Sravana Masam Fasting: శ్రావణమాసంలో ఉపవాసం ఉండాలనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే-here is the tips for fasting and puja rituals on sravana masam monday fasting ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Here Is The Tips For Fasting And Puja Rituals On Sravana Masam Monday Fasting

Sravana Masam Fasting: శ్రావణమాసంలో ఉపవాసం ఉండాలనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే

Geddam Vijaya Madhuri HT Telugu
Jul 13, 2022 09:21 AM IST

Sravana Masam Fasting: కొన్ని రోజుల్లో శ్రావణమాసం వచ్చేస్తుంది. శ్రావణమాసంలో సోమవారం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆరోజు పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. అయితే శ్రావణమాసంలో పూజలు చేయడానికి ఎలాంటి పూజా సామాగ్రి కావాలి? ఏమి తినాలి.. ఏది తినకూడదో వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

శ్రావణమాసంలో ఉపవాసం
శ్రావణమాసంలో ఉపవాసం

Sravana Masam Fasting: ఆషాడం కొన్ని రోజుల్లో ముగిసిపోతుంది. శ్రావణమాసం మొదలుకానుంది. శ్రావణమాసంలో ప్రతి ఇల్లు ఓ ఆలయాన్ని తలపిస్తుంది. సోమవారం గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పైగా శ్రావణమాసంలో ప్రతిసోమవారం చాలామంది ఉపవాసం ఉంటారు. అయితే మీరు కూడా ఉపవాసం ఉండాలని ప్లాన్ చేస్తుంటే.. మీకు అవసరమైన పూజ సామాగ్రి.. ఆ సమయంలో మీరు తినవలసినవి ఏంటో.. తినకూడనివి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ పవిత్రమైన శ్రావణ మాసంలో ప్రతి సోమవారం శివుని భక్తులు ప్రత్యేకపూజలు చేస్తారు. ముఖ్యంగా పెళ్లి కాని అమ్మాయిలు తమ కోరికలను నెరవేర్చుకోవడానికి లేదా మంచి భర్త కోసం ఉపవాసం ఉంటారు. అయితే మీరు కూడా ఈ సారి ఉపవాసం ఉండాలనకుంటున్నారా? మీకు దానిగురించి తెలియకపోతే ఇక్కడ మీకు బోలెడు సమాచారం ఉంది.

శ్రావణమాసంలో పూజకు కావాల్సిన సామాగ్రి..

మీరు ఉపవాసం ఉన్న రోజున.. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని అన్ని భాగాలలో కొంత గంగాజలం చల్లాలి. నీళ్లు, పెరుగు, పాలు, పంచదార, నెయ్యి, తేనె, పంచామృతం, వస్త్రం, జానేయులు, చందనం, పచ్చి బియ్యం, పువ్వు, బేల్ పత్ర, భాంగ్, ధాతుర, కమల్ గట్ట వంటివి శివని పూజలో మీకు కావలసిన పూజా సామాగ్రి.

శ్రావణమాసంలో శివ పూజకు వీటికి నో ఎంట్రీ..

శివుడిని పూజించేటప్పుడు, పసుపు, కేత్కి పువ్వు, తులసి ఆకులను ఉపయోగించరు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఎందుకంటే తులసి ఆకులు చాలా పవిత్రమైనవి. వీటి ప్రతి పూజలోనూ ఉపయోగిస్తారు కానీ.. శివుని పూజలో మాత్రం ఉపయోగించరు. అలవాటులో పొరపాటుగా వాటిని తీసుకెళ్లకండి.

శ్రావణమాసంలో తినేవి.. తినకూడనివి..

పండ్లు, డ్రై ఫ్రూట్స్, నట్స్, బంగాళదుంప, బత్తాయి, పాలు, పనీర్, నెయ్యి వంటివి ఉపవాస సమయంలో తీసుకోవచ్చు. ఉపవాసంలో ఉండేవారు వెల్లుల్లి, ఉల్లిపాయలు, ఎర్రని కందిపప్పు, వంకాయలకు దూరంగా ఉండాలి అంటున్నారు పూజారులు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్