RRR in Biggest IMAX of the World: ప్రపంచంలోనే అతిపెద్ద ఐమ్యాక్స్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ చూడనున్న రాజమౌళి, ఎన్టీఆర్‌, చరణ్-rrr in biggest imax of the world as rajamouli ram charan and jr ntr to attend ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Rrr In Biggest Imax Of The World As Rajamouli Ram Charan And Jr Ntr To Attend

RRR in Biggest IMAX of the World: ప్రపంచంలోనే అతిపెద్ద ఐమ్యాక్స్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ చూడనున్న రాజమౌళి, ఎన్టీఆర్‌, చరణ్

Hari Prasad S HT Telugu
Jan 02, 2023 08:15 AM IST

RRR in Biggest IMAX of the World: ప్రపంచంలోనే అతిపెద్ద ఐమ్యాక్స్‌ స్క్రీన్‌పై ఆర్‌ఆర్‌ఆర్‌ చూడనున్నారు రాజమౌళి, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌. ఈ మూవీలోని నాటు నాటు సాంగ్‌ ఆస్కార్స్‌కు షార్ట్‌లిస్ట్ అయిన క్రమంలో ఈ వార్త ఆసక్తి రేపుతోంది.

రామ్ చరణ్, రాజమౌళి, ఎన్టీఆర్
రామ్ చరణ్, రాజమౌళి, ఎన్టీఆర్ (twitter)

RRR in Biggest IMAX of the World: ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ గతేడాది మార్చి 25న రిలీజ్‌ అయింది. మరో రెండున్నర నెలలు అయితే ఈ మూవీ రిలీజై ఏడాది పూర్తవుతుంది. అయినా ఆర్ఆర్‌ఆర్‌ బజ్‌ ఏమాత్రం తగ్గడం లేదు. తరచూ ఏదో ఒక విశేషంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా ప్రపంచంలోనే అతి పెద్ద ఐమ్యాక్స్‌ స్క్రీన్‌పై ఈ సినిమా రిలీజ్‌ కాబోతుందన్న వార్త ఆసక్తి రేపుతోంది.

అంతేకాదు ఈ స్పెషల్‌ స్క్రీనింగ్‌కు డైరెక్టర్‌ రాజమౌళి, మూవీలోని స్టార్లు రామ్‌చరణ్, జూనియర్‌ ఎన్టీఆర్‌తోపాటు మ్యూజిక్‌ డైరెక్టర్‌ కీరవాణి హాజరు కానున్నట్లు తెలుస్తోంది. అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌లో ఉన్న టీఎల్‌సీ చైనీస్‌ థియేటర్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ స్పెషల్‌ స్క్రీనింగ్‌ జరగనుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఐమ్యాక్స్‌ స్క్రీన్‌ కావడం విశేషం.

ఇప్పటికే అమెరికాలో ఆర్ఆర్‌ఆర్‌ ఎన్నో స్పెషల్‌ స్క్రీనింగ్‌లు పూర్తి చేసుకుంది. ఆస్కార్స్‌కు డైరెక్ట్ నామినేషన్‌ కోసం డైరెక్టర్‌ రాజమౌళి.. తీవ్రంగా ప్రయత్నించాడు. అందులో భాగంగా గతంలో అమెరికా మొత్తం కలియ తిరుగుతూ మూవీ స్పెషల్‌ స్క్రీనింగ్‌లకు హాజరయ్యాడు. అతడు చేసిన కృషి ఫలించి ఆర్‌ఆర్‌ఆర్‌ ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ పురస్కారాలు గెలుచుకుంది.

అంతేకాదు ఆస్కార్స్‌ కోసం ఈ మూవీలోని నాటు నాటు సాంగ్‌ కూడా షార్ట్ లిస్ట్‌ అయిన విషయం తెలిసిందే. బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్ కేటగిరీలో ఈ పాట షార్ట్ లిస్ట్‌ అయింది. అంతేకాదు అంతకుముందు గోల్డెన్‌ గ్లోబ్స్‌లోనూ రెండు కేటగిరీల్లో ఈ సినిమా నామినేట్‌ అయింది.

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా గతేడాది పాన్‌ ఇండియా లెవల్లో సంచలనం సృష్టించింది. రూ.1200 కోట్ల వరకూ కలెక్షన్లతో ఆల్‌టైమ్‌ కలెక్షన్ల లిస్ట్‌లో మూడోస్థానంలో నిలిచింది. ఇక నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎందరో హాలీవుడ్‌ ప్రముఖులు కూడా సినిమాపై ప్రశంసలు కురిపించారు. అటు జపాన్‌లోనూ బాక్సాఫీస్‌ రికార్డులను బ్రేక్‌ చేసింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం