Pudina Pulao Recipe : పుదీనా పులావ్.. లొట్టలేసుకుని తింటారు-breakfast recipes how to make pudina pulao recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Pudina Pulao Recipe : పుదీనా పులావ్.. లొట్టలేసుకుని తింటారు

Pudina Pulao Recipe : పుదీనా పులావ్.. లొట్టలేసుకుని తింటారు

HT Telugu Desk HT Telugu

Breakfast Recipes : పుదీనాకు ఆయుర్వేదంలో ప్రత్యేక స్థానం ఉంది. అనేక వ్యాధుల నుండి విముక్తి పొందడంలో పుదీనా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఆరోగ్యం, అందంతో పాటు వంటల్లో వేసుకోవడం వల్ల మంచి రుచి కూడా వస్తుంది. అయితే ఉదయం అల్పాహారంలోకి పుదీనా పులావ్ చేసుకోండి.

పుదీనా పులావ్

పుదీనాతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ లోకి పుదీనా పులావ్ చేయండి. టెస్టీగా ఉందని.. లొట్టలేసుకుని తింటారు. సాధారణంగా పుదీనాను వంటల్లో ఉపయోగిస్తారు. రుచితోపాటు ఆరోగ్య ప్రయోజనాలూ ఉన్నాయి. పుదీనాతో రుచిగా ఉండే పులావ్ చేసుకోవచ్చు. సులభంగా తయారుచేసుకోవచ్చు.

కావాల్సిన పదార్థాలు

బాస్మతి బియ్యం(ఉడికించినవి)-100 గ్రా., పుదీనా పేస్ట్-50 గ్రా., నూనె-2 టేబుల్ స్పూన్స్, నెయ్యి-ఒక టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క-ఒక చిన్న ముక్క, బిర్యానీ ఆకు-1, ల‌వంగాలు-5,యాల‌కులు-4, సాజీరా-ఒక టీ స్పూన్, త‌రిగిన ఉల్లిపాయ-1, ప‌చ్చిమిర్చి తరిగినవి-3, గ‌రం మ‌సాలా-ఒక టీ స్పూన్, ఉప్పు-త‌గినంత‌, అల్లం వెల్లుల్లి పేస్ట్-ఒక టేబుల్ స్పూన్, పుదీనా ఆకులు-గుప్పెడు, నిమ్మర‌సం-ఒక టేబుల్ స్పూన్, ఫ్రై చేసిన ఆనియ‌న్స్-2 టేబుల్ స్పూన్స్.

ఎలా తయారు చేయాలంటే..

ముందుగా కళాయిలో నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. ఆ తర్వాత దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, సాజీరా వేయించాలి. అనంతరం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలను రంగు మారే.. వరకు వేయించాలి. తర్వాత గరం మసాల, ఉప్పు వేయాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి.. పచ్చి వాసన పోయే వరకూ వేయించుకోవాలి. ఇప్పుడు పుదీనా పేస్ట్ వేసి.. నూనె పైకి తేలే వరకూ కలపాలి. ఆ తర్వాత పుదీనా ఆకుల‌ను వేసి క‌ల‌పాలి. అందులో ఉడికించిన బాస్మతి అన్నాన్ని వేసి క‌ల‌పాలి.

తర్వాత.. కొన్ని పుదీనా ఆకులను, ఫ్రైడ్ ఉల్లిగడ్డలు వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత స్టౌవ్ ఆఫ్ చేయాలి. రుచి పుల్లగా కావాలి అనుకునేవారు.. నిమ్మరసాన్ని వేసుకోవచ్చు. ఇప్పుడు ఎంతో రుచిగా ఉండే పుదీనా పులావ్ రెడీ అయిపోయింది. దీనిలో రైతా కలిపి.. తింటే చాలా టెస్టీగా ఉంటుంది.

సంబంధిత కథనం