BMW Motorrad । బీఎండబ్ల్యూ టూరింగ్ రేంజ్ బైక్‌లు.. దిమ్మతిరిగే ధరలు, మోడల్స్ ఇవే-bmw k 1600 grand america other touring range motorcycles launched in india ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Bmw K 1600 Grand America, Other Touring Range Motorcycles Launched In India

BMW Motorrad । బీఎండబ్ల్యూ టూరింగ్ రేంజ్ బైక్‌లు.. దిమ్మతిరిగే ధరలు, మోడల్స్ ఇవే

HT Telugu Desk HT Telugu
Aug 17, 2022 04:46 PM IST

బీఎండబ్ల్యూ (BMW Motorrad) నుంచి నాలుగు హైఎండ్ బైక్ మోడల్స్ భారత మార్కెట్లో విడుదలయ్యాయి. వీటి ధరలు రూ. 24 లక్షల నుంచి ప్రారంభమై, రూ. 33 లక్షల వరకు ఉన్నాయి. ఈ బైక్ లకు సంబంధించిన వివరాలు స్టోరీలో చదవండి.

BMW Touring Range Bikes
BMW Touring Range Bikes

లగ్జరీ మోటార్ సైకిల్ బ్రాండ్ అయిన BMW Motorrad తాజాగా భారత మార్కెట్లో ప్రీమియం ‘టూరింగ్ రేంజ్' మోటార్‌సైకిళ్లను విడుదల చేసింది. ఇదివరకే బుక్ చేసుకున్న వారికి ఈ నెల నుంచే డెలివరీలు ప్రారంభించనున్నారు. అదనంగా, దేశంలోని అన్ని అధికారిక డీలర్‌షిప్‌లలో ప్రత్యేకమైన యాక్సెసరీస్, ఇతర లైఫ్ స్టైల్ వస్తువులు అందుబాటులోకి వచ్చాయి.

BMW తాజాగా విడుదల చేసిన మోటార్ సైకిళ్లలో మొత్తం నాలుగు మోడళ్లు ఉన్నాయి. అవి..

BMW R 1250 RT, ధర రూ. 23.95 లక్షలు

BMW K 1600 Bagger, ధర రూ. 29.90 లక్షలు

BMW K 1600 GTL , రూ. 32 లక్షలు

BMW K 1600 గ్రాండ్ అమెరికా, ధర రూ. 33 లక్షలు

ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు అని గమనించాలి.

BMW R 1250 RT

బేసిక్ మోడల్ BMW R 1250 RT బైక్ విషయానికి వస్తే.. ఇది మునుపటికంటే మెరుగైన టూరింగ్ ఫీచర్లతో మరింత డైనమిక్‌గా కనిపిస్తుంది. BMW కొత్త ఫెయిరింగ్ ఇంకా పూర్తి-LED హెడ్‌ల్యాంప్‌లతో ఏరోడైనమిక్ డిజైన్ కలిగి ఉంది. ఈ బైక్‌లో BMW ShiftCam టెక్నాలజీతో కూడిన 1254 cc 2-సిలిండర్ బాక్సర్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ గరిష్టంగా 7,750 rpm వద్ద 134 bhp శక్తిని అలాగే 6,250 rpm వద్ద 143 Nm అత్యధిక టార్క్‌ను అందిస్తుంది. BMW R 1250 RT కేవలం 3.7 సెకన్లలోనే 0- 100 kmph స్పీడ్ అందుకోగలదు. దీని గరిష్టవేగం గంటకు 200 కిమీ.

మిగతా మూడు బైక్ మోడళ్లలో స్పెక్స్ ఇలా ఉన్నాయి

BMW K 1600 GTL, BMW K 1600 B అలాగే BMW K 1600 గ్రాండ్ అమెరికా బైక్ మోడళ్ల విషయానికి వస్తే, ఇవన్నీ 1649 cc 6-సిలిండర్ ఇన్-లైన్ ఇంజన్‌ను కలిగి ఉన్నాయి. ఈ ఇంజన్ 6,750 rpm వద్ద 158 bhp శక్తిని అలాగే 5,250 rpm వద్ద 180 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ బైక్ లలో డైనమిక్ ఇంజిన్ బ్రేక్ కంట్రోల్, డైనమిక్ ESA, ఆడియో సిస్టమ్ 2.0 , ఇంటిగ్రేటెడ్ మ్యాప్ నావిగేషన్‌తో కూడిన 10.25-అంగుళాల TFT కలర్ డిస్‌ప్లే బైక్‌లతో వంటి ముఖ్యమైన ఫీచర్లు ఉన్నాయి.

ఈ మోటార్‌సైకిళ్లు వివిధ రకాల ఆకర్షణీయమైన కలర్ స్కీములలో అందుబాటులో ఉన్నాయి.

కొనుగోలుకు ఆప్షన్స్, సర్వీస్

BMW ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్ ద్వారా ఈ టూరింగ్ శ్రేణి మోటార్‌సైకిళ్లను సొంతం చేసుకోవడానికి వివిధ స్కీములను అందిస్తుంది. బైక్‌లపై 3 సంవత్సరాల పాటు కంపనీ వారంటీ ఉచితంగా అందిస్తోంది. అదనపు ఖర్చుతో వారంటీని నాల్గవ, ఐదవ సంవత్సరానికి పొడిగించుకోవచ్చు. ఇంకా రోడ్ సైడ్ అసిస్టెన్స్, 24×7 365-రోజుల బ్రేక్‌డౌన్ ప్యాకేజీ , టోయింగ్ సర్వీసులు కూడా పొందవచ్చు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్