Naatu Naatu Song - Tesla Car Owners: నాటు నాటు క్రేజ్ - టెస్లా కార్ ఓనర్స్ సెలబ్రేషన్స్ వీడియో వైరల్
Naatu Naatu Song - Tesla Car Owners: ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట వరల్డ్ వైడ్‌గా మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. ఇటీవలే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఈ పాట ఆస్కార్‌ను సొంతం చేసుకున్నది. ఈ సాంగ్ ఆస్కార్ గెలిచిన సందర్భాన్ని అమెరికాలోని టెస్లా కార్ ఓనర్స్ డిఫరెంట్‌గా సెలబ్రేట్ చేశారు.
Naatu Naatu Song - Tesla Car Owners: ప్రస్తుతం భాషాభేదాలకు అతీతంగా వరల్డ్ వైడ్‌గా ఎక్కడ చూసిన నాటు నాటు క్రేజ్ కనిపిస్తోంది. ఫారినర్స్ సైతం ఈ పాటకు స్టెప్పులు వేస్తూ అలరిస్తోన్నారు. ఇటీవలే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఈ పాట ఆస్కార్‌ను సొంతం చేసుకున్నది. ప్రతిష్టాత్మక ఆస్కార్ పురస్కారాన్ని దక్కించుకున్న తొలి ఇండియన్ సాంగ్‌గా నాటు నాటు చరిత్రలో నిలిచిపోయింది.
ట్రెండింగ్ వార్తలు
ఆస్కార్ వేడుకలో సింగర్స్ కాలభైరవ, రాహుల్ సింప్లిగంజ్ ఈ పాటను లైవ్‌లో ఆలపించగా ఫారిన్ డ్యాన్సర్స్ స్టెప్పులేసి ఆదరగొట్టారు. నాటు నాటు పాట ఆస్కార్ గెలుచుకోవడం పట్ల వరల్డ్ వైడ్‌గా ఫ్యాన్స్ ఒక్కొక్కొరు ఒక్కోలా సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అమెరికాలోని టెస్లా కార్ ఓనర్స్ సెలబ్రేషన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
నాటు నాటు పాట మ్యూజిక్ బీట్స్‌కు పార్కింగ్ ఏరియాలో ఉన్న వందలాది టెస్లా కార్ హెడ్ లైట్స్, టెయిల్ లైట్స్ ఆన్ ఆఫ్ అవుతూ ఈ వీడియోలో కనిపిస్తున్నాయి. టెస్లా కార్లలో ఉండే లైట్‌షో అనే ఫీచర్‌ను ఉపయోగించి చేసిన ఈ వీడియో ఆర్ఆర్ఆర్ అభిమానులను ఆకట్టుకుంటోంది.
ఈ వీడియోను ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ వీడియోకు మిలియన్లలో వ్యూస్ లభిస్తోన్నాయి. కాగా ఆర్ఆర్ఆర్ సినిమా గత ఏడాది మార్చిలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. 1200 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టి ఇండియాలోనే అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.