Chicken Mandi Biryani Recipe : చికెన్ మండి బిర్యానీ ఇష్టమా? అయితే ఇంట్లోనే రెడీ చేసేసుకోండిలా..-chicken mandi biryani you can try at home here is the recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chicken Mandi Biryani Recipe : చికెన్ మండి బిర్యానీ ఇష్టమా? అయితే ఇంట్లోనే రెడీ చేసేసుకోండిలా..

Chicken Mandi Biryani Recipe : చికెన్ మండి బిర్యానీ ఇష్టమా? అయితే ఇంట్లోనే రెడీ చేసేసుకోండిలా..

Geddam Vijaya Madhuri HT Telugu
Dec 24, 2022 12:30 PM IST

Chicken Mandi Biryani Recipe : అసలే ఇది పండుగల సీజన్. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి ఇలా వరుసగా వస్తాయి. ఈ సమయంలో ఇళ్లలో మంచి విందు రెడీ చేస్తారు. కొన్ని డిష్​లు ఇంట్లో కాకుండా బయట తినడానికే సిద్ధమవుతారు. వాటిలో మండి బిర్యానీ ఒకటి. అయితే దీనిని ఇంట్లోనే సింపుల్​గా, టేస్టీగా రెడీ చేసుకోవచ్చు.

చికెన్ మండి బిర్యానీ
చికెన్ మండి బిర్యానీ

Chicken Mandi Biryani Recipe : హైదరాబాద్ బిర్యానీ ఎంత ఫేమస్సో.. చికెన్ మండి బిర్యానీ కూడా అంతే ఫేమస్. అయితే దీనిని తయారు చేయడం చాలా కష్టం అనుకుంటారు. అందుకే బయటకు వెళ్లి తింటూ ఉంటారు. కానీ దీనిని ఇంట్లో కూడా చాలా టేస్టీగా, సింపుల్​గా తయారు చేసుకోవచ్చు. మరి దీనిని ఎలా రెడీ చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

* చికెన్ - 750 గ్రాములు (పెద్ద ముక్కలు)

* బాస్మతీ రైస్ - 4 కప్పులు

* ఉల్లిపాయలు - 1 కప్పు (తరిగినవి)

* అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు

* వెన్న - 4 టేబుల్ స్పూన్లు

* కుంకుమపువ్వు - కొంచెం

* బాదం - 1 టేబుల్ స్పూన్ (తరిగినవి)

* ఎండు ద్రాక్ష - 1 టేబుల్ స్పూన్

* జీడిపప్పులు - 1 టేబుల్ స్పూన్

* పచ్చిమిర్చి - 2 టేబుల్ స్పూన్లు

మండి మసాలా కోసం..

* ధనియాలు - 1 tsp

* జీలకర్ర - 1 tsp

* మిరియాలు - 1 tsp

* నల్ల ఏలకులు - 1

* ఆకుపచ్చ ఏలకులు - 10 -12

* లవంగాలు - 8 -10

* దాల్చిన చెక్కలు - 2 మీడియం సైజ్

* సోంపు - 1 tsp

* జాజికాయ - 1/4

* జాపత్రి - 2

చికెన్ మండి బిర్యానీ తయారీ విధానం

ముందు మొత్తం మసాలా దినుసులను పొడి చేసుకోండి. ఈ పొడి మండి మసాలాను ఓ గిన్నెలో తీసుకోండి. దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, కారం, కుంకుమపువ్వు నీరు, పచ్చిమిర్చి పేస్ట్ వేసి అన్నీ బాగా కలిసేలా కలపాలి. ఇప్పుడు కడిగిన చికెన్ తీసుకుని.. ఆ ముక్కలపై ఈ మసాలను అద్దండి. బాగా కలిపి.. పక్కన పెట్టేయండి. దీనిని కనీసం 30 నిమిషాలు నుంచి.. 4 గంటలు మెరినేట్ అవ్వనివ్వండి.

చికెన్ మెరినేట్ అయిన తర్వాత.. స్టవ్ వెలిగించి దానిపై పాన్‌ పెట్టండి. దానిలో నూనె వేసి.. వేడి అయిన తర్వాత.. మెరినేట్ చేసుకున్న చికెన్ ముక్కలను రెండు వైపులా 10-15 నిమిషాలు తక్కువ మంటలో వేయించండి. దీనిని ప్రారంభించే ముందు బియ్యాన్ని నానబెట్టండి. కనీసం అరగంట బియ్యం నీటిలో నానాలి. ఇప్పుడు పెద్ద పాన్ స్టవ్​పై పెట్టండి. దానిలో కాస్త వెన్న, నూనె, తరిగిన ఉల్లిపాయలను వేసి ఫ్రై చేయండి. అవి బంగారు గోధుమరంగు వచ్చే వరకు వేయించండి. దానిలో 1 టేబుల్ స్పూన్ మండి మసాలాను తీసుకుని దానిలో వేసి.. రెండు నిముషాలు వేయించండి. లీటరు నీరు పోసి.. చికెన్ స్టాక్ క్యూబ్స్ వేసి.. ఉడకనివ్వండి. ఇప్పుడు బియ్యం వేసి.. నీరు ఆవిరై.. బియ్యం ఉడకనివ్వాలి. అనంతరం కొత్తిమీర వేసి, ఇష్టం ఉంటే వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి.. దించేసుకోండి. అంతే టేస్టీ టేస్టీ మండీ చికెన్ బిర్యాని రెడీ.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్