Winter Tips | వింటర్‌ సీజన్‌లో హెల్తీగా ఉండేందుకు 8 టిప్స్-8 tips to stay healthy in winter season ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  8 Tips To Stay Healthy In Winter Season

Winter Tips | వింటర్‌ సీజన్‌లో హెల్తీగా ఉండేందుకు 8 టిప్స్

Praveen Kumar Lenkala HT Telugu
Feb 02, 2022 05:52 PM IST

వింటర్‌ సీజన్‌లో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంది. సాధారణ జలుబు, తలనొప్పి, తల తిమ్మిర్లు, న్యుమోనియా, చర్మం పొడిబారడం, ఫ్లూ వంటి సమస్యలు ఎదురయ్యేందుకు ఆస్కారం ఉంది.

ప్రతీకాత్మక చిత్రం: శీతాకాలంలో వాతావరణం
ప్రతీకాత్మక చిత్రం: శీతాకాలంలో వాతావరణం (unsplash)

Winter Tips.. వింటర్‌ సీజన్‌లో చల్లని వాతావరణం నుంచి, చల్లగాలుల నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముందుగా వింటర్‌లో వచ్చే అనారోగ్య సమస్యల గురించి తెలుసుకుందాం.

చర్మం పొడిబారడం..

వింటర్‌ మొదలైందంటే చాలు చర్మం పొడిబారడం మొదలవుతుంది. పెదాలు కూడా పగులుతుంటాయి. వింటర్‌లో సాధారణంగా అందరూ ఎదుర్కొనే సమస్యే ఇది. ఈ సమయంలో చలిని తట్టుకునేందుకు బాగా వేడి నీటితో స్నానం చేస్తుంటారు కొందరు. కానీ ఇది సమస్యను మరింత తీవ్రం చేస్తుంది. 

ఇలా చేస్తే దురద పుడుతుంది. అందువల్ల బాగా వేడి నీటితో కాకుండా గోరు వెచ్చని నీటితో మాత్రమే స్నానం చేయాలి. మీ స్కిన్‌ పొడిబారకుండా మాయిశ్చరైజర్‌ ఉపయోగించాలి. కోల్డ్‌ క్రీమ్, పెట్రోలియం జెల్లీ రూపంలో వింటర్‌ క్రీమ్‌లు చాలా దొరుకుతాయి.

జలుబు, దగ్గు..

వింటర్‌లో సాధారణంగా ఎదురయ్యే సమస్యలు కోల్డ్, తలనొప్పి. ముందుగా జలుబు చేసి తరువాత తలనొప్పి, గొంతునొప్పికి కూడా దారితీస్తుంది. మ్యూకస్‌ పోగై ముక్కు బ్లాక్‌ అవుతుంది. సైనస్‌ ఇన్ఫెక్షన్‌ ఉంటే సమస్య మరింత తీవ్రమవుతుంది.

అందువల్ల ముందుజాగ్రత్తగా వింటర్‌లో మీ చెవులకు, ముక్కుకు చల్లగాలి సోకకుండా తగిన వస్త్రధారణ ఉండాలి. అలాగే వేడి నీటితో స్టీమ్‌ చేయడం, వేడి నీటిని పుక్కిలించడం వంటివి చేయాలి. చలిలో బయటకు వెళ్లాల్సి వస్తే చలి గాలి తాకకుండా చెవులు, ముక్కు కవర్ చేసుకోవడం మరవొద్దు.

ఫ్లూ జ్వరం..

చలికాలంలో ఎక్కువ మంది ఫ్లూ జ్వరం బారిన పడుతుంటారు. బ్యాక్టీరియా మీ ఆరోగ్యాన్ని దెబ్బతీయకుండా ఉండాలంటే తరచుగా చేతులు శుభ్రపరుచుకోవాలి. ముఖ్యంగా తినేముందు హ్యాండ్‌ వాష్‌ చేసుకోవడం మరవొద్దు. మీ చెవులకు చలి గాలి సోకకుండా చూసుకోవాలి. అలాగే అరికాళ్లు చలి బారిన పడకుండా సాక్స్‌ ధరించాలి.

న్యుమోనియా..

న్యుమోనియాలో ముందుగా కనిపించే లక్షణాలు జలుబు, దగ్గు. ఆ తరువాత క్రమంగా ఇన్ఫెక్షన్‌ పెరిగితే దగ్గు, ఆయాసం తీవ్రమవుతుంది. బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్‌ అయినందున శరీరంపై అనేక రకాలుగా ప్రభావం చూపిస్తుంది. యాంటీబయోటిక్స్‌తో కొందరికి ఇంటి వద్దే నయమైపోయినా మరికొందరికి ఆసుపత్రిలో చికిత్స అవసరం అవుతుంది. తీవ్రతను బట్టి ఆసుపత్రిలో చేరాల్సి వస్తుంది.

వింటర్‌ సీజన్‌ 8 టిప్స్

1. వేడిగా ఉన్న నీటితో స్నానం వద్దు.

2. చర్మానికి మాయిశ్చరైజర్‌ వాడాలి.

3. చేతులు తరచుగా శుభ్రపరచుకోవాలి.

4. చలిని తట్టుకునేలా దుస్తులు ధరించాలి.

5. చల్లని నీటిని తాగకూడదు.

6. సమతుల ఆహారం (బ్యాలెన్స్‌డ్‌ డైట్‌) తీసుకోవాలి.

7. వ్యాయామాన్ని కొనసాగించాలి.

8. పొగ తాగడం మానేయాలి. చలికాలమే కాకుండా శాశ్వతంగా మానేస్తే మేలు.

 

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్