Drumstick Leaves Soup | మునగాకు సూప్‌తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
రోజూ మీ ఆహారంలో మునగాకును భాగం చేసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ మునగాకును ఆయుద్వేదంలోనూ ఎన్నో మందుల కోసం వాడతారు. వీటిలో విటమిన్స్, ఎమినో యాసిడ్స్, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి.
మునగ కాయలను వాడే వారు చాలా మందే ఉంటారు. కానీ ఆ కాయలతో సమానంగా ప్రయోజనాలను చేకూర్చే మునగాకులను మాత్రం చాలా మంది వాడటం లేదు. నిజానికి ఈ మునగాకుతో చాలా ప్రయోజనాలే ఉన్నాయి. మునగ ఆకు కాలేయంలో చేరిన విష పదార్థాలను బయటికి పంపిస్తుంది. ఇంకా మూత్రాశయంలో రాళ్లను కరిగిస్తుంది. మునగాకులో ఉండే రిబోఫ్లెవిన్ బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ ను రెగ్యులేట్ చేస్తుంది. దాంతో డయాబెటిస్ లక్షణాలను నివారిస్తుంది. మునగాకులతో సరైన పద్ధతిలో సూప్ చేసుకుంటే.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం లభిస్తుంది.
మునగాకు జ్యూస్ ఎలా?
మునగాకు జ్యూస్ కోసం మునగాకులతోపాటు జీలకర్ర, వెల్లుల్లి, ఉల్లిపాయలు, టమాట, నూనె, నీళ్లు అవసరం అవుతాయి. ముందుగా ఓ గిన్నెలో నూనె వేసి వేడి చేసిన తర్వాత అందులో జీలకర్ర, వెల్లుల్లి, ఉల్లిపాయలు, ఉప్పు వేసి మంచిగా వేయించాలి. కొంతసేపటి తర్వాత టమాటను కూడ వేయించి అది గుజ్జుగా మారిన తర్వాత అంతకుముందే బాగా కడిగి పెట్టిన మునగాకులను అందులో వేయాలి. తర్వాత కొన్ని నీళ్లు పోసి కాసేపు మరిగించాలి. చివరిగా మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర కూడా వేసుకుంటే మునగాకు జ్యూస్ రెడీ అవుతుంది. ఈ మునగాకు జ్యూస్ తో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
సంబంధిత కథనం
టాపిక్