టొచ్చు.

ప్రతీకాత్మక చిత్రం: ఆన్‌లైన్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టొచ్చు
ప్రతీకాత్మక చిత్రం: ఆన్‌లైన్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టొచ్చు (unsplash)

Mutual funds | మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టడం కేవలం ఒక బ్యాంకు ఖాతా నిర్వహించినంత సులభమైన పని. ఆన్‌లైన్‌లో పెట్టుబడులు చేయడం ఇబ్బంది అనుకుంటే మ్యూచువల్‌ ఫండ్‌ డిస్ట్రిబ్యూటర్‌ గానీ, గుర్తింపు పొందిన ఫైనాన్షియల్‌ ప్లానర్‌ ద్వారా గానీ, స్టాక్‌ మార్కెట్‌ బ్రోకర్‌ ద్వారా గానీ చేయొచ్చు. 

మ్యూచువల్‌ ఫండ్స్‌పై అవగాహన ఉంటే మీరే ఆన్‌లైన్‌ ద్వారా నేరుగా చేసుకోవడం మంచిది. కనీసం రూ. 500 పెట్టుబడితో కూడా మ్యూచువల్‌ ఫండ్‌ ప్రారంభింవచ్చు. నెలవారీగా సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) పద్ధతిలో గానీ, ఏకమొత్తంలో గానీ పెట్టుబడి పెట్టొచ్చు. ట్రేడింగ్‌ అకౌంట్‌ ఉంటే దాని ద్వారా మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టొచ్చు.

ఏయే రకాల మ్యూచువల్‌ ఫండ్స్‌ ఉంటాయి?

మ్యూచువల్‌ ఫండ్స్‌లో విభిన్న రకాలు ఉన్నాయి. ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేసేవి, బాండ్లలో ఇన్వెస్ట్‌ చేసేవి, ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్‌ చేసే మ్యూచువల్‌ ఫండ్స్‌ ఉంటాయి. ఆయా ఫండ్స్‌ రకరకాల రిస్క్‌ సామర్థ్యాన్ని సూచిస్తాయి.

స్థూలంగా చెప్పాలంటే ఈక్విటీ అండ్‌ గ్రోత్‌ ఫండ్స్, ఇన్‌కమ్‌ లేదా బాండ్‌ లేదా ఫిక్స్డ్ ఇన్‌కమ్‌ ఫండ్స్‌, హైబ్రిడ్‌ ఫండ్స్‌ అని మూడు రకాలుగా ఉంటాయి. తిరిగి ఇందులో రకరకాల ఫండ్స్‌ ఉంటాయి.

ఈక్విటీ ఫండ్స్‌ను దీర్ఘకాలిక అవసరాల కోసం ఎంచుకోవాలి. రిస్క్‌ సామర్థ్యం ఎక్కువగా ఉన్నవారికి నప్పుతాయి. ఇందులో తిరిగి లార్జ్‌ క్యాప్‌ ఫండ్స్, మిడ్‌ క్యాప్‌ ఫండ్స్, స్మాల్‌ కాప్‌ ఫండ్స్, మల్టీక్యాప్‌ ఫండ్స్, సెక్టార్‌ ఫండ్స్, థీమాటిక్‌ ఫండ్స్‌ ఇలా రకరకాలుగా ఉంటాయి.

కొద్దికాలానికి డబ్బులు దాచుకోవాలనుకుంటే నష్టభయం తక్కువగా ఉండే లిక్విడ్‌ ఫండ్స్, బాలెన్స్‌డ్‌ ఫండ్స్‌ మేలు.

నెలవారీ ఆదాయం సమకూరాలనుకుంటే మంత్లీ ఇన్‌కమ్‌ ఫండ్‌ అనుకూలంగా ఉంటుంది. ఇక పెన్షన్‌ అవసరాలకు ప్రత్యేకంగా ఫండ్స్‌ ఉన్నాయి. అలాగే పన్ను మినహాయింపు కోసం ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ నప్పుతుంది.

ఫండ్‌ నిర్వహించే సంస్థను ఏఎంసీ అంటారు. దాని ట్రాక్‌ రికార్డును, ఫండ్‌ రాబడులను, అది ఏయే ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టిందో పోర్ట్‌ఫోలియోను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి.

ఏయే ఏఎంసీలు అందుబాటులో ఉన్నాయి?

దేశంలో అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ(ఏఎంసీ)లు చాలా ఉన్నాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మ్యూచువల్‌ ఫండ్, హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్, ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ మ్యూచువల్‌ ఫండ్, రిలయన్స్‌ మ్యూచువల్‌ ఫండ్, ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్, కోటక్‌ మహీంద్రా, యాక్సిస్, డీఎస్పీ మ్యూచువల్‌ ఫండ్, ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఇలా అనేక రకాల ఏఎంసీలు అందుబాటులో ఉన్నాయి. అన్నీ ఆన్‌లైన్‌లో సేవలు అందిస్తున్నాయి. నేరుగా ఆయా వెబ్‌సైట్లలోకి వెళ్లి మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టొచ్చు.

ట్రేడింగ్‌ అకౌంట్‌ ఉంటే ఒకేచోట అన్ని రకాల మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టొచ్చు. ఇలా అయితే అన్ని పెట్టుబడులు మీ డీమాట్‌ ఖాతాలో ప్రతిబింబిస్తాయి.

 

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్