Mumbaikar OTT Release Date: నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అవుతున్న విజయ్ సేతుపతి హిందీ మూవీ
Mumbaikar OTT Release Date: నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అవుతోంది విజయ్ సేతుపతి నటించిన తొలి హిందీ మూవీ. ఈ సినిమా పేరు ముంబైకర్. ఈ మూవీ జూన్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ట్రెండింగ్ వార్తలు
చివరికి ఈ సినిమాను థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకి తీసుకురావాలని నిర్ణయించడం విశేషం. ముంబైకర్ మూవీ జూన్ 2న జియోసినిమాలోకి రాబోతోంది. ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తూ ఓ టీజర్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో విజయ్ సేతుపతి ఓ గ్యాంగ్‌స్టర్ గా కనిపిస్తున్నాడు. ఓ చిన్నారిని అతడు కిడ్నాప్ చేయడం ఇందులో చూడొచ్చు.
ఆ పిల్లాడు ముంబైలో ఓ డాన్ కొడుకే కావడం ఇక్కడ ట్విస్ట్. టీజర్ మొత్తం ఆ కిడ్నాప్ చుట్టే తిరిగింది. ఇందులో విజయ్ సేతుపతి హిందీ మాట్లాడే తీరు నవ్వు తెప్పిస్తుంది. ఇంతకుముందే ఫర్జీ అనే వెబ్ సిరీస్ తో విజయ్ సేతుపతి హిందీ మార్కెట్ లో అడుగుపెట్టాడు. ఆ సిరీస్ కు మంచి రెస్పాన్స్ రావడంతోపాటు విజయ్ నటనకు కూడా పాజిటివ్ మార్కులు పడ్డాయి.
ప్రముఖ డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ సంతోష్ శివన్ డైరెక్ట్ చేసిన ఈ ముంబైకర్ మూవీలో విజయ్ సేతుపతితోపాటు విక్రాంత్ మస్సీ, తాన్యా మాణిక్‌తలా, రాఘవ్ బిర్నానీ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ స్క్రిప్ట్ అందించడం విశేషం. ఈ సినిమా హిందీతోపాటు తెలుగు, తమిళంలోనూ అందుబాటులో ఉండనుంది.
సంబంధిత కథనం