Harley-Davidson Pan America 1250। ఏకంగా రూ. 4 లక్షల తగ్గింపు.. ఇప్పుడు ఈ బైక్‌పై ధర ఎంతో తెలుసా?-harleydavidson announces a massive rs 4 lakh price cut on pan america 1250 ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Harley-davidson Pan America 1250। ఏకంగా రూ. 4 లక్షల తగ్గింపు.. ఇప్పుడు ఈ బైక్‌పై ధర ఎంతో తెలుసా?

Harley-Davidson Pan America 1250। ఏకంగా రూ. 4 లక్షల తగ్గింపు.. ఇప్పుడు ఈ బైక్‌పై ధర ఎంతో తెలుసా?

HT Telugu Desk HT Telugu
Sep 12, 2022 04:22 PM IST

హార్లే-డేవిడ్‌సన్ గతేడాది భారత మాకెట్లో విడుదల చేసిన పాన్ అమెరికా 1250 శ్రేణి మోటార్‌సైకిళ్ల ధరలపై భారీ తగ్గింపును ప్రకటించింది. ఏకంగా రూ. 4 లక్షల డిస్కౌంట్ అందిస్తోంది. వివరాలు చూడండి.

Harley-Davidson Pan America 1250
Harley-Davidson Pan America 1250

లగ్లరీ మోటార్‌సైకిళ్ల తయారీదారు హార్లే-డేవిడ్‌సన్ భారత దేశంలో తమ 'MY-2021' పాన్ అమెరికా 1250 శ్రేణి మోటార్‌సైకిళ్ల ధరలను భారీగా తగ్గించింది. హార్లే-డేవిడ్‌సన్ నుంచి మొదటి అడ్వెంచర్ మోటార్‌సైకిల్ Harley-Davidson Pan America 1250 ఎక్స్-షోరూమ్ ధరపై ఏకంగా రూ. 4 లక్షల డిస్కౌంట్ ప్రకటించింది. ఈ భారీ తగ్గింపుతో హార్లే-డేవిడ్‌సన్ బ్రాండ్ నుంచి పలు మోటార్‌సైకిల్ మోడల్స్ ధరలు అమాంతం కిందకు దిగాయి. ఇవి ట్రయంఫ్, అలాగే బీఎండబ్ల్యూ కంటే తక్కువ ధరను పలుకుతున్నాయి.

హార్లే-డేవిడ్సన్ ప్రపంచంలోని పురాతన బైక్‌మేకర్‌లలో ఒకటి. ఈ బ్రాండ్ సుదూర ప్రయాణాల కోసం రూపొందించే క్రూయిజర్ మోటార్‌సైకిళ్లకు ప్రసిద్ధి చెందింది. ఈ క్రమంలో 'Pan America 1250' అనేది బ్రాండ్ నుండి మొట్టమొదటి అడ్వెంచర్ బైక్. ఇది భారతదేశంతో సహా వివిధ మార్కెట్లలో విజయవంతమైంది. ఇందులో రెండు వేరియంట్లు లిమిటెడ్ యూనిట్లలో అందుబాటులో ఉంటాయి.

భారత మార్కెట్లో హార్లే-డేవిడ్‌సన్ పాన్ అమెరికా 1250 స్టాండర్డ్ బైక్ పాత ధర, రూ. 16.90 లక్షలు కాగా, ఇప్పుడు తగ్గింపుతో రూ. 12.91 లక్షలకే లభిస్తుంది. అలాగే పాన్ అమెరికా 1250 స్పెషల్ పాత ధర రూ. 21.11 లక్షలు కాగా, ప్రస్తుతం తగ్గింపుతో దీని ధర రూ. 17.11 లక్షలుకు పడిపోయింది. ఇవి 2021 మోడల్స్, కేవలం పరిమిత యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

Harley-Davidson Pan America 1250 ఇంజన్ కెపాసిటీ

హార్లే-డేవిడ్‌సన్ పాన్ అమెరికా 1250లో 'రివల్యూషన్ మ్యాక్స్' 1252cc సామర్థ్యం కలిగిన లిక్విడ్-కూల్డ్, V-ట్విన్ ఇంజన్ ఉంటుంది. దీనిని 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేశారు. ఈ ఇంజన్ గరిష్టంగా 152hp శక్తిని అలాగే 128Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది

ఇంకా దీని ఇంజన్ డ్యూయల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ (DOHC), వేరియబుల్ వాల్వ్ టైమింగ్‌తో 4-వాల్వ్ హెడ్‌ని కలిగి ఉంది. ప్రత్యేక వేరియంట్‌లో అడాప్టివ్ లైట్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఆప్షనల్ అడాప్టివ్ రైడ్ హైట్ (ARH) సిస్టమ్ ఉన్నాయి. ఇది మీరు బైక్ నిలిపినపుడు సస్పెన్షన్‌ను 50 మిమీ వరకు తగ్గిస్తుంది.

మరిన్ని అంశాలను పరిశీలిస్తే.. ఈ మోటార్‌సైకిళ్లలో 21-లీటర్ ఇంధన ట్యాంక్, పొడవైన హ్యాండిల్‌బార్, కోణీయ అద్దాలు, నిటారుగా ఉండే విండ్‌స్క్రీన్, అప్‌స్వేప్ట్ ఎగ్జాస్ట్, విభజన కలిగిన సీట్లు, గ్రాబ్ రైల్స్, పెద్దని LED హెడ్‌ల్యాంప్ ఉన్నాయి, సొగసైన LED టైల్‌లైట్ ఉన్నాయి. బైక్‌లో బ్లూటూత్ కనెక్టివిటీ ద్వారా 6.8-అంగుళాల కలర్- ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ద్వారా కనెక్ట్ చేసుకొని మిగతా ఫీచర్లను పొందవచ్చు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్