Save More Money : ఈ టిప్స్ పాటిస్తే.. మీ దగ్గర డబ్బే డబ్బు-how to save money following these six lifestyle changes to save more money ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Save More Money : ఈ టిప్స్ పాటిస్తే.. మీ దగ్గర డబ్బే డబ్బు

Save More Money : ఈ టిప్స్ పాటిస్తే.. మీ దగ్గర డబ్బే డబ్బు

HT Telugu Desk HT Telugu
Apr 04, 2023 04:42 PM IST

Save More Money : ఈ కాలంలో డబ్బు సంపాదించడం కంటే.. డబ్బును ఆదా చేయడమే పెద్ద సమస్యగా మారింది. లేనిపోని వాటికి ఖర్చు చేస్తూ.. నెల చివరకు వచ్చేసరికి ఖాళీ జేబులతో మనీ కోసం.. స్నేహితులకు ఫోన్ చేస్తారు. అయితే కొన్ని టిప్స్ పాటిస్తే.. మీరు డబ్బులు సేవ్ చేసుకోవచ్చు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఒక్క విషయం గుర్తుచేసుకోండి. మీరు చివరిసారి కూర్చుని మీ ఖర్చులు, పొదుపులను ఎప్పుడు రాశారు? మీరు చివరిసారిగా నగదు తీసి, ఖర్చు చేసిన ప్రతి పైసాను ఎప్పుడు నోట్ చేసుకున్నారు? మీరు వంట చేసుకున్నారా? లేదా రెస్టారెంట్ నుండి ఆర్డర్ చేశారా? ఇవన్నీ ఎందుకు అంటే.. కష్టపడి సంపాదిస్తారు. కానీ.. ఆదా చేయడంలో ఫెయిల్ అవుతారు. డబ్బును ఎంత ఎక్కువగా ఆదా చేస్తే.. మీ జేబులో అంత డబ్బు ఉంటుంది. డబ్బు ఆదా చేయడంలో మీకు సహాయపడే కొన్ని ముఖ్యమైన అంశాలు ఇక్కడ ఉన్నాయి.

ఈ రోజుల్లో ప్రజలు ఇంట్లో వంట చేయడం కంటే రెస్టారెంట్ల నుండి ఆహారాన్ని ఆర్డర్ చేసేదే ఎక్కువగా ఉంది. మీ జేబుకు రెస్టారెంట్ బిల్లులు పెంచేస్తున్నారు. ఇది మీ ఆదాయంలో ఎక్కువ మొత్తం ఖర్చు చేయిస్తుంది. ఇంట్లో ఆహారాన్ని వండే సాధారణ అలవాటు చేసుకోండి. ఇది మీ ఆహార బడ్జెట్‌ను తగ్గించి, మీ భోజనాన్ని ఆరోగ్యకరమైనదిగా చేస్తుంది.

మీరు ఎక్కువగా ఖర్చు చేసే అలవాటును తగ్గించుకోగల మరో చిట్కా ఏంటంటే.. నగదును ఉపయోగించడం. నగదుకు బదులుగా క్రెడిట్ కార్డును ఉపయోగించినప్పుడు ప్రజలు ఎక్కువ ఖర్చు చేస్తారని పరిశోధకులు నిరూపించారు. మీరు డబ్బు ఆదా చేయాలని చూస్తున్నట్లయితే నగదుతో మాత్రమే కొనుగోళ్లు చేయడానికి ప్రయత్నించండి.

ఈరోజే బ్రాండ్ల వెనక పరుగెత్తడం ఆపేయండి. కొంతమంది బ్రాండ్స్ అంటూ.. తెగ డబ్బు ఖర్చు చేస్తారు. మీరు తెలివిగా ఎంచుకుని, ప్రాధాన్యతా జాబితాను సెట్ చేయాలి. ఎందుకంటే మీ బడ్జెట్‌లో బ్రాండ్లకు ఎక్కువ మనీ పోతే.. ఆదా చేయలేరు. బ్రాండ్‌కు బదులుగా సాధారణ ఉత్పత్తులకు తీసుకోండి. పెద్ద మొత్తంలో డబ్బు ఆదా చేసుకోవడాన్ని మీరే అలవాటు చేసుకోవాలి.

వారానికి ఒకసారి ఖర్చు లేని రోజును ట్రై చేయాలి. అంటే ఆరోజున మీరు ఒక్కరూపాయి కూడా ఖర్చు చేయకుండా బతకాలి. ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకూడదని మిమ్మల్ని మీరు సవాలు చేసుకోండి. ఇది మీరు తెలివిగా ఖర్చు చేసేవారిగా మారడానికి సహాయపడుతుంది. అద్దె, విద్యుత్, వైఫై ఛార్జీల గురించి ఆలోచించాల్సిన వ్యక్తులకు ఇది ప్రత్యేకంగా సహాయపడుతుంది.

మీరు మీ ఖర్చులను తప్పకుండా నోట్ చేయాలి. మీ మొత్తం ఖర్చుల రికార్డును నిర్వహించి, వాటిని విశ్లేషించండి. ఇది మరింత పొదుపు చేసే గ్యారెంటీ టెక్నిక్. ఎందుకంటే మీ వ్యయాన్ని ఎప్పుడూ చూసుకోవడం వలన మీరు బాధ్యతగా ఫీలవుతారు. అరే తెలియకుండానే ఇన్ని డబ్బులు ఖర్చవుతున్నాయనే ఆలోచన మీకు వస్తుంది. వ్యయాలను తగ్గించుకోవడంలో మీకు సహాయం చేస్తుంది.

WhatsApp channel

సంబంధిత కథనం