Telugu Programs TRP Ratings: టాప్ టీఆర్పీ రేటింగ్ ఉన్న తెలుగు ప్రోగ్రామ్స్ ఇవే.. ఈటీవీ, స్టార్ మా హవా-telugu programs latest trp ratings revealed as etv and star maa ahead ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Telugu Programs Latest Trp Ratings Revealed As Etv And Star Maa Ahead

Telugu Programs TRP Ratings: టాప్ టీఆర్పీ రేటింగ్ ఉన్న తెలుగు ప్రోగ్రామ్స్ ఇవే.. ఈటీవీ, స్టార్ మా హవా

Hari Prasad S HT Telugu
May 01, 2023 07:12 PM IST

Telugu Programs TRP Ratings: టాప్ టీఆర్పీ రేటింగ్ ఉన్న తెలుగు ప్రోగ్రామ్స్ లిస్ట్ వచ్చేసింది. ఇందులో ఈటీవీ, స్టార్ మా హవా కొనసాగించాయి. టాప్ 10లో ఉన్న ఆ ప్రోగ్రామ్స్ ఏంటో మీరూ చూడండి.

ఈటీవీలో వచ్చే శ్రీదేవి డ్రామా కంపెనీ
ఈటీవీలో వచ్చే శ్రీదేవి డ్రామా కంపెనీ (mallemala tv twitter)

Telugu Programs TRP Ratings: తెలుగు ఛానెల్స్ లో టెలికాస్ట్ అవుతున్న టాప్ ప్రోగ్రామ్స్ ఏవో తెలుసా? ఈటీవీతోపాటు స్టార్ మా, జీ తెలుగు, జెమినిలాంటి వాటిలో ప్రేక్షకులను అలరిస్తున్న ఎన్నో ప్రోగ్రామ్స్, రియాల్టీ షోలు వస్తున్నాయి. తాజాగా ఈ ప్రోగ్రామ్స్ కు సంబంధించిన టీఆర్పీ రేటింగ్స్ కూడా రిలీజయ్యాయి. ఏప్రిల్ 14వ తేదీ వరకు వచ్చిన రేటింగ్స్ ఇవి.

టీవీ సీరియల్స్ లో స్టార్ మా, జీ తెలుగు వంటి ఛానెల్స్ సత్తా చాటుతుండగా.. ప్రోగ్రామ్స్ విషయానికి వచ్చే సరికి ఈటీవీ ముందుంటోంది. టాప్ ప్రోగ్రామ్ తోపాటు టాప్ 10లో ఏడు ఈటీవీకి చెందిన ప్రోగ్రామ్సే ఉండటం విశేషం. ఇక మిగిలిన వాటిలో రెండు స్టార్ మా, మరొకటి జీ తెలుగులో వచ్చే ప్రోగ్రామ్స్. అధికారిక బార్క్ (BARC) ఇండియా వెబ్‌సైట్ రిలీజ్ చేసిన రేటింగ్స్ ఇవి.

టాప్ 10 ప్రోగ్రామ్స్ ఇవీ

1. శ్రీదేవీ డ్రామా కంపెనీ (4.44 టీఆర్పీ) - ఈటీవీ

2. సిక్త్స్ సెన్స్ (4.40 టీఆర్పీ) - స్టార్ మా

3. ఆదివారం విత్ స్టార్ మా పరివారం (3.64 టీఆర్పీ) - స్టార్ మా

4. జబర్దస్త్ (2.52 టీఆర్పీ) - ఈటీవీ

5. ఎక్స్‌ట్రా జబర్దస్త్ (2.41 టీఆర్పీ) - ఈటీవీ

6. సరిగమప ఛాంపియన్‌షిప్ (1.92 టీఆర్పీ) - జీ తెలుగు

7. ఢీ 15 (1.85) - ఈటీవీ

8. సుమా అడ్డా (1.62) - ఈటీవీ

9. అలా మొదలైంది (1.35) - ఈటీవీ

10. పాడుతా తీయగా (1.30) - ఈటీవీ

IPL_Entry_Point

సంబంధిత కథనం