Chanakya Niti : ఈ విషయాలతో ఎంత పెద్ద శత్రువునైనా సులభంగా ఓడించవచ్చు!
చాణక్యుడు గొప్ప తత్వవేత్త. చాణక్య నితిలో చెడు సమయాల్లో ఒకరికి సహాయపడే కొన్ని విషయాలను తెలిపాడు. జీవితంలో ప్రతి పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పాడు. చెడు పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు ఎలా సిద్ధం చేసుకోవాలో పేర్కొన్నాడు. శత్రువులు ఎంత పెద్ద వారైనా.. కొన్ని విషయాలను పాటిస్తే ఓడించొచ్చని వివరించాడు.
ట్రెండింగ్ వార్తలు
భయమే మనల్ని బలహీనపరుస్తుంది. పరిస్థితులు మనపై ఆధిపత్యం చెలాయిస్తాయి. భయపడే వ్యక్తి కంటే ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తి పరిస్థితిని అధిగమించగలడు. అతిగా భయపడే వారు ప్రమాదాల నుండి తమను తాము రక్షించుకోలేరు. పరిస్థితిని ఎదుర్కోవాలంటే, మొదట భయంతో పోరాడాలి. భయం మీ దగ్గరికి వచ్చినప్పుడు, యోధుడిలా దాడి చేసి చంపండి అని చాణక్యుడు చెప్పాడు.
మీ చెడు సమయానికి వైఫల్యమే కారణమని మీరు అనుకుంటే, కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి. చాలా మంది చెడు సమయాలను గడపవలసి వచ్చినప్పుడు, బాధ వారి హృదయాన్ని ఆక్రమిస్తుంది. వారిని నిరాశకు గురి చేస్తుంది. గతం లేదా భవిష్యత్తు గురించి ఆలోచించకుండా పరిస్థితిని ఎదుర్కోవడానికి తమ వంతు ప్రయత్నం చేయాలి. వర్తమానంలో జీవించాలి. సమయం అనుకూలంగా లేనప్పుడు ఓపిక పట్టి పరిస్థితిని అధిగమించేందుకు ప్రయత్నించాలి. చాణక్య నీతి చెప్పినట్లుగా, మీ గతం గురించి చింతించకండి.., మీ భవిష్యత్తు గురించి చింతించకండి.. మీ వర్తమానంలో బాగా జీవించండి.
మీ పరిస్థితికి మీ శత్రువులు కారణం కావచ్చు. మీ ప్రత్యర్థి ధైర్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించినట్లయితే మీరు సులభంగా ఓడించవచ్చు. ఆత్మవిశ్వాసం మనిషికి కావలసిన బలాన్ని ఇస్తుంది. ఎలాంటి పరిస్థితిలోనైనా.. సంతోషంగా ఉండండి. మీరు ఆత్మవిశ్వాసంతో ఉంటే.. శత్రువును బలహీనపరుస్తుంది. మిమ్మల్ని సంతోషంగా చూడలేని వారికి మీ నిరంతర సంతోషమే గొప్ప శిక్ష.
మిమ్మల్ని మీరు బలంగా కనిపించేలా చేయండి. ప్రత్యర్థి బలవంతుడు అయినప్పుడు అందరిలో భయం కలగడం సహజం. చాలా మంది హానికరమైన వ్యక్తులు తమ కంటే బలమైన వారికి దూరంగా ఉంటారు. వారు మొదట బలహీనులపై దాడి చేస్తారు. కాబట్టి, మీరు ఎల్లప్పుడూ మిమ్మల్ని మీరు బలమైన వ్యక్తిగా చిత్రీకరించుకోవాలి. మీరు బలవంతులు అని.. మీ శత్రువుకు తెలిస్తే.. మీ వైపు చూడరు.
సంబంధిత కథనం