Sharwanand Reception: రేపే శర్వానంద్ రిసెప్షన్.. సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించిన యంగ్ హీరో
Sharwanand Wedding Reception: హీరో శర్వానంద్ పెళ్లి రిసెప్షన్ రేపు (జూన్ 9) జరగనుంది. ఈ వేడుకకు సీఎం కేసీఆర్‌ను శర్వా ఆహ్వానించాడు.
Sharwanand Wedding Reception: యువ హీరో శర్వానంద్ పెళ్లి రిసెప్షన్ వేడుక రేపు (జూన్ 9) జరగనుంది. హైదరాబాద్‍లోని ఎన్ కన్వెన్షన్‍లో శర్వానంద్, రక్షితా రెడ్డి వివాహ రిసెప్షన్ రేపు సాయంత్రం 7.30 గంటల నుంచి ఘనంగా జరగనుంది. ఈ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను శర్వానంద్ ఆహ్వానించాడు. కేసీఆర్‌ను స్వయంగా కలిసి రిసెప్షన్ ఇన్విటేషన్ అందించాడు శర్వా. హీరో శర్వానంద్, రక్షితా రెడ్డి వివాహం ఈ నెల 3వ తేదీన రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌లోని లీలా ప్యాలెస్‍లో వైభవంగా జరిగింది. ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల మధ్య ఈ పెళ్లి వేడుక జరిగింది. స్టార్ హీరో, శర్వా క్లోజ్ ఫ్రెండ్ రామ్ చరణ్ కూడా వివాహానికి హాజరయ్యాడు. కాగా, రేపు జరిగే రిసెప్షన్‍కు అతిథులు భారీ సంఖ్యలో హాజరవుతారని తెలుస్తోంది.
ట్రెండింగ్ వార్తలు
శర్వానంద్, రక్షితా రెడ్డి వివాహ వేడుకలు లీలా ప్యాలెస్‍లో రెండు రోజుల పాటు ఘనంగా జరిగాయి. జూన్ 2న హల్దీ, సంగీత్ సంబరాలు ఫుల్ జోష్‍తో జరిగాయి. సంగీత్‍లో స్వయంగా శర్వానంద్ స్టెప్పులేశాడు. పూనకాలు లోడింగ్ పాటకు చిందేశాడు. చాలా ఉత్సాహంగా సంగీత్ వేడుక జరిగింది. ఆ తర్వాత జూన్ 3వ తేదీ రాత్రి శర్వా - రక్షిత విహహంతో ఒక్కటయ్యారు.
శర్వానంద్ పెళ్లికి స్టార్ హీరో రామ్ చరణ్ హాజరయ్యాడు. హీరో సిద్ధార్థ్, నటి అతిథిరావ్ హైదరీ, యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రముఖ నిర్మాత దిల్‍రాజు కుటుంబ సభ్యులు కూడా వివాహానికి వెళ్లారు. ఇక వధూవరుల కుటుంబాల పెద్దలు, మరికొందరు సన్నిహితుల సమక్షంలో శర్వా పెళ్లి వైభవోపేతంగా జరిగింది. శర్వానంద్ పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
సినిమాల విషయానికి వస్తే, శర్వానంద్ ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన హృదయం సినిమాకు సంగీతం ఇచ్చిన హేషమ్ అబ్దుల్ వాహబ్ ఈ మూవీకి సంగీత దర్శకుడిగా ఉన్నాడు. కాగా, పెళ్లి కోసం కొన్ని రోజుల నుంచి షూటింగ్‍కు బ్రేక్ తీసుకున్నాడు శర్వా.
సంబంధిత కథనం