Vaarasudu First Look:దళపతి విజయ్‌, వంశీ పైడిపల్లి 'వారసుడు' ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌-thalapathy vijay and vamsi paidipally movie vaarasudu first look released ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Thalapathy Vijay And Vamsi Paidipally Movie Vaarasudu First Look Released

Vaarasudu First Look:దళపతి విజయ్‌, వంశీ పైడిపల్లి 'వారసుడు' ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌

Hari Prasad S HT Telugu
Jun 21, 2022 09:50 PM IST

దళపతి విజయ్‌ నటిస్తున్న తొలి స్ట్రెయిట్‌ తెలుగు ఫిల్మ్‌ వారసుడు. అతని 66వ మూవీకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ ఫస్ట్‌ లుక్‌ రిలీజైంది.

వారసుడు మూవీలో విజయ్
వారసుడు మూవీలో విజయ్ (Twitter)

నేషనల్ అవార్డ్‌ విన్నింగ్ డైరెక్టర్‌ వంశీ పైడిపల్లి, తమిళ సూపర్‌ స్టార్‌ దళపతి విజయ్‌లాంటి క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ ఫ్యాన్స్‌లో ఎంతగానో ఆసక్తి రేపుతోంది. ఈ ప్రాజెక్ట్‌ అనౌన్స్‌ చేసినప్పటి నుంచీ దీనికి సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ గురించి ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇందులో విజయ్‌ సరసన టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్లలో ఒకరైన రష్మికా మందన్నా యాక్ట్‌ చేస్తుండటం విశేషం.

ఈ మూవీ ఇప్పటికే రెండు షెడ్యూళ్లను పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు విజయ్‌ బర్త్‌డేకు ముందు రోజు ఈ మూవీ ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేశారు. ఈ మూవీకి వారసుడు అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. ఇందులో విజయ్‌ స్టన్నింగ్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు. త్రీ పీస్‌ గ్రే సూట్‌లో విజయ్‌ బాస్‌ లుక్‌లో అదరగొట్టాడు. వారసుడు మూవీ ద బాస్‌ రిటర్న్స్‌ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తోంది.

దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమా తన గత షెడ్యూల్‌లో విజయ్‌, రష్మికలపై కీలక సీన్లను చిత్రీకరించింది. ఈ మూవీలో ప్రభు, శరత్‌ కుమార్‌, ప్రకాశ్‌ రాజ్‌, జయసుధ, శ్రీకాంత్‌, సంగీతలాంటి భారీ తారాగణం నటిస్తున్నారు. ఈ సినిమాకు డైరెక్టర్‌ వంశీ పైడిపల్లే కథ కూడా రాశాడు. ఇది భారీ బడ్జెట్‌తో వస్తున్న సినిమా. థమన్‌ మ్యూజిక్‌ అందిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా రిలీజ్‌ చేయనున్నారు.

<p>వారసుడు ఫస్ట్ లుక్</p>
వారసుడు ఫస్ట్ లుక్
IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్