Ravi Teja Remuneration: వరుస ఫ్లాప్‌లు.. అయినా రెమ్యునరేషన్ పెంచేశాడు-ravi teja hiked his remuneration again after ravanasura debacle ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Ravi Teja Hiked His Remuneration Again After Ravanasura Debacle

Ravi Teja Remuneration: వరుస ఫ్లాప్‌లు.. అయినా రెమ్యునరేషన్ పెంచేశాడు

Hari Prasad S HT Telugu
May 11, 2023 05:59 PM IST

Ravi Teja Remuneration: వరుస ఫ్లాప్‌లు.. అయినా రెమ్యునరేషన్ పెంచేశాడు మాస్ మహారాజా రవితేజ. రావణాసుర మూవీ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా విఫలమైనా తన నెక్ట్స్ మూవీకి అతడు భారీ మొత్తం తీసుకుంటుండటం విశేషం.

రవితేజ
రవితేజ

Ravi Teja Remuneration: మాస్ మహారాజా రవితేజ మరోసారి తన రెమ్యునరేషన్ పెంచేశాడు. గత కొన్నాళ్లుగా ధమాకా, వాల్తేర్ వీరయ్య తప్ప పెద్దగా హిట్లు లేని ఈ హీరో.. రెమ్యునరేషన్ విషయంలో మాత్రం తగ్గడం లేదు. ఈ మధ్యే వచ్చిన రావణాసుర కూడా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా పడింది. ధమాకా రూ.100 కోట్లకుపైగా వసూలు చేసిన తర్వాత ఈ రావణాసురపై రవితేజ భారీ ఆశలే పెట్టుకున్నాడు.

కానీ సినిమా మాత్రం అతన్ని తీవ్రంగా నిరాశపరిచింది. ప్రస్తుతం టైగర్ నాగేశ్వర రావు సినిమా చేస్తున్న అతడు.. ఆ తర్వాత కలర్ ఫొటో డైరెక్టర్ సందీప్ రాజ్ డైరెక్షన్ లో మరో సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ కోసం రవితేజ ఏకంగా రూ.25 కోట్లు వసూలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సినిమా హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా రవితేజ మాత్రం తన ఫీజు పెంచేస్తుండటం విశేషం.

ధమాకా కంటే ముందు అతడు నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ, డిస్కో రాజా, క్రాక్, రామారావ్ ఆన్ డ్యూటీలాంటి సినిమాలు విఫలమయ్యాయి. అయినా అతడు అడుగుతున్న భారీ రెమ్యునరేషన్లకు ప్రొడ్యూసర్లు సరే అంటున్నారు. ఇక రవితేజ, సందీప్ రాజ్ మూవీలో శర్వానంద్ కూడా నటిస్తున్నాడని, ఈ ఇద్దరూ టీచర్, స్టూడెంట్ పాత్రల్లో కనిపిస్తున్నట్లు సమాచారం.

దీనికి సంబంధించిన అధికారిక సమాచారం త్వరలోనే రానుంది. మరోవైపు రవితేజ ఈగల్ మూవీలోనూ నటిస్తున్నాడు. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేస్తున్నాడు.

IPL_Entry_Point

సంబంధిత కథనం