Thalapathy Vijay Varasudu Release Date: సంక్రాంతికి వస్తున్న విజయ్‌ ‘వారసుడు’-thalapathy vijay varasudu release date announced as the movie to release on pongal ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Thalapathy Vijay Varasudu Release Date: సంక్రాంతికి వస్తున్న విజయ్‌ ‘వారసుడు’

Thalapathy Vijay Varasudu Release Date: సంక్రాంతికి వస్తున్న విజయ్‌ ‘వారసుడు’

HT Telugu Desk HT Telugu

Thalapathy Vijay Varasudu Release Date: వచ్చే సంక్రాంతికి వారసుడిగా వస్తున్నాడు దళపతి విజయ్‌. ఈ మూవీ రిలీజ్ గురించి శనివారం (సెప్టెంబర్‌ 24) మేకర్స్‌ బిగ్‌ అప్‌డేట్‌ ఇచ్చారు.

వారసుడు మూవీలో విజయ్ (Twitter)

Thalapathy Vijay Varasudu Release Date: దళపతి విజయ్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌. టాలీవుడ్‌ డైరెక్టర్‌ వంశీ పైడిపల్లి డైరెక్ట్‌ చేస్తున్న వారసుడు మూవీ రిలీజ్‌కు సంబంధించి మేకర్స్‌ బిగ్‌ అప్‌డేట్‌ ఇచ్చారు. శనివారం (సెప్టెంబర్‌ 24) ఈ మూవీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ తన అధికారిక ట్విటర్‌లో మూవీ షూటింగ్‌, రిలీజ్‌కు సంబంధించి కీలకమైన విషయాలను చెప్పింది.

తెలుగు, తమిళంలో ఈ మూవీ రానున్న విషయం తెలిసిందే. తెలుగులో వారసుడుగా, తమిళంలో వారిసుగా రిలీజ్‌ చేస్తున్నారు. వచ్చే సంక్రాంతికి ఈ మూవీని రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ అనౌన్స్‌ చేశారు. "వారిసు చివరి షెడ్యూల్‌ రేపటి నుంచి ప్రారంభం కాబోతోంది. మరో రెండు పాటలు, రెండు యాక్షన్‌ సీక్వెన్స్‌ తీస్తే షూటింగ్‌ పూర్తవుతుంది. వారిసు పొంగల్‌ 2023కు సిద్ధంగా ఉండండి" అంటూ ఈ ట్వీట్‌ చేశారు.

ఈ అనౌన్స్‌మెంట్‌తో సంక్రాంతి బరిలో మరో పెద్ద సినిమా రావడం ఖాయమైంది. వారసుడు మూవీ షూటింగ్‌ మొదటి నుంచి శరవేగంగా జరుగుతోంది. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు కనిపిస్తూనే ఉన్నాయి. ఈ మూవీలో విజయ్ సరసన రష్మిక మందన్నా నటిస్తున్న విషయం తెలిసిందే. వంశీ పైడిపల్లితో విజయ్‌ తీస్తున్న తొలి సినిమా ఇదే.

తమన్‌ మ్యూజిక్‌ అందిస్తున్నాడు. అయితే మూవీని తమిళంలోనూ చిత్రీకరిస్తున్నారు. తెలుగులో డబ్‌ చేయనున్నారు. ఇప్పటికే వారసుడు ఫస్ట్ లుక్‌ రిలీజైంది. విజయ్‌ 48వ పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ ఈ మూవీని తెరకెక్కిస్తోంది. విజయ్‌కు ఇది 66వ సినిమా. ఈ మధ్య కాలంలో విజయ్ సినిమాలేవీ సంక్రాంతికి రిలీజ్‌ కాలేదు. ఇప్పుడీ అనౌన్స్‌మెంట్‌తో అతని ఫ్యాన్స్‌కు ముందే పండగ వచ్చేసింది.